ధర్మపురి అర్వింద్ అండ్ 5 ఎడిటర్స్ ప్రత్యేక ఇంటర్వూ.. వీడియో..

Srikar T

|

Updated on: Mar 03, 2024 | 7:39 PM

ధర్మపురి అర్వింద్ పెద్దగా పరిచయం అక్కర్లేని నేత. నిజామాబాద్ ఎంపీగా గెలిచి తనదైన శైలిలో రాజకీయ ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు. పసుపు బోర్టు ఏర్పాటు చేస్తానని బాండు కూడా రాసిచ్చి ఆ హామీని సాకారం చేసుకున్నారు. తాజాగా ఆయనకు మరోసారి ఎంపీగా బరిలో దిగేందుకు బీజేపీ అధిష్టానం టికెట్ కేటాయించింది.

ధర్మపురి అర్వింద్ పెద్దగా పరిచయం అక్కర్లేని నేత. నిజామాబాద్ ఎంపీగా గెలిచి తనదైన శైలిలో రాజకీయ ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు. పసుపు బోర్టు ఏర్పాటు చేస్తానని బాండు కూడా రాసిచ్చి ఆ హామీని సాకారం చేసుకున్నారు. తాజాగా ఆయనకు మరోసారి ఎంపీగా బరిలో దిగేందుకు బీజేపీ అధిష్టానం టికెట్ కేటాయించింది. దీంతో తెలంగాణ నిజామాబాద్ నుంచే మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

కవితపై లిక్కర్ స్కాం మొదలు రైతుల సమస్యల పరిష్కారం వరకూ ప్రతి ఒక్క అంశంలో సంచలనమైన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. దీంతో పాటు ఎంఐఎం అధినేత ఓవైసీ లాంటి మైనార్టీ నాయకులకు తన హిందుత్వం వాదనలతో సరైన సమాధానం చెబుతూ వచ్చారు. రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాధించుకున్నారు ధర్మపురి అర్వింద్. టీవీ9 ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధర్మపురి అర్వింద్ విత్ 5 ఎడిటర్స్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై సీనియర్ సంపాదకులు అడిగిన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Published on: Mar 03, 2024 07:08 PM