TDP: చీపురుపల్లి నుంచి భీమిలి చేరిన రాజకీయం వయా విజయవాడ..?

ఆ మాజీ ఎమ్మెల్యే పోటీ చేసేది ఎక్కడ నుంచి? చీపురు పల్లిలోనా? భీమిలోనా? పార్టీ అధిష్టానం ఏమో ఆయనను చీపురుపల్లి నుంచి పోటీ చేయమంటోంది. ఆయన మనసంతా భీమిలిపై ఉంది. గెలుపు ఓటములు పక్కన పెడితే విశాఖ జిల్లా వదిలి వెళ్లడం ఆయనకు అసలు ఇష్టం లేదు. ఆయనకే కాదు ఆయన అనుచరులు, శ్రేయోభిలాషులకు ఇష్టం లేదు.

TDP: చీపురుపల్లి నుంచి భీమిలి చేరిన రాజకీయం వయా విజయవాడ..?
Ganta Srinivas Rao
Follow us

| Edited By: Srikar T

Updated on: Mar 03, 2024 | 3:10 PM

ఆ మాజీ ఎమ్మెల్యే పోటీ చేసేది ఎక్కడ నుంచి? చీపురు పల్లిలోనా? భీమిలోనా? పార్టీ అధిష్టానం ఏమో ఆయనను చీపురుపల్లి నుంచి పోటీ చేయమంటోంది. ఆయన మనసంతా భీమిలిపై ఉంది. గెలుపు ఓటములు పక్కన పెడితే విశాఖ జిల్లా వదిలి వెళ్లడం ఆయనకు అసలు ఇష్టం లేదు. ఆయనకే కాదు ఆయన అనుచరులు, శ్రేయోభిలాషులకు ఇష్టం లేదు. ఇంత కన్ఫ్యూజన్ కొనసాగుతూ వుండగానే ఆయనేమో భీమిలి నియోజకవర్గంలో ఇంటింటికీ చీర, పంచె, పసుపు, కుంకుమ కలిపి పంచడం ప్రారంభించేశాడు. అంటే భీమిలి నుంచే పోటీ చేయాలని డిసైడ్ అయినట్టే అన్నది ఆయన అనుచరుల నుంచి వస్తున్న సమాచారం.

బొత్స vs గంటా అన్నది టీడీపీ వ్యూహం

గంటా గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆయన గురించి తాజాగా చెప్పాల్సి వస్తే చీపురుపల్లి నుంచి పోటీ చేస్తారా? లేదా తను ఆశిస్తున్న భీమిలి నుంచే పోటీ చేయబోతున్నారా? ఈ రెండు అంశాల మధ్య విస్తృతమైన చర్చే ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రంలో తీవ్ర చర్చ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఉత్తరాంధ్రలో గెలుపుపై వేసిన వ్యూహంలో భాగంగా వైఎస్ఆర్‎కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేత బొత్స సత్యనారాయణకి చెక్ పెట్టేందుకు గంటాని వాడాలని టిడిపి నిర్ణయించింది. అందులో భాగంగానే గంటాను విశాఖ నుంచి కాకుండా విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి బొత్స పై పోటీకి దించాలని ఆలోచిస్తోంది. ఆ విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా గంటను పిలిచి వివరించారు. ఒకవేళ బొత్స చీపురుపల్లి నుంచి పోటీ చేస్తే గంటాను చీపురుపల్లి నుంచి పోటీ చేయాల్సి వస్తుందని, కొన్ని స్పెక్యులేషన్స్ వినిపిస్తున్నాయి. ఆయన భీమిలి నుంచి పోటీ చేస్తారని వస్తున్న వార్తల నేపథ్యంలో.. అవసరమైతే భీమిలి నుంచి, బొత్స ఎంపీగా పోటీ చేస్తే ఆయనకు ధీటుగా ఎంపీగా అయినా బరిలో నిలవాల్సి వస్తుందని అందుకు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు గంటాకు స్వయంగా కోరారట. చంద్రబాబును కలిసిన తర్వాత తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ గంటానే ఈ విషయాలను స్వయంగా వివరించారు. అప్పటికే సుదీర్ఘకాలం పాటు ఈ వ్యవహారం కొనసాగుతున్న నేపథ్యంలో బొత్స పై పోటీ ఎలా ఉంటుందన్న అంశంపై గంటా అనేకసార్లు అనేక మందితో ఆరా తీశారట. అనేక సర్వేలు కూడా చేయించారట. సర్వేల్లో మొదట కొంత వ్యతిరేకత కనిపించినప్పటికీ ఆ తర్వాత బొత్సపై విజయం సాధించే అవకాశాలు కూడా ఉన్నట్టు తాజా ఫలితాలు వచ్చాయట. తెలుగుదేశం పార్టీ అధినేత కూడా అదే విషయాన్ని గంటాకు స్పష్టం చేశారట. చీపురుపల్లి కానీ భీమిలి కానీ ఎక్కడైనా బొత్సపై పోటీ చేస్తే గంటాకే విజయ అవకాశాలు ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ సర్వేల్లో తేలిందట. కానీ గంటా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ వ్యవహారంలో ఇంకా స్పష్టత రాలేదు.

రేపో, ఎల్లుండో చంద్రబాబు‎ను కలవనున్న గంటా..

ఈ నేపథ్యంలో రేపో, ఎల్లుండో మళ్ళీ విజయవాడలో చంద్రబాబును కలవనున్నారు గంటా. ఆయనను చీపురుపల్లి నుంచి పోటీ చేయించాలని తెలుగుదేశం పార్టీ భావిస్తుంటే మనసంతా భీమిలిలో ఉన్న గంటా మాత్రం భీమిలిలో కార్యకర్తలని, ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలను ప్రారంభించారు. భీమిలిలో దాదాపు లక్ష కుటుంబాలకు ఖరీదైన చీర, పంచెతో పాటు పసుపు, కుంకుమ కూడా ఇవ్వాలని నిర్ణయించి, ఆల్రెడీ పంపకం కూడా ప్రారంభించేశారట. ఒక్కో కిట్ వెయ్యి రూపాయల విలువ చేసే వీటిని ముందుగా ఎండాడ, మధురవాడలలోని కళ రెసిడెన్షియల్ ఏరియాలో పంపంకం ప్రారంభించారు. ఒకవైపు గంటాను చీపురుపల్లి నుంచి పోటీ చేయించాలని టీడీపీ భావిస్తూ ఉంటే గంటా మాత్రం భీమిలిలో ఇలా పంచడాన్ని ఎలా చూడాలన్నది అర్దం కానీ పరిస్థితి.

కుమారుడి కైనా భీమిలి అడుగుతున్న గంటా

మరోవైపు గంట ఒకవేళ తాను కచ్చితంగా చీపురుపల్లి నుంచి పోటీ చేయాల్సి వస్తే భీమిలి నుంచి తన కుమారుడు రవితేజకు టికెట్ ఇప్పించుకోవాలన్న ఆలోచనలో కూడా ఉన్నారట. ఇప్పటివరకు తమకంటూ ప్రత్యేకమైన నియోజకవర్గం లేకుండా ఒక్కోసారి ఒక్కో నియోజకవర్గంలో పోటీ చేస్తూ విజయం సాధిస్తూ వచ్చిన గంట.. తన రాజకీయ వారసుడైన కుమారుడికి మాత్రం భీమిలి నియోజకవర్గం ఉండేలా చేయాలనుకుంటున్నాడట. అందుకే తనను చీపురుపల్లి నుంచి పోటీ చేయించాలని అధిష్టానం గట్టిగా భావిస్తే ప్రత్యామ్నాయంగా భీమిలి నుంచి తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబుని గంట కోరే అవకాశం ఉందట. ఆ మేరకు భీమిలి నుంచి తన కుమారుడి పేరు మీద సర్వే కూడా చేయించారట. సానుకూలమైన ఫలితాలే వచ్చాయని సమాచారం. ఇందుకు తెలుగుదేశం పార్టీ అంగీకరిస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. ఒక కుటుంబంలో ఇద్దరికీ టికెట్ ఇచ్చే అవకాశం ప్రస్తుతానికి లేదు. ఒకవేళ అలాంటి ఉంటే అయ్యన్నపాత్రుడు కూడా తన కుమారుడికి టికెట్ అడుగుతున్నారు. మరో సీనియర్ నేత బండారు సత్యనారాయణ కూడా తన కుమారుడికి ఏదో ఒక నియోజకవర్గాన్ని కేటాయించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో గంటని చీపురుపల్లి పంపిస్తారా లేదంటే భీమిలి నుంచే అవకాశం ఇస్తారా అన్నది మరికొద్ది రోజుల్లో తెలుగుదేశం పార్టీ డిసైడ్ చేయనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..