Andhra Pradesh: డాన్ మృతికి పోలీసు ఉన్నతాధికారుల సంతాపం.. అధికారిక లాంఛనా అంత్యక్రియలు!

శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ హత్యలు జరిగినా, దొంగతనాలు జరిగినా, పేలుళ్ళు జరిగిన ఆ డాన్‌దే కీలక పాత్ర. హైదరాబాద్‌లో శిక్షణ పొందిన డాన్ శ్రీకాకుళం జిల్లాలో తన కార్యకలాపాలు కొనసాగించాడు. అయితే ఇటీవల డాన్ తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ మైదానం అవరణంలో డాన్ అంత్య క్రియలు జరిగాయి.

Andhra Pradesh: డాన్ మృతికి పోలీసు ఉన్నతాధికారుల సంతాపం.. అధికారిక లాంఛనా అంత్యక్రియలు!
Police Dog Don
Follow us
S Srinivasa Rao

| Edited By: Balaraju Goud

Updated on: Mar 03, 2024 | 11:48 AM

శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ హత్యలు జరిగినా, దొంగతనాలు జరిగినా, పేలుళ్ళు జరిగిన ఆ డాన్‌దే కీలక పాత్ర. హైదరాబాద్‌లో శిక్షణ పొందిన డాన్ శ్రీకాకుళం జిల్లాలో తన కార్యకలాపాలు కొనసాగించాడు. అయితే ఇటీవల డాన్ తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ మైదానం అవరణంలో డాన్ అంత్య క్రియలు జరిగాయి. పోలీసుల అధికార లాంఛనాల మద్య అంత్యక్రియలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ రాధికతోపాటు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు అంత్యక్రియలకు హాజరయ్యారు. డాన్‌కి ఘన నివాళులర్పించారు.

అసలు ఎవరీ డాన్..

అసలు ఎవరీ డాన్.. పోలిసుల అధికారిక లాంచనాల నడుమ డాన్ అంత్యక్రియలకు జరగటం ఏంటి అనుకుంటున్నారా..? డాన్ ఒక పోలీసు జాగిలం. 2011 జూలై 24న జన్మించిన పోలీస్ జాగిలాంకు డాన్‌గా నామకరణం చేశారు. ఈ పోలీస్ జాగిలాం డాబర్ మెన్ బ్రీడ్ కు చెందినది. హైదరాబాదులో ఇంటిలిజెన్స్ సెక్యూరిటీ విభాగంలో శిక్షణ పొందిన అనంతరం డాన్ ను శ్రీకాకుళం జిల్లాకు కేటాయించారు.

పోలీస్ జాగిలం డాన్ ట్రాక్ రికార్డ్..

పోలీసు జాగిలం డాన్ ట్రాకర్ డాగ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. వృత్తిలో ఉత్తమ నైపుణ్యాన్ని సంపాదించింది డాన్. ఎచ్చెర్ల ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ B.V. రమణ ఈ డాగ్ ను హెండల్ చేసేవారు. హత్య, దొంగతనం వంటి నేరం జరిగిన ప్రదేశంలో సాక్ష్యాలను కనిపెట్టడం, పేలుడు పదార్థాల గుర్తింపు, నేరాలు చేధించుటలో తన వంతు ప్రతిభ కనబరుస్తూ వచ్చింది ఈ డాగ్. జిల్లా, స్టేట్ పోలీసు మీట్లలో జిల్లా తరపు నుంచి ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉన్నత అధికారులతో అనేక ప్రశంసలు అందుకుంది. పోలీసు శాఖలో 12 ఏళ్ల పాటు సేవలందించింది.

ఎచ్చెర్లలోని ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ మైదానంలో జరిగిన డాన్ అంత్యక్రియల్లో శ్రీకాకుళం జిల్లా ఎస్పీ G.R.రాధిక పాల్గొన్నారు. భౌతిక కాయoపై పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. డాన్ సేవలను మరువలేనివంటూ SP కొనియాడారు. విఐపి, వీవిఐపీల పర్యటనల సందర్భంలో బందోబస్తులో అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ మన్నలను పొందిందని ఎస్పీ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఐ రమేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. డాన్ అకాల మరణం జిల్లా పోలీస్ శాఖకు తీరనిలోటని సంఘీభావం తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..