AP Students: సీఎం జగన్ గుడ్ న్యూస్.. ఏపీ విద్యార్థులకు ఫ్రీ ల్యాప్ టాప్, వివరాలు ఇదిగో

ఏపీలో మొదటిసారి అధికారంలోకి సీఎం జగన్ ప్రభుత్వం ఇతర రంగాలతో పోలిస్తే విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొచ్చారు. ఇంగ్లీష్ మీడియాం, డిజిటల్ తరగతులు, గోరు ముద్ద లాంటి పథకాలతో గవర్నమెంట్ బళ్లను ఉన్నతంగా తీర్చిదిద్దారు. అయితే చాలా ప్రబుత్వ బడుల్లో డిజిటల్ క్లాసులు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

AP Students: సీఎం జగన్ గుడ్ న్యూస్.. ఏపీ విద్యార్థులకు ఫ్రీ ల్యాప్ టాప్, వివరాలు ఇదిగో
Ys Jagan Mohan Reddy
Follow us
Balu Jajala

|

Updated on: Mar 03, 2024 | 3:40 PM

ఏపీలో మొదటిసారి అధికారంలోకి సీఎం జగన్ ప్రభుత్వం ఇతర రంగాలతో పోలిస్తే విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొచ్చారు. ఇంగ్లీష్ మీడియాం, డిజిటల్ తరగతులు, గోరు ముద్ద లాంటి పథకాలతో గవర్నమెంట్ బళ్లను ఉన్నతంగా తీర్చిదిద్దారు. అయితే చాలా ప్రబుత్వ బడుల్లో డిజిటల్ క్లాసులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ద్రుష్టిలో పెట్టుకొని జగన్ ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా ఫ్రీ ల్యాప్ టాప్స్ అందించాలని నిర్ణయించుకుంది. 30 వేల విలువ చేసే ల్యాప్ టాప్స్ అందించనున్నారు.

ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న దృష్టి లోపం, వికలాంగుల విద్యార్థులకు రూ.30,000/- చొప్పున ఏపీటీఎస్ నుంచి రూ.60,000/- విలువైన 200 నోస్ ల్యాప్ టాప్ లను కొనుగోలు చేయాలని ప్రతిపాదించారు. వినికిడి లోపం ఉన్న (స్పీచ్ డిఫార్మెన్స్, ఆర్థోపెడికల్ ఛాలెంజ్డ్) విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ ట్యాప్స్ అందించాలని ప్రతిపాదించారు. అయితే తల్లిదండ్రులు నెలవారీ ఆదాయం  రూ.15,000 అంతకంటే ఎక్కువగా ఉంటే ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రూ.20,000 డబ్బులు చెల్లించి కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

03 డిసెంబర్ 2009న డబ్ల్యుసిడిఎ, ఎస్సీ డిపార్ట్ మెంట్ GO.Ms 395 ప్రకారం విద్యార్థులు, పిజి, ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న వ్యక్తులు, ప్రస్తుతం తరగతి చదువుతున్న గుర్తింపు పొందిన ప్రసిద్ధ పాఠశాల / కళాశాల నుండి బోనఫైడ్ సర్టిఫికేట్ సమర్పించాలి.

డబుల్ క్లెయిమ్ లు/తప్పుడు క్లెయిమ్ లను నివారించడం కొరకు డిపార్ట్ మెంట్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్ లు/డిస్ట్రిక్ట్ మేనేజర్ లు ల్యాప్ టాప్ కొరకు లబ్ధిదారుల రికార్డులను మెయింటైన్ చేయాలి.

ప్రతి విద్యార్థి తాను చదువుతున్న పాఠశాల/కళాశాల నుంచి బోనఫైడ్ సర్టిఫికేట్, పేరెంట్స్ ఇన్ కమ్ సర్టిఫికేట్, సదరం సర్టిఫికేట్, ఆధార్ కార్డు, సెల్ నెంబరు మొదలైనవి సమర్పించాల్సి ఉంటుంది. ఒక విద్యార్థికి జీవితకాలంలో ఒకేసారి ఇవ్వబడుతుంది. మరిన్ని వివరాలకు ఈ వెబ్ సైట్ ను విజిట్ చేయాలి. http://apdascac.ap.gov.in