AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అమ్మకు ప్రేమతో.. చనిపోయిన తల్లికి కొడుకులు ఏం చేశారో తెలిస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే!

తమ అమ్మ నాన్న 50వ వివాహ వార్షికోత్సవాన్ని బంధుమిత్రులతో ఘనంగా జరుపుకోవాలని భావించారు ఆ ఇంటి పిల్లలు. అయితే గత ఏడాది తల్లి మరణించడంతో తమ చిరాకల కోరికకు దూరమయ్యారు. అయితే కుమారులు అచ్చం తల్లి విగ్రహాన్ని తయారు చేసి, తండ్రి పక్కన పెట్టి  సెలబ్రేషన్స్ చేసుకున్నారు.

Andhra Pradesh: అమ్మకు ప్రేమతో.. చనిపోయిన తల్లికి కొడుకులు ఏం చేశారో తెలిస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే!
Sons Love
Balu Jajala
|

Updated on: Mar 03, 2024 | 3:50 PM

Share

తమ అమ్మ నాన్న 50వ వివాహ వార్షికోత్సవాన్ని బంధుమిత్రులతో ఘనంగా జరుపుకోవాలని భావించారు ఆ ఇంటి పిల్లలు. అయితే గత ఏడాది తల్లి మరణించడంతో తమ చిరాకల కోరికకు దూరమయ్యారు. అయితే కుమారులు అచ్చం తల్లి విగ్రహాన్ని తయారు చేసి, తండ్రి పక్కన పెట్టి  సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కొడుకులు చేసిన పనిని ప్రతిఒక్కరూ అభినందిస్తూ సోషల్ మీడియాలో గ్రేట్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

గుమ్మడిదలకు చెందిన చెన్నంశెట్టి నాగలక్ష్మి (67) గత ఏడాది ఫిబ్రవరి 5న ఊపిరితిత్తుల వ్యాధితో మృతి చెందింది. తన 50వ వివాహ వార్షికోత్సవాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్న విషయాన్ని ఆమె తన ఐదుగురు కుమారులు, కోడళ్లు, మనవరాళ్లతో పంచుకునేవారని పిల్లలు తెలిపారు. ఆ కుటుంబం మెల్లగా కోలుకోగా, పిల్లలు తమ తల్లి చివరి కోరికను గుర్తుకు తెచ్చుకుని గుంటూరుకు చెందిన ఓ కళాకారుడిని సంప్రదించి ఆమె విగ్రహాన్ని సిద్ధం చేశారు. శుక్రవారం గుమ్మడిదలలోని ఓ ఫంక్షన్ హాల్ లో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి సుమారు 1,500 మంది బంధుమిత్రులను ఆహ్వానించారు.

నాగలక్ష్మి, సత్యనారాయణ దంపతుల చిన్న కుమారుడు చెన్నంశెట్టి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ 1974లో పూలదండలు కూడా లేని సమయంలో తమ తల్లిదండ్రులు నిరాడంబరంగా వివాహం చేసుకున్నారని తెలిపారు. వృత్తిరీత్యా రైస్ మిల్లు టెక్నీషియన్ అయిన సత్యనారాయణ పెద్ద కుమారుడు పుట్టిన తర్వాత 1978లో ఆంధ్రప్రదేశ్ లోని భీమవరం నుంచి గుమ్మడిదలకు వలస వచ్చారు. ఈ దంపతులకు మరో నలుగురు కుమారులు ఉన్నారు, వారు వివాహం చేసుకుని వివిధ వ్యాపారాలలో స్థిరపడ్డారు. సత్యనారాయణ, నాగలక్ష్మి దంపతులకు 10 మంది మనవరాళ్లు ఉన్నారు. స్నేహితులు, బంధువులు కొడుకులు చేసిన మంచి పనిని అభినందించగా, సత్యనారాయణ కళ్లు చెమ్మగిల్లాయి.