AP Night Curfew: ఏపీలో మరోసారి నైట్ కర్ఫ్యూ పొడిగింపు.. ఎప్పటివరకంటే.?
కరోనా కట్టడిలో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమలవుతున్న నైట్ కర్ఫ్యూను మరోసారి పొడిగించింది..
కరోనా కట్టడిలో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమలవుతున్న నైట్ కర్ఫ్యూను మరోసారి పొడిగించింది. సెప్టెంబర్ 4వ తేదీ వరకు రాత్రిపూట ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది. ప్రతీ రోజూ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా ఉంటే ఏపీలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. అయితే థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తుండటంతో జగన్ సర్కార్ తగిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే మరోసారి నైట్ కర్ఫ్యూను పొడిగించింది. రోడ్లపైకి వచ్చే జనాలు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని వైద్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.
కాగా, గురువారం ఆంధ్రప్రదేశ్‌లో 67,716 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,501 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడినవారి సంఖ్య 19,98,603 కు చేరింది. ఇక, నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి మరో 10 మంది మృత్యువాతపడ్డారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం మరణించిన వారి సంఖ్య 13,696కు చేరింది. గడిచిన 24 గంటల్లో 1,697 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 19 లక్షల 69 వేల 169 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 15,738 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Also Read:
తిరగబడిన అడవి దుప్పి.. చిరుతకు చుక్కలు చూపించింది.. వీడియో చూస్తే షాకే..
ఫోన్ చూస్తూ భర్త ముసిముసి నవ్వులు.. కథేంటా అని ఆరా తీసిన భార్య ఫ్యూజులు ఔట్.!
వీడు మామూలోడు కాదు.. డివిలియర్స్‌ను మించిపోయాడు.. డెబ్యూ మ్యాచ్‌లో ఫాస్టెస్ట్ అర్ధ శతకం సాధించాడు..
షాపింగ్ చేస్తుండగా మహిళకు షాక్.. ఎదురుగా భారీ కొండచిలువ.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!