AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: షాపింగ్ చేస్తుండగా మహిళకు షాక్.. ఎదురుగా భారీ కొండచిలువ.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!

పాము కనిపిస్తే.. కొంచెం భయం వేసినా ఏ కర్ర పట్టుకుని కొట్టి చంపడమో.. చప్పుడు చేసి బెదిరించి పంపేయడమో చేస్తాం. కానీ కొండచిలువ..

Viral Video: షాపింగ్ చేస్తుండగా మహిళకు షాక్.. ఎదురుగా భారీ కొండచిలువ.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!
Python
Ravi Kiran
|

Updated on: Aug 19, 2021 | 12:47 PM

Share

పాము కనిపిస్తే.. కొంచెం భయం వేసినా ఏ కర్ర పట్టుకుని కొట్టి చంపడమో.. చప్పుడు చేసి బెదిరించి పంపేయడమో చేస్తాం. కానీ కొండచిలువ కనిపిస్తే.. ఇంకేమైనా ఉందా.! ఒక్క క్షణం గుండె ఆగినంత పనవుతుంది. సరిగ్గా ఇదే పరిణామం ఒక మహిళకు ఎదురైంది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళ కిచెన్‌కు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసేందుకు దగ్గరలోని సూపర్ మార్కెట్‌కు వెళ్లింది. పచ్చళ్ల సెషన్‌లో షాపింగ్ చేస్తుండగా సుమారు 10 అడుగుల పొడవున్న కొండచిలువ ఎదురుపడింది. ఆ మహిళ షాపు యజమానికి చెప్పింది. దీనితో అతడు వన్యప్రాణి సంరక్షణ విభాగానికి సమాచారం అందించాడు. అయితే ఈలోపే అక్కడున్న మిగిలినవారు ఆ కొండచిలువను వీడియోలు తీయడంతో.. అవి కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

కాగా, సమాచారం అందుకున్న వెంటనే వన్యప్రాణి సంరక్షణ సిబ్బంది అక్కడికి చేరుకొని కొండచిలువను బంధించారు. అనంతరం సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని సిడ్నీలో చోటు చేసుకుంది. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.!

Also Read:

40 బంతుల్లో తుఫాన్ ఇన్నింగ్స్.. 10 భారీ సిక్సర్లతో బౌలర్ల ఊచకోత.. దుమ్ముదులిపిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్..

ఉదయాన్నే టిఫిన్‌లో ఈ 5 ఆహార పదార్ధాలు అస్సలు తినొద్దు.. తస్మాత్ జాగ్రత్త.! అవేంటంటే..

ఈ నాలుగు రాశులవారు ప్రేమించినవారిని కష్ట సమయాల్లో ఒంటరిగా వదిలిపెట్టరు.. అందులో మీరున్నారా?

హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్స్ రైడ్‌.. ఇలా బుక్‌ చేసుకోండి!
హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్స్ రైడ్‌.. ఇలా బుక్‌ చేసుకోండి!
ధనుష్- మృణాళ్ పెళ్లి రూమర్లు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?
ధనుష్- మృణాళ్ పెళ్లి రూమర్లు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?
దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచిన తెలంగాణ..!
దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచిన తెలంగాణ..!
సూరీడు గుర్తున్నాడా..? ఆయన గురించి చాలామందికి తెలియని నిజం..
సూరీడు గుర్తున్నాడా..? ఆయన గురించి చాలామందికి తెలియని నిజం..
ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ ఇచ్చారు.. కానీ మిస్ అయ్యింది
ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ ఇచ్చారు.. కానీ మిస్ అయ్యింది
ఇది కదా అసలైన పండుగంటే.. ఆ ఊరిలో గోమాత అలంకరణ పోటీలు!
ఇది కదా అసలైన పండుగంటే.. ఆ ఊరిలో గోమాత అలంకరణ పోటీలు!
మీరు మౌని అమావాస్య నాడు ఉపవాసం ఉంటున్నారా..? ఈ విషయాలు..
మీరు మౌని అమావాస్య నాడు ఉపవాసం ఉంటున్నారా..? ఈ విషయాలు..
సంక్రాంతి పేరుతో గ్రాండ్ గిఫ్ట్ .. క్లిక్ చేస్తే ఖేల్ ఖతం!
సంక్రాంతి పేరుతో గ్రాండ్ గిఫ్ట్ .. క్లిక్ చేస్తే ఖేల్ ఖతం!
బౌలరును వెక్కిరించబోయి వికెట్ పారేసుకున్న పాక్ క్రికెటర్
బౌలరును వెక్కిరించబోయి వికెట్ పారేసుకున్న పాక్ క్రికెటర్
‘మన శంకర వరప్రసాద్’కి నెగెటివ్ రివ్యూ ఇచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ
‘మన శంకర వరప్రసాద్’కి నెగెటివ్ రివ్యూ ఇచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ