40 బంతుల్లో తుఫాన్ ఇన్నింగ్స్.. 10 భారీ సిక్సర్లతో బౌలర్ల ఊచకోత.. దుమ్ముదులిపిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్..

40 బంతుల్లో తుఫాన్ ఇన్నింగ్స్.. 10 భారీ సిక్సర్లతో బౌలర్ల ఊచకోత.. దుమ్ముదులిపిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్..
Liam Livingstone

వైట్ బాల్ క్రికెట్‌లో ఇంగ్లాండ్ జట్టుకు తిరుగులేదని చెప్పాలి. వన్డేల్లో ఎన్నో అద్భుత రికార్డులు ఈ జట్టు సొంతం. జాసన్ రాయ్, బట్లర్, మోర్గాన్ వంటి..

Ravi Kiran

|

Aug 18, 2021 | 9:57 AM

వైట్ బాల్ క్రికెట్‌లో ఇంగ్లాండ్ జట్టుకు తిరుగులేదని చెప్పాలి. వన్డేల్లో ఎన్నో అద్భుత రికార్డులు ఈ జట్టు సొంతం. జాసన్ రాయ్, బట్లర్, మోర్గాన్ వంటి ఎంతోమంది బ్యాట్స్‌మెన్ ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపిస్తారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో మూడో మ్యాచ్ ఆగష్టు 25వ తేదీ నుంచి మొదలు కానుంది. ఇక అటు ‘ది హండ్రెడ్’ టోర్నమెంట్‌లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఆదరగొడుతున్నారు. ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ అటు బ్యాట్, ఇటు బాల్‌తో దుమ్ముదులిపాడు.

తాజాగా బర్మింగ్‌హామ్ ఫీనిక్స్, నార్తర్న్ సూపర్‌ఛార్జర్స్ జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ చిన్న సైజు విధ్వంసం సృష్టించాడు. మొదట బ్యాటింగ్ చేసిన సూపర్‌ఛార్జర్స్ జట్టుకు ఓపెనర్లు క్రిస్ లిన్, టామ్ కోహ్లర్-కాడ్‌మోర్ 54 బంతుల్లో 95 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత లిన్(34) పరుగులకు ఔట్ అయ్యాడు. అలాగే క్యాడ్‌మోర్(71) అర్ధ శతకంతో రాణించాడు. ఇక ఫీనిక్స్ జట్టు తరఫున.. లివింగ్‌స్టన్ 20 బంతుల్లో 25 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. దీనితో సూపర్ ఛార్జర్స్ 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది.

ఫైనల్ చేరుకోవాలంటే ఫీనిక్స్ 144 పరుగుల లక్ష్యాన్ని చేధించాలి. అయితే ఆ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ విల్ స్మీడ్ ఖాతా తెరవకుండానే అవుట్ అయ్యాడు. అయితే అప్పుడే క్రీజులోకి వచ్చిన కెప్టెన్ లివింగ్‌స్టోన్ సిక్సర్ల వర్షం కురిపించాడు. న్యూజిలాండ్ యువ ఓపెనర్ ఫిన్ అలెన్‌తో కలిసి 51 బంతుల్లో 106 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 26 బంతుల్లో 42 పరుగులు చేసి ఫిన్ అలెన్ అవుట్ కాగా.. లివింగ్‌స్టోన్ మాత్రం బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 40 బంతుల్లో 10 సిక్సర్లు, 3 ఫోర్లతో 90 పరుగులు చేశాడు. ఈ సూపర్బ్ ఇన్నింగ్స్‌తో తన టీంను ఫైనల్‌కు చేర్చాడు. మరో సెమీఫైనల్ మ్యాచ్ ఆగష్టు 19న గురువారం సదరన్ బ్రేవ్స్, ట్రెంట్ రాకెట్స్ మధ్య జరగనుంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu