ఉదయాన్నే టిఫిన్‌లో ఈ 5 ఆహార పదార్ధాలు అస్సలు తినొద్దు.. తస్మాత్ జాగ్రత్త.! అవేంటంటే..

ఉదయాన్నే అధిక పోషకాలు ఉండే ఆహారాన్ని అల్పాహారంగా తీసుకోవడం వల్ల రోజంతా ఆరోగ్యంగా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు...

Aug 18, 2021 | 8:41 AM
Ravi Kiran

|

Aug 18, 2021 | 8:41 AM

కొందరు వ్యక్తులు అల్పాహారంలో పరాటా, బ్రెడ్‌లను తింటుంటారు. పరాటాలో నూనె శాతం అధికంగా ఉండటం వల్ల ఉదయం టిఫిన్‌లో తీసుకుంటే లేనిపోని ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలాగే రొట్టెలలో కార్బోహైడ్రేట్ అధికంగా ఉంటుంది. అందువల్ల దీన్ని ఉదయాన్నే అల్పాహారంగా తీసుకుంటే గ్యాస్ సమస్య వస్తుంది.

1 / 5
ఎన్నో ఆరోగ్య సమస్యలకు అరటిపండు చెక్ పెడుతుందని ఆరోగ్య నిపుణులు అంటుంటారు. కానీ అరటిపండును ఉదయాన్నే  ఖాళీ కడుపుతో తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దానిలో ఉండే పోషక అంశాలు.. శరీరంలో ఉండే కాల్షియం, మెగ్నీషియం స్థాయిలలో అసమతుల్యతను కలిగిస్తాయి.

2 / 5
చాలామంది డైటీషియన్లు పెరుగును డైట్‌లో చేర్చాలని సిఫార్సు చేస్తుంటారు. కానీ ఉదయం అల్పాహారంలో పెరుగు తింటే, లేనిపోని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. పెరుగులోని ఆమ్లత్వం కారణంగా అసిడిటీ సమస్యలు వస్తాయి. అలాగే దగ్గు, పుండ్లు వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి.

3 / 5
టమాటాలో అనేక పోషకాలు ఉంటాయి. పగటిపూట సలాడ్లు, కూరగాయలలో దీనిని ఎక్కువగా తీసుకోండి. కానీ బ్రేక్ ఫాస్ట్‌లో మాత్రం టమాటాలు తినవద్దు. వాటిల్లో ఉండే అమ్లత్వం కడుపు సంబంధిత సమస్యలు కలిగిస్తుంది. అసిడిటీ, గుండెల్లో మంట, కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలు ఏర్పడతాయి.

4 / 5
పచ్చళ్లు, చట్నీలు, నిమ్మకాయలు, నారింజలు, సిట్రస్ పండ్లు, ఇతర పుల్లని ఆహార పదార్ధాలను కూడా ఉదయం తినకూడదు. గుండెల్లో మంట వంటి సమస్యలు తలెత్తుతాయి.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu