Viral Video: తిరగబడిన అడవి దుప్పి.. చిరుతకు చుక్కలు చూపించింది.. వీడియో చూస్తే షాకే..

Viral Video: తిరగబడిన అడవి దుప్పి.. చిరుతకు చుక్కలు చూపించింది.. వీడియో చూస్తే షాకే..
Deer

చిరుత వేట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరుతపులులు అద్భుతమైన వేటగాళ్లు. సింహం, పులి మాదిరిగానే చిరుత వేట...

Ravi Kiran

| Edited By: Anil kumar poka

Aug 19, 2021 | 3:43 PM

చిరుత వేట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరుతపులులు అద్భుతమైన వేటగాళ్లు. సింహం, పులి మాదిరిగానే చిరుత వేట కూడా భయంకరంగా ఉంటుంది. తన ఎర కనుచూపు మేర నుంచి తప్పించుకోకుండా వ్యూహాన్ని రచించి వాయువేగంతో వేటాడుతుంది. ఇంతటి బలశాలి అయిన చిరుత కూడా అప్పుడప్పుడూ తడబడక తప్పదు. ఎంతటి బలవంతుడికైనా ఎప్పుడొకప్పుడు ఓటమిని చవి చూడాల్సిందే. అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. నమీబియా అడవుల్లో చిరుతకు, అడవిదుప్పికి మధ్య పోరాటం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇదిలా ఉంటే.. తల్లిప్రేమకు అద్దంపట్టే విధంగా ఎన్నో వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. మనుషుల్లోనైనా, జంతువులలో అయినా తల్లిప్రేమ ఒకేలా ఉంటుంది. ఎలాంటి హాని కలగకుండా ఉండేలా ప్రతీ తల్లి తన బిడ్డను సంరక్షిస్తుంది. వైరల్ వీడియో ప్రకారం.. ఓ చిరుత పిల్ల అడవిదుప్పిని వేటాడి తన నోట కరుచుకుంటుంది. అది కదలకుండా ఉండేలా తన పదునైన పంజాతో నొక్కి పెడుతుంది. ఆ చిరుతతో పాటు మరో చిరుత కూడా అక్కడికి చేరుకొని ఆహారాన్ని లాగించాలని సన్నద్ధం అవుతాయి. అయితే ఈ దృశ్యాలన్నీంటిని దూరం నుంచి తల్లి దుప్పి గమనిస్తుంది. ఇంకేముంది.. తన బిడ్డను రక్షించుకునేందుకు ఆ చిరుతలతో పోరాటానికి దిగుతుంది.

తల్లిదుప్పి రావడాన్ని గమనించిన ఓ చిరుత అక్కడ నుంచి పారిపోగా.. మరొకటి మాత్రం ఆ పిల్లదుప్పి నోట కరుచుకునే ఉంటుంది. తల్లిదుప్పి దాని దగ్గరకు వెళ్లి.. పిల్లదుప్పి బ్రతికే ఉన్నట్లు నిర్ధారించుకుని చిరుతపై దాడికి దిగుతుంది. పిల్లదుప్పిని తన వైపుకు తీసుకుని.. చిరుతపై ఎదురు తిరుగుతుంది. పరుగులు పెట్టిస్తుంది. దీనికి సంబంధించిన దృశ్యాలను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలో బంధించగా.. అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోను చూసి నెటిజన్లు కామెంట్స్, రీ-షేర్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.!

Also Read:

40 బంతుల్లో తుఫాన్ ఇన్నింగ్స్.. 10 భారీ సిక్సర్లతో బౌలర్ల ఊచకోత.. దుమ్ముదులిపిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్..

ఉదయాన్నే టిఫిన్‌లో ఈ 5 ఆహార పదార్ధాలు అస్సలు తినొద్దు.. తస్మాత్ జాగ్రత్త.! అవేంటంటే..

ఈ నాలుగు రాశులవారు ప్రేమించినవారిని కష్ట సమయాల్లో ఒంటరిగా వదిలిపెట్టరు.. అందులో మీరున్నారా?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu