Viral News: ఫోన్ చూస్తూ భర్త ముసిముసి నవ్వులు.. కథేంటా అని ఆరా తీసిన భార్య ఫ్యూజులు ఔట్.!

Viral News: ఫోన్ చూస్తూ భర్త ముసిముసి నవ్వులు.. కథేంటా అని ఆరా తీసిన భార్య ఫ్యూజులు ఔట్.!
Wife

వివాహం అనేది గొప్ప బంధంగా అభివర్ణిస్తారు. అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రబుద్దులు వివాహ బంధానికి మచ్చ తెచ్చే విధంగా పనులు..

Ravi Kiran

| Edited By: Anil kumar poka

Aug 19, 2021 | 4:29 PM

వివాహం అనేది గొప్ప బంధంగా అభివర్ణిస్తారు. అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రబుద్దులు వివాహ బంధానికి మచ్చ తెచ్చే విధంగా పనులు చేస్తున్నారు. అలాంటి వార్తలు మనం తరచూ చూస్తూనే ఉంటాం. వివాహేతర సంబంధాలు ఎంతోమంది జీవితాలను నాశనం చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఓ ఘటన గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక్కడ ఓ ప్రబుద్దుడు తన భార్యకు తెలియకుండా మరో యువతిని పెళ్లాడి 15 ఏళ్ల నుంచి కాపురం చేస్తున్నాడు. భర్త చర్యలపై డౌట్ పడిన ఆ ఇల్లాలు.. ఆఖరికి అతడి గుట్టును రట్టు చేసింది.

వివరాల్లోకి వెళ్తే.. లండన్‌కు చెందిన మరియా గిల్లెన్ గార్సియా, టామ్ మెక్‌కేబ్‌లు భార్యాభర్తలు. వీరిద్దరి వివాహం 2009లో జరిగింది. వీరి మధ్య కొద్దిరోజుల పాటు అంతా బాగానే ఉంది. అయితే ఆ తర్వాత టామ్ మెక్‌కేబ్‌ వ్యవహారశైలి పూర్తిగా మారిపోయింది. తరచూ ఫోన్‌లో మునిగిపోవడం.. పక్కన ఉన్నవాళ్ల గురించి పట్టించుకోకపోవడం.. ఫోన్‌ను చూస్తూ ముసిముసి నవ్వులు నవ్వడం చేసేవాడు. ఇక భర్తలో వచ్చిన ఈ మార్పును గమనించిన మరియా.. తనకు తెలియకుండా భర్త ఏదో విషయాన్ని దాస్తున్నాడని అనుమానించింది. అదే క్రమంలో భర్తపై నిఘా పెట్టింది. అతడు లేని సమయంలో మొబైల్ ఫోన్‌ను పరిశీలించింది. వేరొకరి కుటుంబానికి చెందిన ఫోటోలు దర్శనమిచ్చాయి.

దీనితో భర్త టామ్ మెక్‌కేబ్‌ సోషల్ మీడియా అకౌంట్‌ను పరిశీలించగా.. అతడు వేరొక మహిళకు పంపిన లవ్ సింబల్స్, మెసేజ్‌లు చూసింది. వాటిని చదవడంతో తాను అతడికి రెండో భార్యనని మరియాకు స్పష్టమైంది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా తనను పెళ్లి చేసుకున్నాడని తెలుసుకుంది. దీంతో ఆమె టామ్ చేసిన మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో భాగంగా పోలీసులు తమదైన శైలిలో అడగగా.. టామ్ అసలు విషయాన్ని బయటపెట్టాడు. ఒకరికి తెలియకుండా మరొకరితో 15 సంవత్సరాలు పాటు రెండు కుటుంబాలను కొనసాగిస్తూ వచ్చానని నిజం ఒప్పుకున్నాడు.

Also Read:

40 బంతుల్లో తుఫాన్ ఇన్నింగ్స్.. 10 భారీ సిక్సర్లతో బౌలర్ల ఊచకోత.. దుమ్ముదులిపిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్..

ఉదయాన్నే టిఫిన్‌లో ఈ 5 ఆహార పదార్ధాలు అస్సలు తినొద్దు.. తస్మాత్ జాగ్రత్త.! అవేంటంటే..

ఈ నాలుగు రాశులవారు ప్రేమించినవారిని కష్ట సమయాల్లో ఒంటరిగా వదిలిపెట్టరు.. అందులో మీరున్నారా?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu