ముక్కంటి సాక్షిగా ఆ ఇద్దరి మధ్య పోటీ.. సంక్షేమం, అభివృద్దిపై చర్చకు సిద్దం అంటూ సవాల్ చేస్తున్న ఎమ్మెల్యే..

రాహు కేతు క్షేత్రం శ్రీకాళహస్తి వైసీపీ టిడిపిలకు హాట్ సీట్‎గా మారింది. ఎన్నికలకు ముందు నుంచే ఒకరిపై ఒకరు చాలెంజ్ లు, ఆరోపణలు, సవాళ్ళతో దూసుకుపోతున్నారు. అయితే ఇప్పుడు వార్ పీక్స్‎కి చేరుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ వర్సెస్ బొజ్జల సుధీర్ మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. అభివృద్ధి, అవినీతిపై బహిరంగ చర్చకు సాక్షాలతో సిద్ధమంటున్న ఇద్దరు నేతలు సార్వత్రిక ఎన్నికల్లో అమీ తుమీ తెలుసుకునేందుకు సిద్ధమయ్యారు.

ముక్కంటి సాక్షిగా ఆ ఇద్దరి మధ్య పోటీ.. సంక్షేమం, అభివృద్దిపై చర్చకు సిద్దం అంటూ సవాల్ చేస్తున్న ఎమ్మెల్యే..
Srikalahasthi
Follow us

| Edited By: Srikar T

Updated on: Apr 18, 2024 | 10:25 AM

రాహు కేతు క్షేత్రం శ్రీకాళహస్తి వైసీపీ టిడిపిలకు హాట్ సీట్‎గా మారింది. ఎన్నికలకు ముందు నుంచే ఒకరిపై ఒకరు చాలెంజ్ లు, ఆరోపణలు, సవాళ్ళతో దూసుకుపోతున్నారు. అయితే ఇప్పుడు వార్ పీక్స్‎కి చేరుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ వర్సెస్ బొజ్జల సుధీర్ మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. అభివృద్ధి, అవినీతిపై బహిరంగ చర్చకు సాక్షాలతో సిద్ధమంటున్న ఇద్దరు నేతలు సార్వత్రిక ఎన్నికల్లో అమీ తుమీ తెలుసుకునేందుకు సిద్ధమయ్యారు.

శ్రీకాళహస్తి దక్షిణకాశీగా విరాజిల్లుతున్న పుణ్యక్షేత్రం. రాజకీయంగా కూడా ఎప్పుడూ హాట్ సీటే. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, కూటమి అభ్యర్థిగా టిడిపి నుంచి బరిలో ఉన్న బొజ్జల సుధీర్ రెడ్డి మధ్య పోరు ఈ ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా మారింది. అభివృద్ధిని సాక్ష్యాలతో చూపించేందుకు సిద్ధమని ఒకరు.. అంతా అవినీతే అన్న ఆరోపణలతో మరొకరు ఇలా వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‎కు.. టిడిపి అభ్యర్థి బొజ్జల సుధీర్‎కు మధ్య డైలాగ్ వార్ ఎన్నికల వేళ అగ్గి రాజేస్తోంది. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే ఇద్దరి మధ్య వ్యక్తిగత దూషణలు, సెల్ఫీ చాలెంజ్‎లు, ఆరోపణలు, విమర్శలు, సవాళ్లు, శ్వేత పత్రం డిమాండ్‎లు వినిపించగా ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలు కావడంతో ఇప్పుడు మరింత హిట్ పెరిగింది. లోకల్, నాన్ లోకల్ అన్న విమర్శలు కూడా శ్రీకాళహస్తి రాజకీయాన్ని మరింత రంజుగా మార్చేసింది. టిడిపి అధినేత చంద్రబాబు నుంచి బొజ్జల సుధీర్ వరకు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిపై చేస్తున్న తీవ్ర ఆరోపణలు, కౌంటర్ ఎటాక్‎లు ఇప్పుడు శ్రీకాళహస్తిలో రీసౌండ్‎గా మారాయి. దాదాపు 40 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్న బొజ్జల ఫ్యామిలీ చేసిన అభివృద్ధి ఏంటో, ఐదేళ్లలో వైసీపీ అందించిన సంక్షేమం, చేసిన అభివృద్ధి ఏంటో బుక్ లెట్‎తో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. అలాగే తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఆస్తులపై ఇన్కమ్ టాక్స్ వద్ద తేల్చుకుందామంటున్న ఎమ్మెల్యే మధు ఆస్తుల వివరాలతో చర్చకు సిద్ధమని సవాలు విసురుతున్నారు. ఎలాంటి చర్చకైనా సిద్ధమనీ, దేనికైనా రెడీ అంటున్న బియ్యపు మధుసూధన్ టిడిపి అభ్యర్థి బొజ్జల సుధీర్ తనకు పోటీనే కాదంటున్నారు. పోటీ ఇస్తే అది సైజులో మాత్రమేనని సెటైర్లు వేస్తున్నారు. 30 ఏళ్లలో బొజ్జల ఫ్యామిలీ అభివృద్ధి చేసి ఉంటే ఈ 5 ఏళ్ల లో అభివృద్ధి పనులు చేయాల్సిన పనే ఉండేది కాదంటున్నారు ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి. ఎన్నో సేవా కార్యక్రమాలు శ్రీకాళహస్తిలో చేశానంటున్నారు ఆయన. బొజ్జల కుటుంబం 30 ఏళ్లలో చేసిన అవినీతిని బయట పెడతానంటున్నారు. సుధీర్ అన్నట్లు తాను సునామీలో కొట్టుకొచ్చిన గవ్వనే అయినా శంఖంలా శివుడికి ఉపయోగపడుతున్నానంటున్నారు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. అభివృద్ధి‎పై శ్వేత పత్రమే కాదు, కలర్ ఫోటోలతో కూడిన బుక్ లెట్ ఇంటింటికి అందచేస్తున్నానంటున్నారు. జరిగిన అభివృద్దిన, సంక్షేమాలపై చర్చకే కాదని టీవీ9 మీడియాతో వస్తే సాక్షాలతో చూపించేందుకు సిద్ధమంటున్నారు. తాను లోకల్ అంటూ అభివృద్ధి జరగలేదని నిరూపించే దమ్ము నాన్ లోకల్ అయిన టిడిపి అభ్యర్థి బొజ్జల సుధీర్‎కు ఉందా అని ప్రశ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

30 ఏళ్లలో బొజ్జల కుటుంబం చేసిన అభివృద్దే ఇప్పటికీ శ్రీకాళహస్తిలో కనిపిస్తోందని చెబుతున్నారు బొజ్జల సుధీర్. ఎమ్మెల్యే అక్రమాలు, ఆస్తులపై చర్చకు ఎప్పుడైనా సిద్దమని సవాలు చేస్తున్నారు బొజ్జల సుధీర్. ఓటమి భయంతో ఫ్రస్టేషన్‎లో చదువు కోని మధు చేసే ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన పని లేదంటున్నారు. అభివృద్ధి పనులు చేశానంటూ ఇంటింటికి బుక్ లెట్ పంచుతున్న ఎమ్మెల్యే మధు అరగంట ముందు సమాచారం ఇస్తే చర్చకు ఎక్కడికైనా వస్తానంటున్నారు సుధీర్. ఇక శ్రీకాళహస్తిలో 2.45 లక్షలకు పైగా ఓటర్లు ఉండగా 40,152 మంది ఓటర్లు అంటే 16.89 శాతం బీసీ సామాజికవర్గానికి చెందిన వన్నెకుల క్షత్రియులు ఉన్నారు. ఇక 6 శాతం అంటే 10,659 మంది యాదవ సామాజిక వర్గం వారు, 9 శాతం అనగా 21,370 మంది ముదిరాజ్ కమ్యూనిటీకి చెందిన ఓటర్లు, 6.6 శాతం 15,770 మంది ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు. ఇక బలిజ సామాజికవర్గ ఓటర్లు కూడా శ్రీకాళహస్తిలో కీలకం కాగా వైసీపీ, టిడిపి నుంచి ఇద్దరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులే బరిలో ఉన్నారు. ఈ ఇద్దరు నేతల మధ్య హాట్ కామెంట్స్ గెలుపు నీదా నాదా అన్నట్టు సాగుతోంది. దీంతో హీటెక్కిన శ్రీకాళహస్తి రాజకీయం ఎవరిని రాజుగా నిలబెడుతుందో వేచి చూడాల్సిదే.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
రికార్డు స్థాయిలో పెరిగిన జీఎస్‎టీ వసూళ్లు.. కేంద్ర ఆర్థిక మంత్రి
రికార్డు స్థాయిలో పెరిగిన జీఎస్‎టీ వసూళ్లు.. కేంద్ర ఆర్థిక మంత్రి
అజిత్‌కు ఎంతో ఇష్టమైంది గిఫ్ట్‌గా ఇచ్చి సర్‌ప్రైజ్ చేసిన షాలిని..
అజిత్‌కు ఎంతో ఇష్టమైంది గిఫ్ట్‌గా ఇచ్చి సర్‌ప్రైజ్ చేసిన షాలిని..
50 ఏళ్ల అల్లూరి సీతారామరాజు.. ఈ విషయాలు తెలుసా..?
50 ఏళ్ల అల్లూరి సీతారామరాజు.. ఈ విషయాలు తెలుసా..?
మీమ్స్‌లో కనిపించే ఈ ర్యాపర్ గుర్తున్నాడా.? ఇప్పుడేం చేస్తున్నాడో
మీమ్స్‌లో కనిపించే ఈ ర్యాపర్ గుర్తున్నాడా.? ఇప్పుడేం చేస్తున్నాడో
రాముడు చుట్టూ తిరుగుతున్న కరీంనగర్ రాజకీయం..!
రాముడు చుట్టూ తిరుగుతున్న కరీంనగర్ రాజకీయం..!
ఆస్కార్ కోసం RRR ని ఆదర్శంగా తీసుకుంటున్న సినిమాలు
ఆస్కార్ కోసం RRR ని ఆదర్శంగా తీసుకుంటున్న సినిమాలు
ప్రజల ఆశీస్సులే నాకు శ్రీరామరక్ష.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..
ప్రజల ఆశీస్సులే నాకు శ్రీరామరక్ష.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..
పాన్ ఇండియా సినిమాల్లో... స్పెషల్‌ సాంగుల సంగతేంటి ??
పాన్ ఇండియా సినిమాల్లో... స్పెషల్‌ సాంగుల సంగతేంటి ??
6 రోజులుగా మూలనుంది.. కట్ చేస్తే. ఆర్డర్ పార్శిల్‌ నుంచి శబ్దాలు
6 రోజులుగా మూలనుంది.. కట్ చేస్తే. ఆర్డర్ పార్శిల్‌ నుంచి శబ్దాలు
మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? ఈ ట్రిక్ సహాయంతో ఎక్కువసేపు!
మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? ఈ ట్రిక్ సహాయంతో ఎక్కువసేపు!