శ్రీరామునికి రెండు సార్లు కళ్యాణం.. ఆ తరువాతే గ్రామంలో పెళ్లి ముహూర్తాలు.. అదెక్కడో తెలుసా..

శ్రీరామునికి ఏడాదికి ఒక్కసారి మాత్రమే అభిజిత్ లగ్నంలో కళ్యాణం జరగడం ఆనవాయితీ. కానీ విజయనగరం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో మాత్రం రెండు సార్లు జరగడం సంప్రదాయం. అందుకు అక్కడ ఒక విశిష్ట పురాణ చరిత్ర ఉంది. సహజంగా శ్రీరామనవమి అంటే దేశవ్యాప్తంగా వేలాది రామాలయాల్లో కల్యాణ మహోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అలాంటి అరుదైన కళ్యాణ క్రతువు చూసి తరించడానికి రెండు కళ్లు చాలవు.

శ్రీరామునికి రెండు సార్లు కళ్యాణం.. ఆ తరువాతే గ్రామంలో పెళ్లి ముహూర్తాలు.. అదెక్కడో తెలుసా..
Sri Rama Kalyanam
Follow us

| Edited By: Srikar T

Updated on: Apr 18, 2024 | 10:00 AM

శ్రీరామునికి ఏడాదికి ఒక్కసారి మాత్రమే అభిజిత్ లగ్నంలో కళ్యాణం జరగడం ఆనవాయితీ. కానీ విజయనగరం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో మాత్రం రెండు సార్లు జరగడం సంప్రదాయం. అందుకు అక్కడ ఒక విశిష్ట పురాణ చరిత్ర ఉంది. సహజంగా శ్రీరామనవమి అంటే దేశవ్యాప్తంగా వేలాది రామాలయాల్లో కల్యాణ మహోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అలాంటి అరుదైన కళ్యాణ క్రతువు చూసి తరించడానికి రెండు కళ్లు చాలవు. అలాంటి నవమి రోజు విజయనగరం జిల్లా రామతీర్థం శ్రీ సీతారామస్వామి దేవస్థానానికి వెళ్లి స్వామి వారి కల్యాణాన్ని చూసి తీరాల్సిందే. ప్రధానంగా ఈ ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ కల్యాణాన్ని తిలకించేందుకు ఉత్తరాంధ్ర నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఇటు తెలంగాణ, అటు ఒడిశా నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు.

16 శతాబ్దంలో అప్పటి విజయనగరం మహారాజు సీతా రామచంద్ర ప్రభు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ఏకశిలతో ఏర్పడిన పెద్ద బోడికొండ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఈ కొండపై కూడా శ్రీ కోదండరాముడు ఆలయం ఉంది. ఈ కొండ పై సీతారాములు నడయాడిన ఆనవాళ్లు ఉంటాయి.ఇక్కడ శ్రీరామ స్వామి వారి పాదముద్రికలు, ఆంజనేయస్వామి అడుగులు ఇప్పటికీ కనిపిస్తాయి. రామతీర్థ ఆలయం ప్రశాంతతకు మారుపేరుగా నిలుస్తోంది. ఇక్కడ ప్రకృతి అందాలు భక్తులను ఆకట్టుకుంటాయి. అంతేకాకుండా కొండ పై ఉన్న కోనేరు ఈ పుణ్యక్షేత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ కోనేరులో సంవత్సరం అంతా నీరు ఉంటుంది. కరువు కాటకాల్లో సైతం ఈ కోనేరు నీటితో కళకళలాడుతుంది. శ్రీరాముని మహిమ వల్లనే అలా ఉంటుందని భక్తుల విశ్వాసం. ఈ క్రమంలోని మహారాజుకు కూడా కలలో శ్రీరామచంద్రుడు కనిపించి అక్కడ తమ విగ్రహాలు ఉన్నాయని వాటిని వెలికి తీసి ఆలయం నిర్మించాలని చెప్పాడట. మరుసటి రోజు ఉదయం మహారాజా సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఒక నీటి మడుగులో నుంచి వెలికి తీశారు. ఈ విధంగా తీర్థం నుంచి విగ్రహాలు బయటపడటం వల్ల ఈ ఆలయానికి రామతీర్థం అని పేరు పెట్టారు.

శ్రీ సీతారాములకు అంగరంగ వైభవంగా తిరు కళ్యాణ మహోత్సవాన్ని జరిపించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కళ్యాణాన్ని తిరుకళ్యాణ మహోత్సవం అని దేవుని పెళ్లి అని కూడా పిలుస్తారు. ఈ క్రమంలోనే చైత్రమాసంలో నవమి రోజు అభిజిత్ లగ్నంలో స్వామివారి కల్యాణాన్ని జరుపుతారు. ఇలా శ్రీరామనవమి రోజు జరిగే కళ్యాణం పగటిపూట జరిగితే, భీష్మ ఏకాదశి రోజు జరిగే కళ్యాణం మాత్రం సాయంత్రం ఉంటుంది. అదే విధంగా భీష్మ ఏకాదశి రోజు దేవుడి పెళ్లి జరిగిన తర్వాతే ఈ ప్రాంతంలో సాధారణ వివాహాలకు ముహూర్తం పెట్టుకోవడం ఆచారంగా వస్తోంది. ఇలా లోకమంతా శ్రీరామునికి ఒకసారి వివాహం జరిపితే రామతీర్థంలో మాత్రం శ్రీరామునికి రెండు సార్లు వివాహం జరుపుతారు. ఇలా రెండు సార్లు కళ్యాణం జరపడం, ఈ కళ్యాణాలకు భక్తులు పోటెత్తి తిలకించడం ఆనవాయితీగా వస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles