AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Food Eating Rules: వంట చేసే సమయంలో తినే ముందు ఈ నియమాలు పాటించండి, ఇంట్లో తిండికి, డబ్బుకు లోటుండదు

హిందూ విశ్వాసం ప్రకారం ఆహారాన్ని వండేటప్పుడు కొన్ని నియమాలను పాటించడం చాలా ముఖ్యం. ఆహారాన్ని తయారుచేసే ముందు శరీరం శుభ్రంగా  మనస్సు స్వచ్ఛంగా ఉండటం చాలా ముఖ్యం. ఆ తర్వాత ఇష్టంగా సంతోషంగా వంట చేయాలి. నిర్మలమైన హృదయంతో ఆహారాన్ని తయారు చేయాలి. వంట చేసే ప్రదేశం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. అటువంటి వారి ఇంట్లో నివసించే వారిపై అన్నపూర్ణదేవి  ఆశీస్సులు నిలిచి ఉంటాయి. పురాణ గ్రంధాల ప్రకారం హిందూ మతంలో ఆహారం తినే ముందు  అన్నపూర్ణ దేవిని స్తుతిస్తూ ఓ మంత్రాన్ని చదవడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

Food Eating Rules: వంట చేసే సమయంలో తినే ముందు ఈ నియమాలు పాటించండి, ఇంట్లో తిండికి, డబ్బుకు లోటుండదు
Food Eating Rules
Surya Kala
|

Updated on: Apr 18, 2024 | 2:32 PM

Share

సనాతన ధర్మంలో ఆహారాన్ని దైవంగా భావించి పూజిస్తారు. అందుకే ఆహారం తీసుకునే సమయంలో  మాత్రమే కాదు.. తయారు చేసేటప్పుడు కూడా కొన్ని ముఖ్యమైన నియమాలను పాటిస్తారు. ఎవరైతే ఆహారాన్ని గౌరవించి ఇంట్లో వండుకొని నియమానుసారంగా భుజిస్తారో వారికి పగలు రెట్టింపు పుణ్యం, రాత్రికి నాలుగు రెట్లు పుణ్యఫలం లభిస్తాయని ఒక నమ్మకం. ఆహారాన్ని దైవంగా భావించే ఇంట్లో అన్నపూర్ణా దేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని.. ఆ ఇంట్లో ధన ధాన్యాలకు  లోటు ఉండదని విశ్వాసం.

హిందూ విశ్వాసం ప్రకారం ఆహారాన్ని వండేటప్పుడు కొన్ని నియమాలను పాటించడం చాలా ముఖ్యం. ఆహారాన్ని తయారుచేసే ముందు శరీరం శుభ్రంగా  మనస్సు స్వచ్ఛంగా ఉండటం చాలా ముఖ్యం. ఆ తర్వాత ఇష్టంగా సంతోషంగా వంట చేయాలి. నిర్మలమైన హృదయంతో ఆహారాన్ని తయారు చేయాలి. వంట చేసే ప్రదేశం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. అటువంటి వారి ఇంట్లో నివసించే వారిపై అన్నపూర్ణదేవి  ఆశీస్సులు నిలిచి ఉంటాయి. పురాణ గ్రంధాల ప్రకారం హిందూ మతంలో ఆహారం తినే ముందు  అన్నపూర్ణ దేవిని స్తుతిస్తూ ఓ మంత్రాన్ని చదవడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

భోజనం చేసే ముందు చదవాల్సిన మంత్రం..

ఓం సః నవవతు । సః నౌ భునక్తు । సః వీర్యం కరవావహై । తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై । ॐ శాంతిః శాంతిః శాంతిః

ఇవి కూడా చదవండి

ఆహారాన్ని అవమానించవద్దు

భోజనం చేసేటప్పుడు ఆహారాన్ని ఎప్పుడూ అవమానించకండి. ఎల్లప్పుడూ కుడిచేత్తో ఆహారం తీసుకోవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఎడమచేతితో తినడం పాపంగా పరిగణించబడుతుంది. ఇలా ఎడమ చేతితో అన్నం తిన్న వారు జీవితంలో అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

ఏ దిశలో కూర్చుని అన్నం తినాలి

హిందూ సంప్రదాయంలో ఏదైనా పని చేయడానికి శుభ సమయం, శుభ దిశకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఎల్లప్పుడూ సరైన సమయంలో సరైన దిశలో ఆహారాన్ని తినడం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. హిందూ విశ్వాసం ప్రకారం తూర్పు దిక్కును దేవతల దిక్కుగా పరిగణిస్తారు. కాబట్టి ఈ దిక్కుకు అభిముఖంగా ఆహారాన్ని తినడం శ్రేయస్కరం.

ఆహార వితరణ చేయండి..

ఇంట్లో సిరి సంపదలు ఎల్లప్పుడూ నిండి ఉండాలని కోరుకుంటే ఎల్లప్పుడూ దానం చేయాలి. ఇక అన్న వితరణ చేయడం మహా దానంతో సమానంగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో ప్రతి రోజూ సామాన్యుడితో పాటు జంతువులు, పక్షులకు తినడానికి ఆహారాన్ని అందించండి. ఇలా చేయడం వలన  ఇంట్లో తిండికి, డబ్బుకు ఎప్పటికీ కొరత ఉండదు.

సరైన ఆహార నియమాలు

హిందూ విశ్వాసం ప్రకారం ఆహారం ఎల్లప్పుడూ నేలపై కూర్చొని తినాలి. ఆహారం ఎంత తినగలిగితే అంత మాత్రమే తినే ప్లేట్ లో పెట్టుకోవాలి. ప్లేట్‌లో పెట్టుకున్న ఆహారాన్ని ఎప్పుడూ వదల కూడదు. మంచం మీద కూర్చొని ఆహారం తినకూడదు లేదా తినే కంచంలో చేతిని శుభ్రం చేసుకోరాదు. ఇలా చేసేవారి ఇంట్లో డబ్బుకు, తిండికి కొరత ఏర్పడుతుంది. ప్రతి వారి శరీరం, మనస్సు స్వచ్ఛంగా ఉండాలి.  ప్రశాంతంగా తినాలి. భోజనం చేస్తూ గొడవ పడితే అన్నపూర్ణ దేవి ఆగ్రహానికి గురవుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు