Hanuman Jayanti: బజరంగబలి పూజలో ఈ నియమాలు పాటించండి.. హనుమాన్ అనుగ్రహంతో కష్టాలు తొలగిపోతాయి..
పంచాంగం ప్రకారం చైత్ర మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి తేదీ ఏప్రిల్ 23 తెల్లవారుజామున 3:25 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 24 ఉదయం 5:18 గంటలకు ముగుస్తుంది. కనుక ఈ సంవత్సరం హనుమంతుడి జయంతిని 23 ఏప్రిల్ 2024 మంగళవారం జరుపుకోనున్నారు. ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 9.03 గంటల నుంచి 10.41 గంటల వరకు హనుమంతుని పూజించడానికి అనుకూలమైన సమయం. ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 4:20 నుండి 05:04 వరకు బ్రహ్మ ముహూర్తం. ఈ శుభ సమయంలో స్నానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు
హిందూమతంలో హనుమంతుడు జన్మించిన చైత్ర మాసంలోని శుక్ల పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా హనుమంతుడి జయంతి వేడుకలకు రెడీ అవుతున్నారు. ఈ సంవత్సరం హనుమాన్ జయంతికి సంబంధించి ఏదైనా గందరగోళం ఉంటే ఈ సంవత్సరం హనుమాన్ జయంతి ఖచ్చితమైన తేదీ ఏమిటో ఖచ్చితమైన సమాచారం అందించబడుతుంది. భజరంగబలి చిరంజీవి అని భూమి మీద నివాసితున్నాడని విశ్వాసం. నేటికీ ఆయన అందరి సమస్యలను పరిష్కరిస్తారని.. అందుకనే ఆయనను సంకటమోచనుడు అని కూడా పిలుస్తారు.
హనుమంతుడి జయంతి శుభ సమయం
పంచాంగం ప్రకారం చైత్ర మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి తేదీ ఏప్రిల్ 23 తెల్లవారుజామున 3:25 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 24 ఉదయం 5:18 గంటలకు ముగుస్తుంది. కనుక ఈ సంవత్సరం హనుమంతుడి జయంతిని 23 ఏప్రిల్ 2024 మంగళవారం జరుపుకోనున్నారు. ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 9.03 గంటల నుంచి 10.41 గంటల వరకు హనుమంతుని పూజించడానికి అనుకూలమైన సమయం. ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 4:20 నుండి 05:04 వరకు బ్రహ్మ ముహూర్తం. ఈ శుభ సమయంలో స్నానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. హనుమంతుడి జయంతి రోజున అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుంచి మధ్యాహ్నం 12:46 వరకు ఉంటుంది.
బజరంగబలి పూజలో ఈ విషయాలను చేర్చండి
- హనుమంతుడి జయంతి పూజలో కొన్ని ముఖ్యమైన విషయాలను చేర్చడం చాలా ముఖ్యమని నమ్ముతారు. ఇలా పూజ చేస్తే హనుమంతుడి ఆశీర్వాదం లభించి సాధకుల పెండింగ్ పనులు పూర్తి కావడం ప్రారంభమవుతాయి. బజరంగిభళి భక్తులపై ఎల్లప్పుడూ అనుగ్రహం లభిస్తుంది. దీని వలన చెడు నుంచి విముక్తి పొందుతారు.
- హనుమంతుడి ఆరాధనలో సింధూరం రంగును చేర్చి పూజ చేయాలి. ఎందుకంటే ఆంజనేయస్వామికి ఈ రంగు చాలా ఇష్టం. అటువంటి పరిస్థితిలో హనుమంతుని పూజలో ఎరుపు పువ్వులు, ఎరుపు పండ్లు, ఎరుపు లేదా నారింజ రంగు దుస్తులు,సింధూరాన్ని చేర్చండి.
- హనుమాన్ జయంతి పూజలో శుభ ఫలితాలను పొందడానికి స్వచ్ఛమైన నెయ్యితో చేసిన దీపాన్ని వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. హనుమంతుని దీపంలో ఎర్రటి వత్తిని ఉంచితే.. ఐశ్వర్యం లభిస్తుందని నమ్మకం.
- హిందూమతంలో ఏదైనా దేవుడు లేదా దేవత ఆరాధన నైవేద్యంగా లేకుండా అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. హనుమాన్ జయంతి రోజున పూజలో బూందీ, మోతీచూర్ లడ్డు, బెల్లం, శనగలు మొదలైనవి నైవేద్యంగా సమర్పించండి.
- హనుమంతుని పూజలో తులసి దళాలకు విశేష ప్రాధాన్యత ఉంది. హనుమంతునికి తులసిదళాలను సమర్పించక పొతే ఆ పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో రామ భక్త హనుమాన్ ఆశీర్వాదం పొందడానికి ప్రత్యేకంగా తులసి ఆకులతో చేసిన మాలను సమర్పించండి.
- హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామిని పూజించే భక్తుడు తామసిక వస్తువులను తినరాదు. బ్రహ్మచర్యం పాటిస్తూ ఉపవాసాన్ని పూర్తి చేయాలి. హనుమంతుడిని పూజించేటప్పుడు దృష్టిని ఇతర విషయాలపై మళ్లించకండి. ఇందుకోసం పూజ చేసే ముందు పూజా సామాగ్రి అంతా సమీపంలోనే ఉంచుకోవాలి.
హనుమంతుడి జన్మదినోత్సవం రోజున చేసే పూజా ఫలితం
హిందూ విశ్వాసం ప్రకారం కలియుగంలో రామ భక్తుడు హనుమంతుడిని ఆరాధించడం వల్ల సకల సంతోషాలు లభిస్తాయని, అన్ని కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. భూమిపై ప్రతి యుగంలోనూ కొలువై భక్తుల కోరికలను తీర్చే హనుమంతుడిని పూజించడం వల్ల కలిగే ఫలితాల వల్ల జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టం రెప్పపాటులో తొలగిపోతాయి. అంతేకాదు జీవితంలో కలిగే ఇబ్బందుల నుంచి విముక్తి పొందుతారు. ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..