విదేశాల్లో ఉన్న భారతీయలు మన దేశ ఎన్నికల్లో ఓటు వేయవచ్చా..! ఎవరు అర్హులు? ఓటు ఎలా నమోదు చేసుకోవాలంటే..

ECIఎన్నికలలో పౌరుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం, పరిపాలనా యంత్రాంగం ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నారై ఓటర్లను కూడా లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసేలా చైతన్యవంతులను చేస్తున్నారు. ఎన్నారై ఓటర్లు ఎవరు?  విదేశాలలో నివసిస్తున్న వారు ఎలా ఓటు దేశంలో జరిగే ఎన్నికల్లో ఓటు వేయవచ్చో తెలుసుకుందాం.. ఎన్నికల సంఘం ప్రకారం ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు అంటే.. వేరే దేశ పౌరసత్వం తీసుకోకుండా.. ఉద్యోగం, చదువులు లేదా మరేదైనా కారణాల వల్ల విదేశాల్లో ఉండేవారు.. ఆలా ఇతర దేశ పౌరసత్వం తీసుకోకుండా.. భారతీయులుగా ఉంటున్న వారు అయితే వారు తమ పేర్లను నియోజకవర్గంలోని ఓటరు జాబితాలో నమోదు చేసుకోవచ్చు.

విదేశాల్లో ఉన్న భారతీయలు మన దేశ ఎన్నికల్లో ఓటు వేయవచ్చా..! ఎవరు అర్హులు? ఓటు ఎలా నమోదు చేసుకోవాలంటే..
Lok Sabha Elections 2024Image Credit source: ECI
Follow us
Surya Kala

|

Updated on: Apr 18, 2024 | 2:55 PM

దేశంలో ప్రజాస్వామ్య పండుగ మొదలైంది. అంటే దేశ వ్యాప్తంగా ఎన్నికలు సందడి మొదలైంది. లోక్‌సభ ఎన్నికలు 2024 ఏడు దశల్లో పూర్తి కానున్నాయి. లోక్‌సభ ఎన్నికలో మొదటి విడుదట ఎలక్షన్స్ ఏప్రిల్ 19న జరగనున్నాయి.  ఎన్నికలలో పౌరుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం, పరిపాలనా యంత్రాంగం ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నారై ఓటర్లను కూడా లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసేలా చైతన్యవంతులను చేస్తున్నారు. ఎన్నారై ఓటర్లు ఎవరు?  విదేశాలలో నివసిస్తున్న వారు ఎలా ఓటు దేశంలో జరిగే ఎన్నికల్లో ఓటు వేయవచ్చో తెలుసుకుందాం..

ఎన్నికల సంఘం ప్రకారం ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు అంటే.. వేరే దేశ పౌరసత్వం తీసుకోకుండా.. ఉద్యోగం, చదువులు లేదా మరేదైనా కారణాల వల్ల విదేశాల్లో ఉండేవారు.. ఆలా ఇతర దేశ పౌరసత్వం తీసుకోకుండా.. భారతీయులుగా ఉంటున్న వారు అయితే వారు తమ పేర్లను నియోజకవర్గంలోని ఓటరు జాబితాలో నమోదు చేసుకోవచ్చు. ఇలాంటి వ్యక్తులు భారతదేశంలో జరిగే ఎన్నికలలో ఓటు వేయడానికి అర్హులు.

ఇవి కూడా చదవండి

భారతీయుడు కాని వ్యక్తులు ఓటు వేయవచ్చా?

భారతీయుడు కాని వారు ఎన్నికల్లో ఓటు వేయలేరు. ఓటరు జాబితాలో పేరుని నమోదు చేసుకోవడానికి అర్హులు కాదు. అంతేకాదు వేరే దేశ పౌరసత్వం పొందడానికి భారత పౌరసత్వాన్ని వదులుకున్న వారు కూడా భారతీయ ఎన్నికల ఓటర్ల జాబితాలో పేర్లను నమోదు చేసుకోలేరు.

విదేశాల్లో నివసిస్తున్న భారతీయ పౌరులు ఎలా ఓటు నమోదు చేసుకోవాలంటే

ఎన్నారై ఓటర్లు తమ పేరుని ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడానికి ఫారం 6A నింపాల్సి ఉంటుంది. ఈ ఫారమ్‌ను ఎన్నికల సంఘం వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా భారత రాయబార కార్యాలయాల నుంచి కూడా ఉచితంగా పొందవచ్చు. ఫారమ్ నింపిన తర్వాత దానికి సంబంధించిన ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారికి పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఫారం 6Aతో పాటు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, పాస్‌పోర్ట్ కాపీ వంటి పత్రాలను కూడా పంపాలి. ఓటరు జాబితాలో పేరు కనిపించిన తర్వాత, ఎన్నారై ఓటు హక్కును పొందుతారు.

ఎన్నారై ఓటర్లు ఆన్‌లైన్‌లో ఓటు వేయవచ్చా?

ఓటు వేయడానికి ఎన్నారై ఓటర్లు తమ పాస్‌పోర్ట్‌తో ఎన్నికల రోజున పోలింగ్ స్టేషన్‌కు చేరుకోవాలి. లండన్‌లోని భారత రాయబార కార్యాలయం నివేదిక ప్రకారం పోస్ట్ ద్వారా ఓటు వేయలేరు. విదేశాల్లోని భారతీయ మిషన్లలో ఓటు వేయడానికి, ఆన్‌లైన్ ఓటింగ్ కి ఎటువంటి నిబంధన లేదు.

NRI ఓటర్లు ఓటర్ ID కార్డ్ (EPIC) పొందారా?

ఓటింగ్ ప్రక్రియలో నమోదు చేసుకున్న తర్వాత సాధారణ ఓటరుకు ఓటర్ ఐడీ జారీ చేయబడుతుంది. ఓటరు IDని ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ (EPIC) అని కూడా అంటారు. ఓటు వేసేందుకు అనుమతించడమే కాకుండా ఈ కార్డు గుర్తింపు కార్డుగా కూడా పనిచేస్తుంది. అయితే ఎన్నారై ఓటర్లకు ఓటరు కార్డులు ఇవ్వడం లేదు. ఎన్నారై ఓటర్లు తమ పాస్‌పోర్టును పోలింగ్ స్టేషన్‌లో చూపించి ఓటు వేయవచ్చు.

ఒక విదేశీ (ఎన్‌ఆర్‌ఐ) ఓటరు భారతదేశంలో ఉన్నప్పుడు అతనికి గతంలో జారీ చేసిన EPICని సరెండర్ చేయాలా? అంటే NRIలు వారి EPICని సరెండర్ చేయాలి. దీనితో పాటు ఫారం 6A ను కూడా సమర్పించాలి.

ఒక వ్యక్తి ఎన్నారై ఓటరు హోదా పొందడానికి దేశం వెలుపల ఉండడానికి కనీస వ్యవధి ఏదైనా ఉందా? అంటే ఎటువంటి నిబంధన .. కాలపరిమితి లేదు.

నాన్ రెసిడెంట్ ఓటరు భారతదేశానికి వచ్చినప్పుడు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారికి తెలియజేయాలా?

ఒక ఎన్నారై ఓటరు భారతదేశానికి తిరిగి వచ్చినట్లయితే, అతను సంబంధిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారికి తెలియజేయాలి. అటువంటి పరిస్థితిలో ఆ వ్యక్తి సాధారణ ఓటరుగా నమోదు చేయబడతారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..