స్కాట్లాండ్‌లో దారుణ ఘటన.. ట్రెక్కింగ్ వెళ్లి నీటిలో మునిగి ఇద్దరు తెలుగు స్టూడెంట్స్ మృతి..

బుధవారం సాయంత్రం జరిగిన దురదృష్టకర సంఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థులు నీటి మునిగి మరణించారు. వారి మృతదేహాలను నీటిలో నుండి బయటకు తీసినట్లు లండన్‌లోని భారత హైకమిషన్ ప్రతినిధి తెలిపారు. భారత కాన్సులేట్ జనరల్ విద్యార్థుల కుటుంబాలతో టచ్‌లో ఉన్నారు. ఒక కాన్సులర్ అధికారి బ్రిటన్‌లో నివసిస్తున్న విద్యార్థి బంధువును కలిశారు. అలాగే డూండీ విశ్వవిద్యాలయం సాధ్యమైన అన్ని విధాల సహాయం చేస్తుందని హామీ ఇచ్చింది.

స్కాట్లాండ్‌లో దారుణ ఘటన.. ట్రెక్కింగ్ వెళ్లి నీటిలో మునిగి ఇద్దరు తెలుగు స్టూడెంట్స్ మృతి..
Andhra Pradesh Students
Follow us
Surya Kala

|

Updated on: Apr 19, 2024 | 2:47 PM

అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఇప్పటికే పలువురు భారతీయ స్టూడెంట్స్ మరణిస్తున్నారు. తాజాగా స్కాట్లాండ్‌లో ఇద్దరు భారతీయ విద్యార్థులు మరణించారు. 22 , 27 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు భారతీయ విద్యార్థులు నీటిలో మునిగి మృతి చెందినట్లు సమాచారం. స్కాట్లాండ్‌లోని ఓ పర్యాటక ప్రదేశంలో బుధవారం ఇద్దరు భారతీయ విద్యార్థులు నీటిలో శవమై కనిపించారు. బుధవారం రాత్రి లిన్ ఆఫ్ తుమ్మెల్ జలపాతం నుండి అత్యవసర సేవల ద్వారా ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ జలపాతాలు స్కాట్లాండ్ వాయువ్య దిశలో ఉన్నాయి. ఇక్కడ గ్యారీ, తుమ్మెల్ నదులు కలుస్తాయి.

సమాచారం ప్రకారం డూండీ యూనివర్సిటీలో చదువుకున్న నలుగురు స్నేహితులు ట్రెక్కింగ్ కోసం వెళ్లారు. వీరిలో ఇద్దరు నీటిలో పడి మునిగిపోయారు. ఆ తర్వాత మిగిలిన ఇద్దరు విద్యార్థులు ఎమర్జెన్సీ సర్వీసుకు ఫోన్ చేశారు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక, అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

ఈ రోజు భారత్ కు రానున్న మృత దేహాలు

బుధవారం సాయంత్రం జరిగిన దురదృష్టకర సంఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థులు నీటి మునిగి మరణించారు. వారి మృతదేహాలను నీటిలో నుండి బయటకు తీసినట్లు లండన్‌లోని భారత హైకమిషన్ ప్రతినిధి తెలిపారు. భారత కాన్సులేట్ జనరల్ విద్యార్థుల కుటుంబాలతో టచ్‌లో ఉన్నారు. ఒక కాన్సులర్ అధికారి బ్రిటన్‌లో నివసిస్తున్న విద్యార్థి బంధువును కలిశారు. అలాగే డూండీ విశ్వవిద్యాలయం సాధ్యమైన అన్ని విధాల సహాయం చేస్తుందని హామీ ఇచ్చింది. ఏప్రిల్ 19న పోస్ట్‌మార్టం నిర్వహించి అనంతరం మృతదేహాలను భారత్‌కు తీసుకురావడానికి కృషి చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

పోలీసులు ఏమని చెప్పారంటే..

స్కాట్లాండ్ కు చెందిన పోలీసు: బుధవారం సాయంత్రం 7 గంటలకు బ్లెయిర్ అథోల్ సమీపంలోని లిన్ ఆఫ్ తుమ్మెల్ జలపాతం వద్ద నీటిలో ఇద్దరు వ్యక్తులు నీటిలో పడి మునుగినట్లు తమకు సమాచారం అందింది.  ఇద్దరు వ్యక్తుల మృతదేహాలను నీటి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఎలా జరిగింది అనే  అంశంపై పరిశీలన సాగుతోంది.. అయితే ఈ మరణాలకు సంబంధించి ఎలాంటి అనుమానాస్పద ఘటనలు  వెలుగులోకి రాలేదని చెప్పారు. ప్రొక్యూరేటర్ ఫిస్కల్ (స్కాట్లాండ్‌లో జరిమానా విధించే అధికారాలు కలిగిన పబ్లిక్ ప్రాసిక్యూటర్)కి ఒక నివేదిక సమర్పించనున్నామని పేర్కొన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

IPL మెగా వేలం సమయం షెడ్యూల్
IPL మెగా వేలం సమయం షెడ్యూల్
ఒకే మొబైల్ నంబర్‌కు ఎన్ని ఆధార్ నంబర్‌లను లింక్ చేయవచ్చు!
ఒకే మొబైల్ నంబర్‌కు ఎన్ని ఆధార్ నంబర్‌లను లింక్ చేయవచ్చు!
క్రేజీ ఆఫర్స్.. కొత్త కొత్త అవకాశాలు. ఎస్‌జే సూర్య రికార్డ్స్ మోత
క్రేజీ ఆఫర్స్.. కొత్త కొత్త అవకాశాలు. ఎస్‌జే సూర్య రికార్డ్స్ మోత
ఘోర రోడ్డు ప్రమాదం.. కూలీ పనులకు వెళ్లి వస్తూ ఏడుగురు దుర్మరణం..
ఘోర రోడ్డు ప్రమాదం.. కూలీ పనులకు వెళ్లి వస్తూ ఏడుగురు దుర్మరణం..
ఫుల్లుగా తాగి టీ కొట్టు వ్యాపారీతో జైలర్ విలన్ గొడవ.. వీడియో
ఫుల్లుగా తాగి టీ కొట్టు వ్యాపారీతో జైలర్ విలన్ గొడవ.. వీడియో
వామ్మో మంటల్లో లారీ.. వెనుకవస్తున్న కార్లకు తప్పిన పెను ప్రమాదం..
వామ్మో మంటల్లో లారీ.. వెనుకవస్తున్న కార్లకు తప్పిన పెను ప్రమాదం..
అయ్యప్ప స్వాములకు ఒకొక్క ఏడాదికి ఒకొక్క పేరు 18 సార్లు తీసుకుంటే
అయ్యప్ప స్వాములకు ఒకొక్క ఏడాదికి ఒకొక్క పేరు 18 సార్లు తీసుకుంటే
ట్రెండింగ్‌లో ఉన్న సైబర్‌ నేరాలు ఇవే.. జాగ్రత్తగా లేకుంటే..
ట్రెండింగ్‌లో ఉన్న సైబర్‌ నేరాలు ఇవే.. జాగ్రత్తగా లేకుంటే..
Money Astrology: ఆ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం!
Money Astrology: ఆ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం!
అఫీషియల్.. అప్పుడే ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం 'క'.. ఎప్పుడంటే?
అఫీషియల్.. అప్పుడే ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం 'క'.. ఎప్పుడంటే?
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!