- Telugu News Photo Gallery People of these four zodiac signs will get separated soon, Check here is details in Telugu
Zodiac Signs: ఈ నాలుగు రాశుల వారు త్వరగా విడిపోతారంట..
ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో చిన్న చిన్న కారణాల వల్లే పెళ్లైన జంటలు కొన్ని రోజులకే విడిపోతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల వారు తమ వివాహ బంధం నుంచి త్వరగా బయటకు వచ్చేస్తారు. సాధారణంగా భార్యాభర్తలు అన్నాక గొడవలు, వివాదాలు జరగడం కామన్ విషయం. అయితే కొంత మంది మాత్రం చిన్న కారణాలకే పెద్ద గొడవలు చేసుకుని విడిపోతారు. మనస్పర్థలు, విభేదాల కారణంగానే విడిపోయామని చెబుతూ ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..
Updated on: Apr 18, 2024 | 4:33 PM

ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో చిన్న చిన్న కారణాల వల్లే పెళ్లైన జంటలు కొన్ని రోజులకే విడిపోతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల వారు తమ వివాహ బంధం నుంచి త్వరగా బయటకు వచ్చేస్తారు. సాధారణంగా భార్యాభర్తలు అన్నాక గొడవలు, వివాదాలు జరగడం కామన్ విషయం.

అయితే కొంత మంది మాత్రం చిన్న కారణాలకే పెద్ద గొడవలు చేసుకుని విడిపోతారు. మనస్పర్థలు, విభేదాల కారణంగానే విడిపోయామని చెబుతూ ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ నాలుగు రాశుల ఒకే భాగస్వామితో ఎక్కువ కాలం ఉండలేరట. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు చూద్దాం.

మేష రాశివారు స్వభావరీత్యా కోపంగా ఉంటారు. చిన్న విషయాలకు కూడా కోపం తెచ్చుకుని అరుస్తూంటారు. ఈ రాశి వారు అనుకున్నవి భాగస్వామి నెరవేర్చలేనప్పుడు.. బ్రేకప్ చెప్పేస్తారు. అదే విధంగా తుల రాశి వారు కూడా అంతే. వారి కోరికలకు అనుగుణంగా జీవించకపోతే తమ భాగస్వామి నుంచి విడిపోతారు.

వృశ్చిక రాశి వారు తమ రిలేషిప్ బాగుండాలని అనుకుంటారు. ఏమైనా గొడవలు, వివాదలు వచ్చినప్పుడు వెంటనే కలిసి పోవడానికి కూడా ట్రై చేస్తారు. కానీ పరిస్థితులు చేయి దాటి పోయాయి అనుకున్న సమయంలో ఆ బంధానికి ముగింపు చెప్పేస్తారు.

ఇక అదే విధంగా కుంభ రాశి వారు కూడా తమ వివాహ బంధానికి త్వరగా బ్రేకప్ చెప్పేస్తారు. ప్రేమలో ఉన్నా కూడా త్వరగా బ్రేకప్ చెప్పేస్తారు. రిలేషన్ షిప్‌లో ఇరుక్కోవడానికి అస్సలు ఇష్ట పడరు. భాగస్వామి వీళ్లకు పూర్తి స్వేచ్ఛను ఇస్తేనే వీరి బంధం కొనసాగుతుంది.





























