- Telugu News Photo Gallery Cinema photos Robinhood and Thandel Films have fixed December 20 to test their luck on screen
Movie News: నితిన్, నాగ చైతన్య మధ్య వార్ ఖరారు.? ఈ డేట్ పైనే ఇద్దరి ఫోకస్..
సినిమాల సంఖ్య పెరిగినట్టు, సినిమాలు రిలీజ్ అయ్యే సీజన్లు కూడా పెరుగుతున్నాయి. ఒకప్పుడు మన దగ్గర డిసెంబర్ అంటే కాస్త డల్‌గా కనిపించేది. సినిమాలన్నీ సంక్రాంతి రేసులో ఉండాలనుకునేవి. కానీ ఓవర్సీస్ మార్కెట్ పెరిగినప్పటి నుంచీ డిసెంబర్ మీద కూడా భారీగా ఖర్చీఫులు వేస్తున్నారు నిర్మాతలు. అందుకే 2024 డిసెంబర్ మీద కూడా రెండు సినిమాలు కాన్‌సెన్‌ట్రేట్ చేస్తున్నాయి.
Updated on: Apr 18, 2024 | 4:13 PM

మిగిలిన వాళ్ల సంగతేమోగానీ, సిల్వర్ స్క్రీన్ శ్రీవల్లి రష్మికకి యమాగా కలిసొచ్చింది డిసెంబర్. అల్లు అర్జున్‌తో కలిసి ఆమె నటించిన పుష్ప రిలీజ్ అయింది డిసెంబర్‌లోనే. లాస్ట్ ఇయర్ రణ్‌బీర్‌కపూర్‌తో కలిసి నటించిన యానిమల్ విడుదలైంది కూడా డిసెంబర్‌లోనే.

డిసెంబర్‌లో రిలీజ్ అయ్యే సినిమాలు క్లిక్ అయితే ఆ పాజిటివ్ వైబ్‌తో నెక్స్ట్ న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది. పండగ వరకు సినిమాలు పెద్దగా ఉండవు కాబట్టి, ఈ సినిమాల బజ్ ఉంటూనే ఉంటుందన్నది మేకర్స్ ని టెంప్ట్ చేస్తున్న విషయం.

నితిన్ రాబిన్ హుడ్ మూవీని డిసెంబర్ 20న రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు మేకర్స్. రాబిన్‌హుడ్‌లో నటిస్తున్న నితిన్, రాశీఖన్నా జంట ఆల్రెడీ శ్రీనివాసకల్యాణంలో కలిసి కనిపించారు.

తండేల్ అక్టోబర్‌లో వచ్చే అవకాశాలున్నాయన్నది నిన్నమొన్నటిదాకా వినిపించిన మాట. అయితే డిసెంబర్ 20కే రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. తండేల్‌లో చేస్తున్న చైతూ, సాయిపల్లవికి ఆల్రెడీ లవ్‌స్టోరీ మూవీ ఉంది.

సో ఈ రెండు జంటలూ స్క్రీన్ మీద తమ లక్‌ని ఇంకోసారి పరీక్షించుకోవడానికి డిసెంబర్ 20ని ఫిక్స్ చేసుకున్నాయన్నమాట. ఇది జరిగితే నితిన్, నాగ చైతన్య మధ్య గట్టి పోటీ ఉండటమే పక్క. మరి చుడాలిక..




