- Telugu News Photo Gallery Cinema photos Pawan Kalyan's Hari Hara Veera Mallu Movie Poster Release on Sri rama navami Telugu Heroes Photos
Hari Hara Veera Mallu: దూరమైంది నేనే..! నా సినిమాలు కాదు అంటున్న పవన్ కళ్యాణ్.!
సైలెంట్‌గా ఉన్నది పవనే కానీ... ఆయన సినిమాలు కాదు..! ఇండస్ట్రీకి దూరంగా ఉన్నది పవర్‌స్టారే కానీ, ఆయన సినిమాల అప్‌డేట్లు కాదు.. అని మళ్లీ మళ్లీ గుర్తుచేస్తున్నారు పవర్‌స్టార్ మూవీ మేకర్స్. శ్రీరామనవమి రోజు పవర్‌స్టార్స్ ఫ్యాన్స్ కి సైలెంట్‌గా గిఫ్ట్ ఇచ్చేశారు హరిహరవీరమల్లు టీమ్.
Anil kumar poka | Edited By: Phani CH
Updated on: Apr 18, 2024 | 9:09 PM

అప్పుడే కోవిడ్ రావడం, ఆ తర్వాత కొన్నాళ్లకు.. వేసిన సినిమా సెట్లు పాడు కావడం అంటూ రకరకాల కారణాలతో డిలే అయింది. హరిహరవీరమల్లు షూటింగ్ ఎంత పూర్తయిందన్న దాని మీదా క్లారిటీ లేదు.

ఎన్నికలు పూర్తయ్యేదాకా పవర్‌స్టార్‌ని ఫీల్డ్ మీదే చూసుకుంటాం... సినిమాలకు ఆయన దూరంగా ఉంటారని మాకు తెలుసు.. అందుకే అప్‌డేట్స్ ఏవి సారూ.. అని అడగదలచుకోలేదు అని ఓపెన్‌గానే అంటున్నారు పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్.

అయితే ఉన్నపళాన ఇప్పుడు టీజర్‌ని విడుదల చేయడంలో ఆంతర్యం మీద మాత్రం రకరకాల రీజన్స్ వినిపిస్తున్నాయి. పవన్ ఎలాగూ జనాల మధ్యే ఉన్నారు కాబట్టి, ఆ కరిష్మాతో హరిహరవీరమల్లుకి హైప్ తీసుకురావాలనుకుంటున్నారన్నది ఓ పాయింట్.

అసలే పవన్‌కల్యాణ్‌కి ప్యాన్ ఇండియా సినిమా ... టీజర్‌ని ఏ రేంజ్‌లో కట్ చేస్తున్నారోనని ఊహించుకుని మురిసిపోతున్నారు ఫ్యాన్స్. నిజానికి ఈ సినిమాతోనే పవర్‌స్టార్ ప్యాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వాల్సింది.

ఇక్కడ లేకున్నా ఉన్న ఫీలింగ్ కలిగిస్తున్నారు పవర్‌స్టార్. ఓ వైపు ఏపీ ఎన్నికల బరిలో బిజీ బిజీగా తిరుగుతున్నా, పవన్ సినిమాల అప్‌డేట్లు మాత్రం ఇండస్ట్రీలో ఆయన కనిపించని లోటును తీరుస్తున్నాయి. ఇప్పుడు నా వంతు అంటూ బరిలోకి దిగుతోంది హరిహరవీరమల్లు. ఈ సినిమా ఈ సీజన్‌నే ఎందుకు టార్గెట్ చేసినట్టు?

ఓజీ కెప్టెన్ సుజీత్ మాత్రం ఆ సినిమాకే కమిట్ అయి పనిచేస్తున్నారు. సెప్టెంబర్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకురావాలంటే ఆ మాత్రం కష్టపడకతప్పదు కదా మరి అని అంటున్నారు క్రిటిక్స్. రిలీజ్ డేట్‌ని కమిట్ కాని హరిహర వీరమల్లు టీమ్ అప్‌డేట్‌తో హుషారు రేకెత్తించింది.

ఎవరికీ అందదు అతని రేంజ్.. రెప్ప తెరిచెను రగిలే రివెంజ్ అంటూ ఓజీ టైమ్ బిగిన్స్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో పవర్‌ఫుల్ పిక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికైతే ఓజీ రిలీజ్ డేట్ సెప్టెంబర్ 27. ఇప్పుడు పవన్ ఏపీలో మరింత బిజీ కాబట్టి ఈ డేట్ చేంజ్ అవుతుందా?





























