- Telugu News Photo Gallery Cinema photos Pan India Star Prabhas Upcoming Heroines, Deepika Padukone and nidhi Agarwal hopes on his movies Telugu Heroes Photos
Prabhas: డార్లింగ్ నే నమ్ముకుంటున్న హీరోయిన్లు.! ప్రభాస్ మ్యాజిక్ అలాంటిది.!
ఒకటికి నాలుగు సినిమాలు వరుసబెట్టి చేస్తున్నప్పుడు చుట్టూ పదిమందితో పరిచయాలుంటాయి. కొన్నిసార్లు మన బాధ్యత ఎదుటివారు తీసుకుంటే, ఇంకొన్నిసార్లు వాళ్ల రెస్పాన్సిబులిటీని మనం ఫీలవ్వాల్సి ఉంటుంది. అలా, నార్త్, సౌత్ అనే తేడా లేకుండా కొందరు ముద్దుగుమ్మలకు సక్సెస్ ఇవ్వాల్సిన బాధ్యతను తీసుకున్నారు ప్రభాస్... సూపర్ సీనియర్ దీపికతో మొదలుపెట్టి... హ్యాపెనింగ్ బ్యూటీ మాళవిక వరకు... ప్రభాస్‌నే నమ్ముకున్నారు మరి..
Updated on: Apr 18, 2024 | 9:11 PM

ఒకటికి నాలుగు సినిమాలు వరుసబెట్టి చేస్తున్నప్పుడు చుట్టూ పదిమందితో పరిచయాలుంటాయి. కొన్నిసార్లు మన బాధ్యత ఎదుటివారు తీసుకుంటే, ఇంకొన్నిసార్లు వాళ్ల రెస్పాన్సిబులిటీని మనం ఫీలవ్వాల్సి ఉంటుంది.

ఇందులో పురాణ పురుషుడిగా కనిపిస్తారా ప్రభాస్? ఇప్పుడు కల్కికి ఇదే స్ట్రాంగ్ యుఎస్‌పీ. యంగ్ రెబల్‌స్టార్‌ని పౌరాణిక పాత్రలో చూపించి మెప్పించాల్సిన బరువు బాధ్యతలన్నీ ఇప్పుడు నాగ్ అశ్విన్‌వే. ఎలాగైనా సరే, వెరీ ఫస్ట్ లుక్‌తోనో, కేరక్టర్ ఇంట్రడక్షన్ వీడియోతోనో జనాలను మెస్మరైజ్ చేయాల్సిందే.

కల్కి 2898 ఏడీని కూడా జపాన్‌లో రిలీజ్ చేస్తే అక్కడ డార్లింగ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడటం ఖాయం అంటున్నారు.

ఆ నమ్మకంతోనే ఇప్పుడు సలార్‌ను అక్కడ గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అనుకున్నట్టుగానే సలార్‌కు జపాన్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆల్రెడీ సాహో సినిమా రికార్డ్‌ను సమం చేసింది సలార్.

అందుకే అర్జంటుగా కల్కితో ఆమెకు హిట్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు డార్లింగ్. ఈ సినిమాతో దీపికను సౌత్‌లో గ్రాండ్‌గా లాంఛ్ చేయాల్సిన డ్యూటీ కూడా ప్రభాస్‌దే. కల్కి ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు దీపిక.

ఆఫ్ స్క్రీన్, ఆన్‌లైన్‌లో గ్లామర్ ఫొటోలు షేర్ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు మాళవిక మోహనన్. ఎప్పుడూ హాట్ ఫొటోషూట్‌లతో కుర్రకారును కవ్వించే ఈ బ్యూటీ త్వరలోనే ప్రభాస్ పక్కన స్క్రీన్స్ మీద సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. మాళవికతో ఆల్రెడీ షూటింగ్ చేసిన డార్లింగ్,

ఇప్పుడు నిధితో సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొంటున్నారు. టాలీవుడ్‌లో సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నిధి అగర్వాల్, రాజాసాబ్ మీద బోలెడన్ని హోప్స్ పెట్టుకున్నారు. మా డార్లింగ్.. ఓ వైపు సలార్ సక్సెస్‌ని కంటిన్యూ చేయాలి... ఇంకో వైపు ఇంతమంది అమ్మాయిల విష్‌లిస్ట్ ని ఫుల్‌ఫిల్ చేయాలి అని ముచ్చటపడుతున్నారు ఫ్యాన్స్.




