AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya: బాల రామయ్యకు సూర్య తిలకమే కాదు అనేక రకాల తిలకధారణ చేస్తారు.. ప్రాముఖ్యత ఏమిటో తెలుసా

రామునికి తిలకం పెట్టడం హిందూ మతంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. నుదుటన బొట్టు పెట్టుకోవడానికి మతపరమైన, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఇది భగవంతుని పట్ల భక్తి  చిహ్నం. వివిధ సందర్భాలలో బాల రామయ్యకు వివిధ రకాల తిలక ధారణ చేస్తారు. ఈ తిలకాలన్నీ రాముడి పట్ల భక్తి, గౌరవానికి చిహ్నంగా పరిగణించబడతాయి. ఈ రోజు శ్రీరామునికి చేసే కొన్ని ముఖ్యమైన రకాల తిలకాలు, వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.

Ayodhya: బాల రామయ్యకు సూర్య తిలకమే కాదు అనేక రకాల తిలకధారణ చేస్తారు.. ప్రాముఖ్యత ఏమిటో తెలుసా
Lord Ram Lalla Tilak Varieties
Surya Kala
|

Updated on: Apr 17, 2024 | 7:52 PM

Share

అయోధ్యలో రామనవమి శుభ సందర్భంగా ఈరోజు మధ్యాహ్నం(ఏప్రిల్ 17వ తేదీ) 12 గంటలకు బాల రామయ్య నుదుట సూర్య తిలక ధారణ జరిగింది. ఇది శ్రీ రామ నవమి అనగా శ్రీరాముని జన్మదినం సందర్భంగా నిర్వహించిన ఒక రకమైన మతపరమైన ఆచారం. రామాలయంలో గర్భ గుడిలో ప్రాణ ప్రతిష్ట అనంతరం బాల రామయ్యకు సూర్యుడు మొదటి సారి తన కిరణాలతో అద్దిన తిలకం.. సూర్య తిలకం ఇది.

రామునికి తిలకం పెట్టడం హిందూ మతంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. నుదుటన బొట్టు పెట్టుకోవడానికి మతపరమైన, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఇది భగవంతుని పట్ల భక్తి  చిహ్నం. వివిధ సందర్భాలలో బాల రామయ్యకు వివిధ రకాల తిలక ధారణ చేస్తారు. ఈ తిలకాలన్నీ రాముడి పట్ల భక్తి, గౌరవానికి చిహ్నంగా పరిగణించబడతాయి. ఈ రోజు శ్రీరామునికి చేసే కొన్ని ముఖ్యమైన రకాల తిలకాలు, వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.

చందనం తిలకం: గర్భగుడిలోని బాల రామయ్యను ఆరాధించే సమయంలో ప్రతి రోజూ ధరింపజేసే అత్యంత సాధారణ తిలకం గంధపు తిలకం. చందనం గుణం చల్లగా ఉంటుంది. పవిత్రంగా పరిగణించబడుతుంది. కనుక శ్రీరామునికి గంధపు తిలకం పెట్టడం వలన అతనికి శాంతి, శ్రేయస్సును అందిస్తుందని గంధాన్ని చల్లదనానికి చిహ్నంగా పరిగణిస్తారు.

ఇవి కూడా చదవండి

అష్టగంధ తిలకం: పండుగలు, ప్రత్యేక పూజలు వంటి ప్రత్యేక సందర్భాలలో శ్రీరాముడికి అష్టగంధ తిలకం వర్తించబడుతుంది. గంధం, కర్పూరం, కుంకుమ, అగరు, జాజికాయ, లవంగం, ఏలకులు, గోరోచనంతో తయారు చేయబడిన ఎనిమిది సుగంధ పదార్థాల మిశ్రమం అష్టగంధ తిలకం. ఈ తిలకం శ్రీరాముని రూపానికి మరింత ఆకర్షణను జోడించి వాతావరణాన్ని స్వచ్ఛంగా, పవిత్రంగా మారుస్తుంది.

కుంకుమ తిలకం: ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక పూజల సమయంలో కుంకుమ తిలకం కూడా వర్తించబడుతుంది. కుంకుమను శుభం, శ్రేయస్సుకి చిహ్నంగా భావిస్తారు. ఈ తిలకం శ్రీరాముని ఆశీస్సులు, అదృష్టాన్ని అందించడానికి చిహ్నం.

పసుపు తిలకం: పసుపు తిలకం తరచుగా వివాహాలు, పుట్టినరోజులు, ఇతర శుభ సందర్భాల్లో  వర్తించబడుతుంది. పసుపు ఒక పవిత్రమైన ఆరోగ్యాన్ని అందించే మూలికగా పరిగణించబడుతుంది. ఈ తిలకం శ్రీరాముడికి ఆరోగ్యాన్ని, ఆయురారోగ్యాలను అందించడానికి ప్రతీక.

సింధూర తిలకం: సిందూర తిలకం ముఖ్యంగా హోలీ పండుగలో శ్రీ రాముడికి వర్తించబడుతుంది. సింధూరం ఆనందం, ఉత్సాహానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఈ తిలకం శ్రీరాముడికి సంతోషాన్ని,  ఆనందాన్ని అందించడానికి చిహ్నం.

విభూతి తిలకం: విభూతి తిలకం శివరాత్రి, ఇతర మతపరమైన సందర్భాలలో వర్తించబడుతుంది. విభూతిని శక్తి , త్యాగానికి చిహ్నంగా భావిస్తారు. విభూతి తిలకం శ్రీరాముడికి బలం, నిగ్రహాన్ని అందించడానికి చిహ్నం.

పువ్వులు, ఆకులతో తిలకం: బాల రామయ్యకు వివిధ రకాల పువ్వులు, ఆకులతో కూడా తిలకం దిద్దుతారు.  దీని వెనుక రీజన్ ప్రతి పువ్వు లేదా ఆకుకు దాని సొంత మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు