TTD: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆర్జిత సేవా టికెట్లు, దర్శన టిక్కెట్లు బుక్ చేసుకోండి..

18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. 18వ తేదీ ఉదయం 10గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10గంటల వరకు సుప్రభాతం, తోమాల, అర్చన అష్టదళపాదపద్మారాధన టికెట్లు పొందడానికి ఆన్ లైన్ లో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడీప్‌ ఆధారంగా...

TTD: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆర్జిత సేవా టికెట్లు, దర్శన టిక్కెట్లు బుక్ చేసుకోండి..
TTD Tirupati Darshan Tickets
Follow us

|

Updated on: Apr 18, 2024 | 9:10 AM

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్‌. జూలై కోటాకు సంబంధింది పలు సేవల టికెట్లను అధికారులు విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని టీటీడీ అధికారికంగా ప్రకటించింది. జూలై కోటాకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను నేటి నుంచి (గురువారం) నుంచి విడుదల చేయనుంది. ఉదయం 10 గంటల నుంచి టికెట్లు అందుబాటులోకి రానున్నాయి.

18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. 18వ తేదీ ఉదయం 10గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10గంటల వరకు సుప్రభాతం, తోమాల, అర్చన అష్టదళపాదపద్మారాధన టికెట్లు పొందడానికి ఆన్ లైన్ లో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడీప్‌ ఆధారంగా టికెట్లను కేటాయిస్తారు. ఇందులో టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి టికెట్ ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని టీటీడీ అధికారులు తెలిపారు.

ఇక కల్యోణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 10గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా అదే రోజు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జులై నెల కోటాను మధ్యాహ్నం 3గంటలకు విడుదల చేయనున్నారు. వీటితో పాటు ఏప్రిల్ 23న ఉదయం 10గంటలకు జులై నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.

అలాగే ఏప్రిల్ 23న శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జూలై నెల ఆన్ లైన్ కోటాను ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక వృద్ధులు, దివ్యాంగుల, దీర్ఘకాలిక వ్యాదులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జూలై నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఏప్రిల్ 23న మధ్యాహ్నం 3గంటలకు విడుదల చేయనున్నారు. వీటితో పాటు జూల్‌ నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను ఏప్రిల్ 24న ఉదయం 10గంటలకు విడుదల చేయనున్నారు. వీటితో పాటు గదులో కోటాను ఏప్రిల్ 24న మధ్యాహ్నం 3గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..