AP EAPCET 2024: ఏపీఈఏపీ సెట్‌కు 3,54,235 దరఖాస్తులు.. ఆలస్య రుసుంతో మే 12 వరకు దరఖాస్తులు

ఏపీ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ (ఏపీఈఏపీ)సెట్‌కు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఏప్రిల్‌ 15తో ముగిసింది. సోమవారం నాటికి మొత్తం 3,54,235 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు సెట్‌ ఛైర్మన్‌ జీవీఆర్‌ ప్రసాదరాజు, కన్వీనర్‌ కె వెంకటరెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. వీటిల్లో ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌కు 2,68,309 దరఖాస్తులు, అగ్రికల్చర్‌, ఫార్మసీ స్ట్రీమ్‌కు..

AP EAPCET 2024: ఏపీఈఏపీ సెట్‌కు 3,54,235 దరఖాస్తులు.. ఆలస్య రుసుంతో మే 12 వరకు దరఖాస్తులు
AP EAPCET 2024
Follow us
Srilakshmi C

|

Updated on: May 05, 2024 | 1:33 PM

అమరావతి, ఏప్రిల్ 18: ఏపీ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ (ఏపీఈఏపీ)సెట్‌కు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఏప్రిల్‌ 15తో ముగిసింది. సోమవారం నాటికి మొత్తం 3,54,235 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు సెట్‌ ఛైర్మన్‌ జీవీఆర్‌ ప్రసాదరాజు, కన్వీనర్‌ కె వెంకటరెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. వీటిల్లో ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌కు 2,68,309 దరఖాస్తులు, అగ్రికల్చర్‌, ఫార్మసీ స్ట్రీమ్‌కు 84,791 దరఖాస్తులు, రెండు విభాగాలకు కలిసి 1135 మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఈఏపీసెట్‌కు దరఖాస్తుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది.

కాగా తొలుత ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం.. రూ.500 ఆలస్య రుసుంతో ఏప్రిల్‌ 30 వరకు, రూ.1000 ఆలస్య రుసుంతో మే 5వ తేదీ వరకు, రూ.5 వేల ఆలస్య రుసుంతో మే 10 వ తేదీ వరకు, రూ.10 వేల ఆలస్య రుసుంతో మే 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక పరీక్షల విషయానికొస్తే.. మే 18 నుంచి 22 వరకు ఇంజినీరింగ్‌ విభాగం పరీక్షలు నిర్వహిస్తారు. ఈసారి దరఖాస్తులు ఎక్కువ రావడంతో 23వ తేదీ ఉదయం సెషన్‌లోనూ ఇంజనీరింగ్‌ పరీక్ష నిర్వహిస్తామని కన్వినర్‌ వెల్లడించారు. అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాలకు మే 16, 17 తేదీల్లో పరీక్షలు ఉంటాయి.

విశాఖ: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశాలకు ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఉమ్మడ విశాఖ జిల్లాలో 2024-25 విద్యాసంవత్సరానికి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశాలకు ఈ రోజు (ఏప్రిల్‌ 18) కౌన్సెలింగ్‌ జరగనుంది. ప్రవేశ పరీక్షలో అర్హత పొందిన విద్యార్ధులు ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొని సీట్లు పొందాలని పాఠశాల ప్రిన్సిపల్‌ వి రత్నవల్లి ప్రకటించారు. ఆయా విద్యార్ధుల ర్యాంకు కార్డు, ఆధార్‌ కార్డులతోపాటు సంబంధిత డాక్యుమెంట్లతో ఈ రోజు ఉదయం 10 గంటలకు తల్లిదండ్రులతో పాఠశాలకు రావాలని ఆమె పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.

'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సన్నీ..
'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సన్నీ..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..