AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhuma Akhila Priya: మామగా ఫోన్ చేశావా.. విజయ డైరీ ఛైర్మన్‌గా ఫోన్ చేశావా.. వీడియో చూశారా..?

కర్నూల్ జిల్లాలో రాజకీయం హఠాత్తుగా హీటెక్కింది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నంద్యాల పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఆమె మామ జగన్ మోహన్ రెడ్డికి, అఖిలప్రియ మధ్య జరగిన సవాళ్లు ప్రతి సవాళ్లు.. హాట్ టాపిక్ గా మారాయి..

Bhuma Akhila Priya: మామగా ఫోన్ చేశావా.. విజయ డైరీ ఛైర్మన్‌గా ఫోన్ చేశావా.. వీడియో చూశారా..?
Nandyal Politics
Shaik Madar Saheb
|

Updated on: Oct 15, 2024 | 9:43 PM

Share

నంద్యాల పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మంగళవారం విజయ డైరీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డైరీలో ఎన్టీఆర్ శిలాఫలకం తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఛైర్మన్ ఛాంబర్‌లో మాజీ సిఎం జగన్ చిత్రపటం ఉంచడంపై ఎండీని, సిబ్బందిని అఖిలప్రియ నిలదీశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో ఎందుకు లేదంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా ఛాంబర్‌లోని జగన్ చిత్రపటం తొలగించి.. సిఎం చంద్రబాబు ఫోటోను స్వయంగా ఏర్పాటు చేశారు. ఇలా మరలా జరగొద్దంటూ అక్కడున్న సిబ్బందికి ఆదేశించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శిలాఫలకాన్ని తొలగించి మురికి కాలువలో పడేసిన వారిని వదిలిపెట్టబోమని.. అఖిలప్రియ హెచ్చరించారు.

ఈ క్రమంలోనే.. అఖిల ప్రియ విజయడైరికి వచ్చిన విషయం తెలిసుకున్న ఛైర్మన్ ఎస్వీ జగన్మోహన్ రెడ్డి.. ఆమెపై అభ్యంతరం వ్యక్తంచేశారు. వెంటనే ఛైర్మన్ ఎస్వీ జగన్మోహన్ రెడ్డి.. అఖిలప్రియకు ఫోన్ చేశారు. దీంతో జగన్ మోహన్ రెడ్డి.. అఖిల ప్రియ మద్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. తన సీట్లో ఎలా కూర్చుంటావని అఖిలప్రియను జగన్ ప్రశ్నించారు.. సిబ్బంది కూర్చోమంటే కూర్చుకున్నానని.. ఖచ్చితంగా కూర్చుంటానని అఖిల సమాధానం ఇచ్చారు. తనను అడగకుండా ఎలా కూర్చుంటావని పేర్కొనడటంతో.. గతంలో తమ కుర్చీలో మీరు కుర్చేలేదా అంటూ అఖిల పేర్కొన్నారు. ఈ సందర్భంగా బెదిరిస్తున్నావా… నన్ను కుర్చీలో నుంచి కదపండి చూద్దాం.. అంటూ అఖిల ప్రియ మామకు సవాల్ చేశారు.

వీడియో చూడండి..

మామగా ఫోన్ చేశావా.. విజయ డైరీ ఛైర్మన్‌గా ఫోన్ చేశావా.. అంటూ అఖిలప్రియ మామ జగన్ ను ప్రశ్నించారు.. మామగా ఫోన్ చేస్తే సరే కానీ.. చైర్మన్ గా ఫోన్ చేస్తే.. కంప్లైంట్ ఇచ్చుకోవచ్చని సూచించారు. శిలాఫలకం తొలగింపు పై ఎస్పీకి ఫిర్యాదు చేసిన అఖిలప్రియ.. వైసిపి నాయకులు ఇంకా భ్రమలో బ్రతుకుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. డైరీలో అవినీతి అక్రమాలు చాలా జరుగుతున్నాయని.. అన్ని బయటకు తీస్తామని పేర్కొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..