11 December 2025

బుగ్గపై సొట్ట ఉన్న అబ్బాయిలు, అమ్మాయిలు.. ఇందులో ఎవరికి ఎక్కువ అదృష్టం అంటే?

samatha

Pic credit - Instagram

బుగ్గపై  సొట్ట ఉంటే చాలా అదృష్టం అంటారు. చాలా మంది అబ్బాయిలకు, అమ్మాయిలకు బుగ్గపై సొట్ట ఉంటుంది. ఇది చాలా కామన్.

బుగ్గపై సొట్ట ఉంటే అది అందాన్ని రెట్టింపు చేస్తుంది. అంతే కాకుండా అదృష్టాన్ని కూడా తీసుకొస్తుందంట. మరి అబ్బాయి, అమ్మాయి ఎవరికి దీని వలన ఎక్కువ లక్కు కలిసి వస్తుందో చూద్దాం.

చర్మంలో గుండ ఏర్పడటం వలన దానిని సొట్ట అంటారు. ఆ ప్రాంతంలో కండ లేకపోవడం వలన సొట్ట బుగ్గలు ఏర్పడుతుంటాయి.

అయితే ఇలా అమ్మాయి లేదా అబ్బాయి ఇద్దరికీ బుగ్గలపై సొట్ట ఏర్పడుతుంటుంది. అయితే దీని వలన ఇద్దరికీ అదృష్టం ఏర్పడుతుందని చెబుతున్నారు పండితులు.

సొట్ట బుగ్గ ఉన్న అమ్మాయి లేదా అబ్బాయిల వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంటుందట. వీరు తమ భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

ముఖ్యంగా సొట్ట బుగ్గ ఉన్నవారి జీవితంలో శుక్రుడు చాలా బలంగా ఉండటం వలన వీరు ఎప్పుడూ ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారంట.

అయితే అమ్మాయికి ఎక్కువ అదృష్టమా, అబ్బాయికా అంటే కొన్ని సార్లు దీని వలన అమ్మాయిలకే ఎక్కువ లక్కు కలిసి వస్తుందంట. వీరే ఎక్కువ ప్రయోజనం పొందుతారు.

కానీ కొన్ని సార్లు సొట్ట బుగ్గలు ఉన్నవారు కూడా తమ జీవితంలో సక్సెస్ అవ్వలేక పోయారు. అయితే సొట్ట బుగ్గలు ఉన్నవారు అందరూ అదృష్టవంతులు అని చెప్పలేరు, కొందరు మాత్రం లక్కీ పర్సన్స్ అని చెప్పడం జరిగింది.