CM Chandrababu: ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త.. కరెంట్ ఛార్జీలపై కీలక ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు
కరెంట్ ఛార్జీలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు పెంచలేదు. దీంతో త్వరలో విద్యుత్ ఛార్జీలను పెంచే అవకాశముందనే వార్తలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో దీనిపై బుధవారం సీఎం చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. ఛార్జీల పెంపుపై చంద్రబాబు ఏమన్నారో చూడండి.

Power Charges: ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు తీపికబురు అందించారు. విద్యుత్ ఛార్జీలపై కీలక ప్రకటన చేశారు. బుధవారం సచివాలయంలో మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, హెచ్‌వోడీలతో చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని శాఖల్లో జరుగుతున్న పనులు, పనితీరుపై చర్చించారు. రాబోయే నెలల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలు, అమలు చేయాల్సిన ప్రణాళికలపై అధికారులకు పలు సూచనలు చేశారు. వివిధ శాఖల పనితీరు సరిగ్గా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు. పనితీరు మెరుగుపర్చుకోవాలి ఆదేశించారు. పనితీరు బాలేకపోతే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక విద్యుత్ శాఖపై సమీక్ష సంద్బంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ ఏడాది విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ విద్యుత్ ఛార్జీలు పెంచిందని, తాము ఇప్పట్లో పెంచే అవకాశం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం రూ.32 వేల కోట్ల విద్యుత్ ఛార్జీలు పెంచిందన్న ఆయన.. కోటి పది లక్షల అప్పు విద్యుత్ శాఖ చేసిందని వెల్లడించారు. దీంతో పాటు పీపీఎలను రద్దు చేసి ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చినప్పుడు యూనిట్‌ను రూ.5.19 చొప్పున కొనుగోలు చేసేవారమని, ఇప్పుడు అది రూ.4.92కి తగ్గిందని చెప్పుకొచ్చారు. అధికారులందరూ నిజాయితిగా పనిచేయాలని, ప్రజలకు అనుకూలంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ప్రతీశాఖ నుంచి డబ్బులు ఇవ్వాలని ప్రతిపాదనలు వస్తున్నాయని, ఇచ్చిన నిధులను సమర్ధవంతంగా ఉపయోగించాలని హితపు పలికారు.
ఏపీ అభివృద్ది గురించి పార్లమెంట్‌లో చెప్పే స్ధాయికి మనం ఎదిగామని, సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేశామని చంద్రబాబు అన్నారు. పెన్షన్లు ఇప్పటివరకు రూ.50 వేల కోట్లకుపైగా ప్రజలకు పంపిణీ చేశామన్నారు. జనవరి 15 వరకు గడువు ఇస్తున్నానని, ఆలోపు అన్ని శాఖలు పనితీరు మెరుగుపర్చుకోవాలన్నారు. విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సుతో భారీగా పెట్టుబడులు వచ్చాయని, దీని వల్ల నిరుద్యోగులుకు ఉపాధి లభిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.




