Vande Bharat Express: ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. అందుబాటులోకి మరో వందే భారత్ ట్రైన్.. ఇక పండుగే
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రైల్వేశాఖ మరో శుభవార్త అందించింది. నర్సాపురం నుంచి చెన్నైకు వందే భారత్ సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు ఈ రైలు విజయవాడ టూ చెన్నై నడిచేది. కానీ ఇప్పుడు నర్సాపురం వరకు పొడిగించారు. తాజాగా దీని టైమ్ షెడ్యూల్ విడుదలైంది.

ఏపీ ప్రజలకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్ తెలిపింది. విజయవాడ-చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో పలు మార్పులు చేస్తోంది. ఈ ట్రైన్ ఇప్పటివరకు విజయవాడ నుంచి చెన్నై వరకు మాత్రమే సర్వీసులు అందిస్తుండగా.. ఇప్పుడు దానికి పొడిగించారు. ఇది నర్సాపురం నుంచి చెన్నై వరకు సేవలు అందించనుంది. డిసెంబర్ 15 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. దీనికి తగ్గట్లు రైల్వేశాఖ కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. నర్సాపురం ఎంపీ, కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసరావు వివరాలను ట్వీట్ చేశారు. ఆ షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ నెల 15వ తేదీ నుంచి నర్సాపురం-చెన్నై వందే భారత్ రైలు నర్సాపురంలో సాయంత్రం 2.50 నిమిషాలకు బయల్దేరుతుంది. భీవవరంకు 3.19 నిమిషాలకు, గుడివాడకు 4.04కు, విజయవాడకు 4.50 నిమిషాలకు చేరుకుంటుంది. ఇక తెనాలికి 5.19 గంటలకు, ఒంగోలుకు 6.29 గంటలకు, నెల్లూరుకు 07.39 గంటలకు, గూడురుకు 8.49 గంటలకు, రేణిగుంటకు 9.54కు, చెన్నైకు 11.45 గంటలకు చేరుకుంటుందని రైల్వేశాఖ షెడ్యూల్ విడుదల చేసింది.
ఈనెల 15న ప్రారంభం కానున్న నరసాపురం-చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ టైమ్ టేబుల్ వివరాలు.. pic.twitter.com/gszmVsNhMd
— Bhupathiraju Srinivasa Varma (@BjpVarma) December 10, 2025
నర్సాపురం వరకు వందే భారత్ ట్రైన్‌ను పొడిగించాలని ప్రజలను నుంచి డిమాండ్లు వినిపించాయి. ఇవి కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసరావు దృష్టికి వెళ్లడంతో ఆయన చొరవ తీసుకున్నారు. ఈ విషయాన్ని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రైల్వేశాఖ నర్సాపురం వరకు సర్వీసులు పొడిగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైల్వేశాఖ నుంచి ఎప్పుడో అనుమతి రాగా.. ఇది ఎప్పటినుంచి సర్వీసులు అందిస్తుందనే దానిపై క్లారిటీ రాకపోవడంతో స్థానికులు ఎదురుచూస్తు్న్నారు. ఇప్పుడు ఎట్టకేలకు షెడ్యూల్ రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కాకుండా కేంద్రమంత్రి చొరవతో ఇప్పటికే పలు రైళ్లకు కొత్తగా నర్సాపురంలో హాల్ట్ సౌకర్యం కల్పించారు.,




