Watch Video: అద్దె కోసమని వచ్చారు.. ఆ తర్వాతే అసలు పని కానిచ్చారు.. అసలేం జరిగిందంటే?
ఈజీ మనీ కోసం అలవాటు పడిన కొందరు కేటుగాళ్లు జనాలను దోచుకునేందుకు కొత్త కొత్త ఎత్తుగడలను వేస్తున్నారు. వాళ్లు కొంచెం ఏమరుపాటుగా ఉన్నా.. అందిన కాడికి దోచుకెళ్తున్నారు.తాజగా ఇలాంటి ఘటనే జగ్గంపేటలో వెలుగు చూసింది. ఇల్లు అద్దెకు కవాలని వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి అందిన కాడికి దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇల్లు అద్దెకు కావాలని వచ్చి ముగ్గురు వ్యక్తులు ఓనర్ కంట్లో పెప్పర్ స్ప్రే కొట్టి.. ఇంట్లోని బంగారు నగలు దోకెళ్లిన ఘటన జగ్గంపేటలో చోటుచేసు కుంది. బాధితుడి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు.. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగ్గంపేట శ్రీరామ నగర్ కాలనీకి చెందిన పైడిపల్లి సుబ్బలక్ష్మి ఇంట్లో గది అద్దెకు కావాలని ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వచ్చారు. దీంతో ఓనర్ గది తాళం తెరిచి చూపిస్తున్నారు. ఇంతలో జేబులోంచి పెప్పర్ స్ప్రే తీసిన కేటగాళ్లు.. ఒనర్ కళ్లలో కొట్టారు. దీంతో కళ్లు మండిపోయిన ఓనర్ కేకలు వేశాడు. దీంతో ఆ వ్యక్తులు ఆమెను కింద పడేసి ఆమె మెడలో ఉన్న బంగారంతో పాటు ఇంట్లోని నగలను దోచుకున్నారు.
ఆ తర్వాత ఓనర్‌ను ఇంట్లోవేసి బయట నుంచి గడియపెట్టి అక్కడి నుంచి పరారయ్యారు. ఇక స్థానికల సహాయంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఓనర్ వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు తన మెడలో ఉన్న పుస్తెలతాడు, నల్లపూసలు వెరసి 3 కాసులు అపహరించినట్లు తెలిపారు.
అయితే ఇదే వ్యక్తులు గత శుక్రవారం కూడా వచ్చి ఇల్లు చూసుకున్నారని.. తన సోదరుడ్ని తీసుకుని వస్తానని చెప్పి.. ఇవాళ వచ్చి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు బాధితురాలు ఆరోపించారు. దీంతో ఘటనపై కేసు నమెదు చేసుకన్న పోలీసులు స్థానిక సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




