11 December 2025

భారత దేశంలో ఏ రాష్ట్రాల్లో అత్యంత విషపూరితమైన పాములు ఉన్నాయో తెలుసా?

samatha

Pic credit - Instagram

పాములను చూస్తే చాలు చాలా మంది భయపడి పోతుంటారు. ఇక అందులో కొన్ని విషపూరితమైన పాములు ఉంటే కొన్ని విషం లేని పాములు కూడా ఉంటాయి.

అయితే ఈ రోజు మనం భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో అత్యంత విషపూరితమైన పాములు ఉన్నాయి, వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.

కేరళ రాష్ట్రాంలో పచ్చని కనుమలు, చిత్తడి నేలలు, వెచ్చని వైవిద్యం పాములకు అనుకూలమైనది, అయితే ఈ రాష్ట్రాంలో చాలా విషపూరితమైన పాములు ఉన్నాయంట.

కర్ణాటక రాష్ట్రంలో పశ్చిమ కనుమలలో చాలా రకాల పాముల జాతులు ఉన్నాయంట. అయితే అందులో  ప్రమాదకర అగుబే నాగు పాము చాలా విషపూరితమైనది.

తమిళనాడు రాష్ట్రంలో చాలా అడువులు, చిత్తడి నేలలు ఉన్నాయి. ఇక్కడ అనేక రకాల పాములు ఉన్నాయి. ముఖ్యంగా విషపూరితమైన పాములు ఎక్కువగా ఉంటాయట. విషం లేనివి కూడా ఉన్నాయి.

మహారాష్ట్రాల్లో అడవులు, కొండలు, వ్యవసాయ భూములు పాములకు అనువైన ప్రదేశాలు. ఈ రాష్ట్రంలో కూడా చాలా విషపూరితమైన పాములున్నాయి.

ఉత్తరాఖండ్ హిమలయ పర్వత ప్రాంతాలలో కోబ్రాస్, వైపర్స్, క్రైట్స్ తో పాటు 30 రకాల విషపూరితమైన పాములు ఉన్నట్లు సమాచారం.

అదే విధంగా ఈశాన్య భారతదేశ నాగాలాండ్, మేఘాలయల్లో కూడా చాలా రకాల పాముల జాతులు ఉన్నాయంట. ఇక్కడ విషపూరితమైన పాములు కూడా ఎక్కువే.