AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జిమ్‌ దుస్తుల్లోనే వెళ్లాలి.. ఈ వయసులో అవసరమా అన్నారు.. వాళ్లకు ఇదే నా ఆన్సర్‌ : ప్రగతి

టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో స్టార్ హీరోలు, హీరోయిన్లకు అత్తగా, అమ్మగా, అక్కగా, వదినగా.. ఇలా అన్ని రకాల సహాయక నటి పాత్రలతో తెలుగు ఆడియెన్స్ కు చేరువైందీ అందాల తార .

జిమ్‌ దుస్తుల్లోనే వెళ్లాలి.. ఈ వయసులో అవసరమా అన్నారు.. వాళ్లకు ఇదే నా ఆన్సర్‌ : ప్రగతి
Pragathi
Rajeev Rayala
|

Updated on: Dec 11, 2025 | 9:58 AM

Share

ప్రగతి.. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీతో పాటు దేశం మొత్తం వినిపిస్తున్న పేరు ఇది. గత రెండు మూడేళ్లుగా ప్రగతి పవర్ లిఫ్టింగ్‌లో రాణిస్తున్నారు. జిల్లా, రాష్ట్ర, దేశ స్థాయిలో పలు పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు ప్రగతి. అంతర్జాతీయ స్థాయిలోనూ ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు పతకాలు సాధించారు. తాజా గేమ్స్‌లో ఓవరాల్‌గా సిల్వర్‌ మెడల్‌ సాధించగా, డెడ్‌ లిఫ్ట్‌నకు గోల్డ్‌ మెడల్‌ దక్కింది. ఇక బెంచ్‌, స్క్వాట్‌ లిఫ్టింగ్‌లో మరో రెండు సిల్వర్‌ మెడల్స్‌ సాధించారు ప్రగతి. తాజాగా ప్రగతి మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ప్రగతి మాట్లాడుతూ.. సరదాగా మొదలుపెట్టాను.. ఆ ఎనర్జీతో ఆసియా మెడల్‌ తెచ్చాను అన్నారు. అలాగే ఇదే ఎనర్జీకి కరెక్ట్ కేరక్టర్‌ పడితే ఎలా ఉంటుంది? సినిమా ఫ్యామిలీని ఆ స్టేజ్‌ మీద రెప్రజెంట్‌ చేశాననే అనుకుంటాను.. ఇక్కడ నాకు వచ్చిన ఎక్స్ పీరియన్స్ అక్కడ ఉపయోగపడింది. తమిళంలో విలన్‌గా నటిస్తున్నాను అని తెలిపారు ప్రగతి.

అదేవిధంగా ఈ వయసులో అవసరమా? అని చాలా మంది అన్నారు. జిమ్‌కి జిమ్‌ దుస్తుల్లోనే వెళ్లాలి.. చీరల్లో వెళ్లలేను ఎదిగిన కూతురుంది.. స్కూల్‌కి వెళ్తుంది.. ఇలాంటి టైమ్‌లో ఇన్ని మాటలు అవసరమా అనిపించింది. ఈ వయసులో అవసరమా అన్న ప్రతి ఒక్కరికీ ఇదే నా ఆన్సర్‌. నాకు వచ్చిన పతకాన్ని ఇండస్ట్రీలో ప్రతి లేడీకి అంకితం చేస్తున్నా.. ఇండస్ట్రీలో మహిళలు ఎంత కష్టపడతారో నాకు తెలుసు. నేను ఇండస్ట్రీని వదిలి వెళ్లలేదు. కాస్త గ్యాప్‌ ఇచ్చానంతే నేననుకున్న కేరక్టర్లు రాక కాస్త గ్యాప్‌ తీసుకున్నాను.. నా తుదిశ్వాస వరకూ నటిస్తూనే ఉంటాను. రెంట్‌ కట్టే స్థాయి నుంచి సొంతింటి వరకు చేరుకున్నది సినిమా వల్లనే అని తెలిపారు ప్రగతి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి