నిమ్మకాయను ఆహారంలో చేర్చుకుంటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
Lemon Health Benefits: నిమ్మకాయలు పోషకాల నిలయం. విటమిన్ సి, ఫైబర్‌తో సహా ఎన్నో పోషకాలు ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడం, బరువు తగ్గడం, రక్తపోటు నియంత్రణ, క్యాన్సర్ నివారణ వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. మీ రోజువారీ ఆహారంలో నిమ్మకాయలను చేర్చుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.

సిట్రస్ పండ్లలో రారాజుగా పిలిచే నిమ్మకాయలు కేవలం రుచిని పెంచడానికి మాత్రమే కాదు.. విటమిన్ సి, ఫైబర్‌తో సహా అనేక కీలక పోషకాలకు నిలయం. మీ రోజూవారీ ఆహారంలో నిమ్మకాయను చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య లక్ష్యాలను చేరుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయలను తీసుకోవడం వల్ల కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం..
నిమ్మకాయల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
రోగనిరోధక శక్తికి బూస్ట్
నిమ్మకాయలలో విటమిన్ సి, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి ప్రసిద్ధి చెందాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని నియంత్రించడం, వాపు తగ్గించడం ద్వారా రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తాయి.
స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది
పరిశోధనల ప్రకారం.. సిట్రస్ పండ్లలో ఉండే ఫ్లేవనాయిడ్లు మహిళల్లో ఇస్కీమిక్ స్ట్రోక్ రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. ఫ్లేవనాయిడ్లు ఎక్కువగా తీసుకునే వ్యక్తులకు గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
రక్తపోటు అదుపులో..
నిమ్మకాయల్లోని ఫ్లేవనాయిడ్లు రక్తపోటును అణచివేయడానికి సహాయపడతాయి. ఇవి జీర్ణవ్యవస్థలోని సూక్ష్మజీవులతో కలిసి గుండెను రక్షిస్తాయి. నిమ్మకాయ తీసుకోవడం సిస్టోలిక్ రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.
క్యాన్సర్ నివారణ
సిట్రస్ పండ్లను అధికంగా తీసుకునే వ్యక్తులకు, తక్కువగా తీసుకునే వారి కంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం 9శాతం తక్కువగా ఉందని ఒక విశ్లేషణలో తేలింది. ముఖ్యంగా నిమ్మ తొక్కలు క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉండవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి.
ఐరన్ శోషణను
నిమ్మకాయల్లోని విటమిన్ సి, ఆహారంలోని ఐరన్ శోషణను పెంచడానికి సహాయపడుతుంది. ఐరన్ అధికంగా ఉండే ఆహారాన్ని, విటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మకాయలతో కలిపి తీసుకోవడం వల్ల రక్తహీనత వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.
ఆరోగ్యకరమైన చర్మాన్ని
సిట్రస్ రసం వృద్ధాప్య సంకేతాలను నివారించడానికి లేదా తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది చర్మం మందాన్ని తగ్గించి, ముడతలు ఏర్పడటాన్ని తగ్గిస్తుంది. కొల్లాజెన్ కంటెంట్‌ను పెంచుతుంది.
ఆస్తమా నివారణ
ప్రతిరోజూ పండ్లు, కూరగాయలు, ముఖ్యంగా సిట్రస్ పండ్లను తీసుకోవడం వల్ల ఆస్తమా, శ్వాసలో గురక వచ్చే అవకాశాలు తగ్గుతాయని అధ్యయనాలు కనుగొన్నాయి.
బరువు తగ్గడంలో సహాయం
నిమ్మరసం త్వరగా కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది గ్యాస్ట్రిక్ కంటెంట్ పరిమాణాన్ని పెంచుతుంది. తద్వారా ఆకలిని తగ్గిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి నిమ్మకాయ మంచి ఆహార పదార్థం.
నిమ్మకాయ నీరు: ప్రయోజనాలు ఏమిటి?
నిమ్మకాయ నీరు హైడ్రేటెడ్‌గా ఉంచడానికి సహాయపడుతుంది. నిమ్మకాయలు సిట్రేట్ యొక్క సహజ వనరు. నిమ్మకాయ నీరు తాగడం వల్ల మూత్ర సిట్రేట్ స్థాయిలు పెరిగి.. మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి లేదా చికిత్స చేయడానికి సహాయపడుతుంది.
నిమ్మకాయలు ఎవరు తినకూడదు?
చాలా మందికి నిమ్మకాయలు సురక్షితమే అయినప్పటికీ ఈ కింది సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి..
GERD (గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి): నిమ్మకాయ తిన్న తర్వాత ఈ సమస్య లక్షణాలు తీవ్రమవుతాయి.
అలెర్జీ: నిమ్మకాయ లేదా సిట్రస్ పండు పడకపోతే వాటిని నివారించాలి.
నోటి పూతల: నిమ్మలోని ఆమ్లాలు పుండ్లను మరింత తీవ్రం చేయవచ్చు.
ముఖ్య చిట్కా: నిమ్మకాయ రసం దంతాల ఎనామిల్‌ను దెబ్బతీయకుండా ఉండాలంటే.. స్ట్రా ఉపయోగించి తాగండి. తాగిన వెంటనే మీ నోటిని మంచినీటితో శుభ్రం చేసుకోవడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




