Rain Alert: ఏపీలో భారీ వర్షాలు.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. 48 గంటల్లో వాయుగుండం

Rain Alert: ఏపీలో భారీ వర్షాలు.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. 48 గంటల్లో వాయుగుండం

Anil kumar poka

|

Updated on: Oct 16, 2024 | 12:49 PM

కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. భారీ వర్షసూచనతో తిరుపతి, నెల్లూరు కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. అధికారులతో వర్చువల్ సమీక్ష నిర్వహించారు. ఈ మూడు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో నాలుగు రోజుల పాటు అతి భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ముందుజాగ్రత్తగా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం 48 గంటల్లో బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. భారీ వర్షసూచనతో తిరుపతి, నెల్లూరు కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. అధికారులతో వర్చువల్ సమీక్ష నిర్వహించారు. ఈ మూడు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాలో తెల్లవారుజాము నుంచి వర్షం పడుతోంది. కొన్ని చోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తిరుమలలో కురుస్తున్న భారీ వర్షంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Oct 16, 2024 11:30 AM