AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guntur: అబ్బాయికి 23, అమ్మాయికి 16.. కట్ చేస్తే.. సీన్ సితారయ్యింది

ఎంత అవగాహన కల్పిస్తున్నా బాల్య వివాహాలు ఆగడం లేదు. చిన్న వయస్సులో వివాహాలు వద్దని ఆఫీసర్లు ప్రచారం చేస్తున్నప్పటికీ మైనర్లు పేరెంట్స్​ పెళ్లి పీటపైకి ఎక్కిస్తున్నారు. ఇప్పుడు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో కూడా అదే జరిగింది.. ఆగస్ట్‌ 3న జరిగిన ఈ వివాహం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Guntur: అబ్బాయికి 23, అమ్మాయికి 16.. కట్ చేస్తే.. సీన్ సితారయ్యింది
Guntur
T Nagaraju
| Edited By: |

Updated on: Oct 01, 2025 | 2:03 PM

Share

మైనర్ బాలిక వివాహాంపై పోలీసులు, ఛైల్డ్ వెల్ఫేర్ అధికారులు కన్నెర్రజేశారు. వివాహం అయిన తర్వాత పెండ్లి కొడుకుతో పాటు తల్లిదండ్రులు, పురోహితుడు, మండపం నిర్వాహకుడు, ఫోటో గ్రాఫర్‌పై కేసు నమోదు చేశారు. సత్తెనపల్లి దోభి ఘాట్‌లో ఆగష్టు మూడో తేదిన నాగ గోపి, అనూఖ్య వివాహం జరిగింది. పదో తరగతి వరకు చదువుకున్న నాగ గోపి హార్డ్‌వేర్ షాపులో గుమస్తాగా చేస్తున్నాడు. నాగ గోపి తల్లిదండ్రులు కొడుకుతో కలిసి సత్తెనపల్లి ధోబి ఘాట్‌లో నివసిస్తున్నారు. అచ్చంపేట మండలం కొండూరుకు చెందిన అనూఖ్యతో నాగ గోపి వివాహం గత నెల మూడో తేదిన జరిగింది. ఐదో తరగతి వరకూ చదువుకున్న అనూఖ్య తల్లిదండ్రులతో కలిసి కూలీ పని చేస్తుంటుంది. ఈ క్రమంలో అనూఖ్య తల్లిదండ్రులు ఆంజనేయులు, పద్మ తమ కుమార్తెకు వివాహం చేయాలని నిర్ణయించారు. సత్తెనపల్లికి చెందిన నాగ గోపి తల్లిదండ్రులతో మాట్లాడిన అంజనేయులు, పద్మ సంబంధం ఖరారు చేసుకున్నారు. దోభి ఘాట్‌లో ఇరు వర్గాలకు చెందిన పెద్దలు, బంధువుల సమక్షంలో వివాహం చేశారు. అయితే బాలికకు మైనార్టీ తీరకుండానే వివాహం చేసినట్లు ఫిర్యాదులు అందాయి.

ఇది చదవండి: అక్కడెలా పెట్టుకున్నావురా.. 10 ఏళ్ల బాలుడికి ఎక్స్‌రే తీసి బిత్తరపోయిన డాక్టర్లు

దీంతో ఛైల్డ్ వేల్ఫేర్ డిపార్ట్ మెంట్ అధికారులు రంగంలోకి దిగారు. బాలిక బర్త్ సర్టిఫికేట్‌ను పరిశీలించి ఆమె మైనర్‌‌‌‌గా తేల్చారు. మైనర్‌‌‌‌కు వివాహాం చేయడం చట్టవిరుద్దమని చెప్పిన అధికారులు వివాహం చేసిన వారిపై కేసులు నమోదు చేయాలంటూ సత్తెనపల్లి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఛైల్డ్ వేల్ఫేర్ డిపార్ట్‌మెంట్ అధికారుల ఫిర్యాదు మేరకు సత్తెనపల్లి పోలీసులు అనూఖ్య తల్లిదండ్రులు ఆంజనేయులు, పద్మతో పాటు నాగ గోపి తల్లిదండ్రులు బాలయ్య, చిలకమ్మలపై కేసు నమోదు చేశారు. వీరిపైనే కాకుండా వివాహం జరిపించిన పురోహితుడు, మండపం నిర్వాహకుడు, ఫోటోగ్రాఫర్‌పై కూడా కేసు నమోదు చేసినట్లు నాగమల్లేశ్వరావు తెలిపారు. మైనర్ బాలిక కావడంతో ఆమెను శిశు సంక్షేమ శాఖ హోమ్‌కు తరలించారు. నిబంధనలకు విరుద్దంగా మైనర్ వివాహాలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: దండిగా చేపలు పడదామని బోట్‌లో వెళ్లాడు.. నీటి అడుగున కనిపించింది చూడగా