AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిద్రమాత్రలు మింగిన కుటుంబ సభ్యులు.. చివరి నిమిషంలో ఏం చేశారంటే..

వాళ్లది అన్యోన్య కుటుంబం. భార్యాభర్త ఇద్దరు పిల్లలు. ఉన్నదాంట్లో సరిపెట్టుకునే జీవనం గడిపేవారు. భార్య అనారోగ్యం పాలవడంతో కృంగిపోయారు భర్త. మద్యానికి బానిస అయ్యారు. క్రమంగా అప్పులు పెరిగాయి. దీనికి తోడు కూతుర్లకు పెళ్లి చేయలేకపోయానని బాధ. ఇక కుటుంబం అంతా కలిసి తనువు చాలించాలనుకుంది. భార్యా, పిల్లలకు చెప్పి నిద్రమాత్రలు తీసుకొని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

నిద్రమాత్రలు మింగిన కుటుంబ సభ్యులు.. చివరి నిమిషంలో ఏం చేశారంటే..
Family Attempt To Suicide
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Feb 13, 2024 | 8:54 AM

Share

వాళ్లది అన్యోన్య కుటుంబం. భార్యాభర్త ఇద్దరు పిల్లలు. ఉన్నదాంట్లో సరిపెట్టుకునే జీవనం గడిపేవారు. భార్య అనారోగ్యం పాలవడంతో కృంగిపోయారు భర్త. మద్యానికి బానిస అయ్యారు. క్రమంగా అప్పులు పెరిగాయి. దీనికి తోడు కూతుర్లకు పెళ్లి చేయలేకపోయానని బాధ. ఇక కుటుంబం అంతా కలిసి తనువు చాలించాలనుకుంది. భార్యా, పిల్లలకు చెప్పి నిద్రమాత్రలు తీసుకొని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్న ప్రకారం అంతా తాగారు.. చివరకు ఏం జరిగిందంటే.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ జిల్లా పద్మనాభం మండలం ఏనుగుల పాలెం గ్రామానికి చెందిన కొమ్మూరి చిన్నయ్య డ్రైవర్. ఇతనికి భార్య మంగ, ఇద్దరు కుమార్తెలు అనుప్రియ, మానస ఉన్నారు. డ్రైవింగ్ పనులు చేసుకునే చిన్నయ్య.. ఇటీవల మద్యానికి బానిస అయ్యారు. ఇటీవల అప్పులు పెరిగిపోవడంతో పాటు భార్య మంగ ఆరోగ్య పరిస్థితి చిన్నయ్యను తీవ్రంగా కలచివేసింది. ఈ లోగా పిల్లలు పెళ్లీడుకు వచ్చేయడంతో.. ఇక వారి జీవితానికి న్యాయం చేయలేకపోయారని బెంగతో.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. విషయం భార్య పిల్లలకు చెప్పారు. మద్యం ద్వారా చిన్నయ్య, పాలతో భార్యమంగా, సబ్జా నీళ్లతో ఇద్దరు పిల్లలు నిద్ర మాత్రలు తీసుకున్నారు.

ఆ వెంటనే తాము ఆత్మహత్య చేసుకుంటున్నామన్న విషయం 108 సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడ చేరుకున్న 108 సిబ్బంది పరీక్షలు చేసేసరికి.. చిన్నయ్య ప్రాణాల కోల్పోయాడు. అశ్వస్థతతో ఉన్న మిగతా ముగ్గురిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సరైన సమయానికి చికిత్స అందించడంతో తల్లి, ఇద్దరు పిల్లలు కోలుకున్నారు. దీంతో అంతా ఊపిరిపించుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. చికిత్స పొందుతున్న కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆర్థిక సమస్యలు ఉంటే వాటి నుంచి గట్టక్కేలా ప్రయత్నించాలి తప్ప.. ఇలా బలవన్మరణానికి పాల్పడడం సరికాదని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారీకి సూపర్‌ ట్రిక్‌.. ఇలా చేశారంటే..
ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారీకి సూపర్‌ ట్రిక్‌.. ఇలా చేశారంటే..
మొన్నటి వరకు స్టార్ హీరోయిన్..ఇప్పుడు IPS ఆఫీసర్
మొన్నటి వరకు స్టార్ హీరోయిన్..ఇప్పుడు IPS ఆఫీసర్
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో కొత్త రూల్స్.. ఆ టికెట్లు ఉండవ
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో కొత్త రూల్స్.. ఆ టికెట్లు ఉండవ
మేడారం మహా జాతరకు బస్ ఛార్జీలు ఖరారు.. ఇలా చేస్తే ఇంటికే ‘బంగారం’
మేడారం మహా జాతరకు బస్ ఛార్జీలు ఖరారు.. ఇలా చేస్తే ఇంటికే ‘బంగారం’
4 కారణాల వల్లే కోటాను కోట్లు పోగొట్టుకున్నా..!
4 కారణాల వల్లే కోటాను కోట్లు పోగొట్టుకున్నా..!
కాళ్లకు సాక్స్‌ వేసుకుని నిద్రపోతే ఇన్ని లాభాలా..? నిపుణుల సూచన
కాళ్లకు సాక్స్‌ వేసుకుని నిద్రపోతే ఇన్ని లాభాలా..? నిపుణుల సూచన
బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న మన శంకరవరప్రసాద్ గారు..
బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న మన శంకరవరప్రసాద్ గారు..
సేఫ్టీ పిన్‌ చరిత్ర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. అసలు దాని..
సేఫ్టీ పిన్‌ చరిత్ర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. అసలు దాని..