Andhra Pradesh: కొలిక్కిరాని పొత్తు కథా చిత్రం.. కీలక వ్యాఖ్యలు చేసిన పురంధేశ్వరి, జీవీఎల్..

ఏపీలో పొత్తు కథా చిత్రం కొలిక్కిరావడం లేదు. అగ్రనేతలు ఉమ్మడిగా.. విడివిడిగా చర్చలు జరుపుతున్నా అసలు విషయం మాత్రం తేలడం లేదు. దీంతో పొత్తు ఉంటుందా..? ఉంటే ఏఏ పార్టీల మధ్య ఉంటుంది..? ఎవరు ఏఏ స్థానంలో పోటీ చేస్తారు?అనే అంశాలపై క్యాడర్‌లో కన్‌ఫ్యూజ్‌ నెలకుంది. పొత్తులపై సరైన సమయంలో సరైన నిర్ణయం అధిష్ఠానం తీసుకుంటుందని కమలం నేతలు చెబుతున్నారు..

Andhra Pradesh: కొలిక్కిరాని పొత్తు కథా చిత్రం.. కీలక వ్యాఖ్యలు చేసిన పురంధేశ్వరి, జీవీఎల్..
AP Politics
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 12, 2024 | 9:53 PM

ఏపీలో పొత్తు కథా చిత్రం కొలిక్కిరావడం లేదు. అగ్రనేతలు ఉమ్మడిగా.. విడివిడిగా చర్చలు జరుపుతున్నా అసలు విషయం మాత్రం తేలడం లేదు. దీంతో పొత్తు ఉంటుందా..? ఉంటే ఏఏ పార్టీల మధ్య ఉంటుంది..? ఎవరు ఏఏ స్థానంలో పోటీ చేస్తారు?అనే అంశాలపై క్యాడర్‌లో కన్‌ఫ్యూజ్‌ నెలకుంది. పొత్తులపై సరైన సమయంలో సరైన నిర్ణయం అధిష్ఠానం తీసుకుంటుందని కమలం నేతలు చెబుతున్నారు.. కానీ ఆ సరైన సమయం ఎప్పుడనేది మాత్రం ఇటు నేతలకు గానీ..అటు క్యాడర్‌కు గానీ అర్ధం కావడం లేదు. కొన్నిరోజుల క్రితం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి వచ్చారు. పవన్ కల్యాణ్‌ కూడా హస్తిన వెళ్లి ఈ అంశంపై బీజేపీ జాతీయ నాయకత్వంతో చర్చిస్తారని ప్రచారం జరిగింది. కానీ పవన్‌ ఢిల్లీ వెళ్లలేదు. చంద్రబాబు ఢిల్లీ టూర్‌ ముగిసి రోజులు గడుస్తున్నా కూడా పొత్తులపై మాత్రం క్లారిటీ రావడం లేదు. అయితే పొత్తులపై ఆధారపడి తాము ఏ కార్యక్రమాలూ చేపట్టబోమని.. పార్టీ బలోపేతం కోసమే తమ ప్రయత్నాలు ఉంటాయని ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి పేర్కొన్నారు.

పొత్తుల వ్యవహారం ఎలా ఉన్నా.. విశాఖ ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగేందుకు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహరావు జోరుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గడిచిన మూడేళ్లుగా విశాఖ వేదికగానే ఆయన రాజకీయ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. పనిచేసేవారికే బీజేపీలో ప్రాధాన్యత ఉంటుందన్న జీవీఎల్‌.. పార్టీ అవకాశం ఇస్తే విశాఖ నుంచి ఎంపీగా బరిలో దిగుతానని చెబుతున్నారు.

మరోవైపు బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుల వ్యవహారంపై సెటైర్లు వేస్తోంది.. అధికార పక్షం వైసీపీ.. ఆ పార్టీల నేతలు ఎవరు ఏ స్థానంలో పోటీ చేస్తారో వారికే క్లారిటీ లేదని..కానీ వైసీపీ విజయంపై మాత్రం తమకు పూర్తి క్లారిటీ ఉందని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.

కీలక నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ఖరారు చేస్తోన్న వైసీపీ.. సిద్ధం పేరుతో ప్రచారం కూడా మొదలుపెట్టేసింది. కానీ టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తులపైనే ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో ఎవరు ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారో తెలియక నేతలు, కార్యకర్తల్లో అయోమయం నెలకుంది. మరి ఈ కన్‌ఫ్యూజ్‌కు ఎప్పుడు తెరపడుతుందో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..