Pawan Kalyan: జనంలోకి జనసేనాని.. గోదావరి జిల్లాల్లో పర్యటన.. ఈ నియోజకవర్గం నుంచే పోటీ..?

ఎక్కడ ఓడిపోయారో అక్కడ్నించే మరోసారి పోటీ చేసి తన సత్తా చూపించాలనుకుంటున్నారా పవన్‌ కల్యాణ్‌? ఆయన భీమవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్‌ పర్యటనలు ఉండబోతున్నాయి. పవన్‌ మొదటి స్టాప్‌ భీమవరం కావడంతో అక్కడ్నించే ఆయన పోటీ చేయబోతున్నారనే నాన్‌ స్టాప్‌ ప్రచారానికి బలం చేకూరుతోంది. ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతకాలంటారు పెద్దలు.

Pawan Kalyan: జనంలోకి జనసేనాని.. గోదావరి జిల్లాల్లో పర్యటన.. ఈ నియోజకవర్గం నుంచే పోటీ..?
Pawan Kalyan
Follow us
Srikar T

|

Updated on: Feb 13, 2024 | 7:30 AM

ఎక్కడ ఓడిపోయారో అక్కడ్నించే మరోసారి పోటీ చేసి తన సత్తా చూపించాలనుకుంటున్నారా పవన్‌ కల్యాణ్‌? ఆయన భీమవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్‌ పర్యటనలు ఉండబోతున్నాయి. పవన్‌ మొదటి స్టాప్‌ భీమవరం కావడంతో అక్కడ్నించే ఆయన పోటీ చేయబోతున్నారనే నాన్‌ స్టాప్‌ ప్రచారానికి బలం చేకూరుతోంది. ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతకాలంటారు పెద్దలు. ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కూడా అదే బాటలో నడవనున్నారా? ఏపీలో రాబోయే ఎన్నికల్లో భీమవరం అసెంబ్లీ స్థానం నుంచి ఆయన మరోసారి పోటీ చేయబోతున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇక పవన్‌ కూడా ఈ నెల 14 నుంచి 17 వరకు ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. మొదట భీమవరంలో, ఆ తర్వాత అమలాపురం, కాకినాడ, రాజమండ్రిల్లో పవన్‌ పర్యటన ఉంటుంది. పవన్‌ టూర్‌ షెడ్యూల్‌లో మొదటే భీమవరాన్ని ఎంచుకోవడంతో, అక్కడ్నించే ఆయన పోటీ చేయబోతున్నారన్న ప్రచారానికి మరింత బలం చేకూరుతోందంటున్నాయి జనసేన వర్గాలు. ఇక పశ్చిమగోదావరి జిల్లా భీమవరం రాజకీయంగా చైతన్యం కలిగిన నియోజకవర్గం. గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ భీమవరం నుంచి పోటీ చేశారు. పవన్‌ ఇక్కడి నుంచి పోటీ చేయడంతో భీమవరం ఎన్నికల యుద్ధం రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించింది. వైసీపీ నుంచి పోటీ చేసిన గ్రంధి శ్రీనివాస్‌….పవన్‌పై విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఈ ముగ్గురు కాపు సామాజిక వర్గానికి చెందినవారే. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ కు 70,642 ఓట్లు, పవన్‌కు 62,285 ఓట్లు, టీడీపీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు కు 54,037 ఓట్లు వచ్చాయి. 8,357 ఓట్ల తేడాతో ఓటమి చెందారు పవన్ కల్యాణ్.

అదే బరి – అదే గురి?

అయితే తాజాగా పవన్ మరోసారి భీమవరం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. భీమవరంలో పవన్‌ పోటీ చేస్తే ఈసారి కచ్చితంగా గెలిపిస్తామని జనసేన నాయకులు బలంగా చెబుతున్నారు. పవన్ అడుగులు కూడా ఆ దిశగానే సాగుతున్నట్లు సమాచారం. గత ఎన్నికల తర్వాత పలుమార్లు భీమవరం వచ్చిన జనసేన అధినేత….బహిరంగ సభల్లో పాల్గొన్నారు. పార్టీ సమావేశాల్లో కొంతమంది నాయకులకు సలహాలు సూచనలు కూడా ఇచ్చారు. ఇప్పుడు మరోసారి పవన్‌….భీమవరం రానున్నారు. ఇక్కడ కొంతమంది ప్రముఖులను, నాయకులను కలవనున్నారు. భీమవరంలో మళ్లీ పోటీ చేసే వ్యూహంలో భాగంగానే పవన్‌ పర్యటిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి

భీమవరంలో 2, 51,301 ఓట్లు ఉన్నాయి. ఇందులో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 75 వేల వరకు ఉంటారు. ఇక్కడ బీసీ ఓటింగ్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈసారి అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు జనసేన నేతలు. భీమవరంలో పవన్‌ విజయం సాధించేందుకు పక్కా ప్రణాళిక రచిస్తున్నారు. భీమవరం టౌన్, రూరల్, వీరవాసరం మండలంలో పార్టీ నాయకులను, కార్యకర్తల్లో జోష్‌ నింపుతున్నారు. ఈసారి పొత్తులో భాగంగా తేలిగ్గా విజయం సాధిస్తామని లెక్కలు వేసుకుంటున్నారు. అయితే పవన్‌ మరోసారి ఇక్కడ్నించి బరిలో దిగితే వైసీపీ వ్యూహం ఎలా ఉంటుందో చూడాలంటున్నారు విశ్లేషకులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్