యాత్ర2 సూపర్ హిట్, దర్శకుడికి భూ కేటాయింపు! క్లారిటీ ఇదిగో..

ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏ చిన్న అంశమైనా సరే రాజకీయ రంగు పులుముకుంటోంది. అధికార పార్టీ వైసీపీపై టీడీపీ నేతలు, ప్రతిపక్ష పార్టీ టీడీపీపై వైసీపీ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు.

యాత్ర2 సూపర్ హిట్, దర్శకుడికి భూ కేటాయింపు! క్లారిటీ ఇదిగో..
Yatra2
Follow us

| Edited By: Rajitha Chanti

Updated on: Feb 12, 2024 | 6:08 PM

ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏ చిన్న అంశమైనా సరే రాజకీయ రంగు పులుముకుంటోంది. అధికార పార్టీ వైసీపీపై టీడీపీ నేతలు, ప్రతిపక్ష పార్టీ టీడీపీపై వైసీపీ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. అయితే ఇటీవల దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర పై యాత్ర2 సినిమా విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కాగా మ‌ద‌న‌ప‌ల్లిలోని హ‌ర్సిలీ హిల్స్ లో ఏపీ ప్ర‌భుత్వం దర్శక నిర్మాత అయిన మ‌హి వి.రాఘ‌వ్‌కి స్టూడియో నిర్మాణం కోసం రెండెక‌రాలు భూమి ఇచ్చిందంటూ మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. ఈ వ్యవహరంపై మ‌హి.వి.రాఘ‌వ్ క్లారిటీ ఇచ్చారు.

నేను యాబై, వంద ఎక‌రాలు అడ‌గ‌లేదని, కేవ‌లం రెండు ఎక‌రాల్లో మాత్రమే మినీ స్టూడియో నిర్మించాల‌నుకోవడం తప్పా అని తప్పుడు వార్తలపై స్పందించారు మహి.వి రాఘవ్. ఇండస్ట్రీలో చాలామంది ఉన్నా ఏపీకి కానీ, రాయలసీమకు కానీ ఏం చేయలేదని, కనీస అవసరాల కోసం మాత్రమే భూ అడిగానని ఆయన స్పందించారు. మారుమూల ప్రాంతంలో పెరిగినవాడిగా, ఏపీ ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుందనే ఉద్దేశంతో మినీ స్టూడియోను ఏర్పాటు చేయాలనుకున్నానని వెల్లడించారు. సొంత ప్రయోజనాలకు కోసమే తెలంగాణలోనో, మరో చోట స్టూడియో కోసం భూమి కావాలని అడిగేవాడిని, కానీ గ్రామీణ ప్రజల కోసమే మ‌ద‌న‌ప‌ల్లిలో స్టూడియో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నానని అన్నారు.

మ‌హి.వి.రాఘ‌వ్ టాలీవుడ్ లో సుపరిచిత దర్శక నిర్మాత, దాదాపుగా 16 ఏళ్ల ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు. విలేజ్‌లో వినాయ‌కుడు, , పాఠ‌శాల‌, ఆనందో బ్ర‌హ్మ‌, యాత్ర‌,  యాత్ర 2 సినిమాల‌ సినిమాలతో టాలీవుడ్ లో తనదైన ముద్ర వేశారు. తాజాగా యాత్ర2 సినిమాను స్వయంగా నిర్మించి తెరకెక్కించారు. ఈ సినిమాను చూసిన చాలామంది ప్రేక్షకులు భావోద్వేగంతో థియేటర్ నుంచి బయటకు వస్తున్నారు. టాలీవుడ్ లో ఎన్నో బయోపిక్స్ వచ్చినా.. యాత్ర2 బయోపిక్ మాత్రం నాలా న్యాచురల్ గా, మనసుకు హత్తుకునేలా తీశారాయన.