Bharat Ratna: దివంగత ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి.. ప్రధాని మోదీ, అమిత్ షాకు టీడీపీ ఎంపీ లేఖ..!

ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ఐదుగురికి దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ ప్రకటించడం తెలిసిందే. బీహార్‌కి చెందిన సోషలిస్ట్ నేత, ఆ రాష్ట్ర మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్, బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ, ధివంగత మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌లకు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది కేంద్రం.

Bharat Ratna: దివంగత ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి.. ప్రధాని మోదీ, అమిత్ షాకు టీడీపీ ఎంపీ లేఖ..!
NTR
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Feb 12, 2024 | 7:45 PM

ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ఐదుగురికి దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ ప్రకటించడం తెలిసిందే. బీహార్‌కి చెందిన సోషలిస్ట్ నేత, ఆ రాష్ట్ర మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్, బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ, ధివంగత మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌లకు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది కేంద్రం. వీరిలో నలుగురికి మరణానంతరం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించడం విశేషం. దీంతో భారతరత్న పురస్కారానికి నోచుకోని పలువురికి ఆ పురస్కారాన్ని ప్రకటించాలన్న డిమాండ్ తెరమీదకు వస్తోంది. బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాంకు భారతరత్న ఇవ్వాలని ఆ పార్టీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. అలాగే శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరేకి భారతరత్న ఇవ్వాలని శివసేన (యూబీటీ)కి చెందిన ఎంపీ సంజయ్ రౌత్, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన రాజ్ థాకరే డిమాండ్ చేశారు.

కాగా ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించాలన్న డిమాండ్ కూడా ప్రస్తుతం తెరమీదకు వచ్చింది. పీవీకి భారతరత్న ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తంచేసిన సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి.. ఎన్టీఆర్‌కు కూడా భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. ఉమ్మడి ఏపీకి సీఎంగా పనిచేసిన ఎన్టీఆర్‌కి కూడా భారతరత్న ప్రకటించి ఉంటే యావత్తు తెలుగు ప్రజానీకం పులకించిపోయేదని అన్నారు. ఈ అంశాన్ని జాతీయస్థాయికి తీసుకువెళ్ళగలిగే అవకాశం ఈ రోజున నిండుగా, మెండుగా కనబడుతోందని విజయశాంతి అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించాలని కోరిన విజయశాంతి..

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని టీడీపీ ఎంపీ లేఖ..

కాగా ధివంగత ఎన్టీ రామారావుకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని తెలుగు దేశం పార్టీ(టీడీపీ) కేంద్రాన్ని కోరింది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా‌కు ఆ మేరకు ఆయన లేఖలు రాశారు. ఎన్టీఆర్ సంక్షేమ పథకాలకు ఆద్యుడిగా నిలిచారని తెలిపారు.

జాతి వైరం మరిచి స్నేహంగా ఉంటున్న మూగజీవులు !!
జాతి వైరం మరిచి స్నేహంగా ఉంటున్న మూగజీవులు !!
హైదరాబాద్- విజయవాడ ప్రయాణికులకు గుడ్ న్యూస్
హైదరాబాద్- విజయవాడ ప్రయాణికులకు గుడ్ న్యూస్
బీరుకు రూ.20-లిక్కర్‌కు రూ.70 వరకు.. మందు బాబులకు బ్యాడ్ న్యూస్ ?
బీరుకు రూ.20-లిక్కర్‌కు రూ.70 వరకు.. మందు బాబులకు బ్యాడ్ న్యూస్ ?
యాల‌కుల నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా ??
యాల‌కుల నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా ??
ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో
ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..