తెల్లారగానే రోడ్డెక్కిన ఆటోడ్రైవర్.. ఎదురుగా కనిపించిన దృశ్యంతో బిత్తరచూపులు.. కట్ చేస్తే!

కాకినాడ జిల్లాలోని పలు గ్రామాలను దెయ్యం భయం వెంటాడుతోంది. ఈ క్రమంలోనే.. కిర్లంపూడి మండలం భోపాలపట్నంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. గ్రామంలోని ఒక ఇంటి ముందు ముగ్గు వేసి పసుపు కుంకుమతో పూజలు చేసినట్లు ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

తెల్లారగానే రోడ్డెక్కిన ఆటోడ్రైవర్.. ఎదురుగా కనిపించిన దృశ్యంతో బిత్తరచూపులు.. కట్ చేస్తే!
Auto Driver
Follow us

|

Updated on: Feb 12, 2024 | 5:53 PM

కాకినాడ జిల్లాలోని పలు గ్రామాలను దెయ్యం భయం వెంటాడుతోంది. ఈ క్రమంలోనే.. కిర్లంపూడి మండలం భోపాలపట్నంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. గ్రామంలోని ఒక ఇంటి ముందు ముగ్గు వేసి పసుపు కుంకుమతో పూజలు చేసినట్లు ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తెల్లవారుజామున రోడ్డుకు వెళ్లిన ఓ ఆటో డ్రైవర్‌.. క్షుద్రపూజల ఆనవాళ్లు చూసి కంగారుపడ్డాడు. విషయం చుట్టుపక్కలవారికి తెలియడంతో క్షద్రపూజల వ్యవహారం ఊరంతా పాకింది. అయితే.. పెద్దాపురం మండలం కాండ్రకోటలోనూ క్షుద్ర పూజల నేపథ్యంలోనే పూజలు, హోమాలు చేయడంతో.. అక్కడి దుష్టశక్తులు.. భోపాలపట్నం వైపుగా వచ్చి ఉంటాయని గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు.

వాస్తవానికి.. కాకినాడ జిల్లాలోని పలు గ్రామాల్లో క్షుద్రపూజల ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఇదే తరహా ఘటన కాకినాడ జిల్లా పెద్దపురం పరిధిలోనూ చోటుచేసుకుంది. చీకటి పడితే చాలు పెద్దపురం మండలం కాండ్రకోట గ్రామస్తులు వణికిపోతున్నారు. కొన్ని రోజులుగా కాండ్రకోటలో క్షుద్ర పూజలు జరుగుతుండడం చర్చనీయాంశమైంది. కాండ్రకోటలో కొన్ని రోజుల క్రితం పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, ఎండు మిరపకాయలతో పూజలు చేశారంటూ ప్రచారం జరిగింది. తర్వాత గ్రామంలో ఓ ఇంటి దగ్గర మేకను చంపి తినేయ్యడంతో నిజంగానే ఏదో జరుగుతుందనే ప్రచారం జోరందుకుంది. ఇక.. క్షుద్రపూజల నేపథ్యంలో.. అమావాస్య రోజు కాండ్రకోటలోని శివాలయంతో పాటు నూకాలమ్మ ఆలయంలో చండి హోమం అష్టదిగ్బంధన యాగం నిర్వహించారు గ్రామస్తులు. గ్రామంలో తిరుగుతున్న దుష్టశక్తిని సంహరించాలని కాండ్రకోటలో 108 బిందెలతో అమ్మవారికి అభిషేకం చేశారు మహిళలు.

వీడియో 1:

వీడియో 2: