AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Shops: ధన త్రయోదశి సందర్భంగా గోల్డ్‌ షాపులు కిటకిట.. ధరలు ఇలా..

ధన త్రయోదశి సందడి దేశం మొత్తం గోల్డ్‌ షాపుల దగ్గర కనిపిస్తోంది. తెలంగాణ, ఏపీ, ఒడిశా రాష్ట్రాల్లో బంగారం, వెండి కొనుగోళ్లతో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. బీసీ బంద్‌ ముగిసిన వెంటనే షాపులు తెరుచుకోవడంతో ప్రజలు క్యూ కట్టి బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారు.

Gold Shops: ధన త్రయోదశి  సందర్భంగా గోల్డ్‌ షాపులు కిటకిట.. ధరలు ఇలా..
Gold Shop
Ram Naramaneni
|

Updated on: Oct 18, 2025 | 4:26 PM

Share

ధన త్రయోదశి సందర్భంగా గోల్డ్‌ షాపులు కిటకిట లాడుతున్నాయి. హిందూ సంప్రదాయాల ప్రకారం.. ధన త్రయోదశి రోజున బంగారం, వెండి వంటి విలువైన వస్తువులను కొనుగోలు చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. తెలంగాణలో బీసీ బంద్ సందర్భంగా మూడు గంటల వరకూ బంద్‌ పెట్టిన షాపులు ఒక్కసారిగా తెరుచుకోవడంతో ప్రజలు క్యూ కట్టారు. ధన త్రయోదశి సెంట్‌మెంట్‌తో బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. దీంతో గోల్డ్‌ షాపుల దగ్గర సందడి వాతావరణం నెలకొంది.

అటు ఏపీలో ఉదయం నుంచే బంగారపు షాపుల దగ్గర రస్‌ కనిపిస్తోంది. ధన త్రయోదశి సెంట్‌మెంట్‌తో విజయవాడలో బంగారం, వెండి కొనేందుకు పెద్ద ఎత్తున ప్రజలు షాపులకు క్యూ కట్టారు. అటు పక్కరాష్ట్రం ఒడిశా, ఉత్తరాధిన సైతం ధంతేరస్ రస్‌ కనిపిస్తుంది గోల్డ్ షాపుల దగ్గర. దంతేరాస్‌ సేల్స్‌ దాదాపు 5 రోజుల పాటు సాగుతాయి. మరోవైపు పండగలు, పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో బంగారానికి రెక్కలు వస్తున్నాయి. ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రతి రోజూ బంగారం ధరలు పెరుగుతూ వినియోగదారులకు షాక్ ల మీద షాకులు ఇస్తున్నాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. నిన్నటి వరకూ పట్టుకుంటే ఆగునా అన్న బంగారం, వెండి ధరలు ఇవాళ కాస్తా నెమ్మదించాయి.

ధన త్రయోదశి రోజున గోల్డ్‌ ప్రియులకు శుభవార్త అందింది. నిన్నటి వరకూ పట్టుకుంటే షాక్‌ కొట్టేలా ఉన్న బంగారం ధర అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యలతో తగ్గింది. చైనాపై సుంకాలు ఎక్కువకాలం కొనసాగవన్న ట్రంప్‌ భిన్నస్వరంతో స్టాక్‌మార్కెట్లలో ర్యాలీ కారణంగా బంగారం డౌన్‌ అయింది. దీంతో ఇవాళ ఒక్కరోజే హైదరాబాద్‌లో 3వేల 180 తగ్గింది పసిడి ధర. హైదరాబాద్‌ సిటీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర లక్షా 32వేలు పలుకుతోంది. మరోవైపు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంం ధర లక్షా 22 వేల 230 రూపాయలు ఉంది. అలాగే కిలో వెండి ధర లక్షా 79వేల 600 రూపాయలు ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా