CM Jagan: ఆ 4 నియోజకవర్గాల్లో వైసీపీ గెలవాలన్న సీఎం జగన్.. జిల్లా నాయకులకు దిశానిర్ధేశం..

పోయిన చోట పట్టు బిగించాలని వైయస్ జగన్ భావిస్తున్నారు. పార్టీ వీడిన వారి విషయంలో 2019 ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్ని ఈ సార్వత్రిక ఎన్నికల్లో సైతం అనుసరించాలని వైఎస్ జగన్ గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెన్నంటే ఉంటూ పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారిపై ఫోకస్ పెట్టారు అధినేత.

CM Jagan: ఆ 4 నియోజకవర్గాల్లో వైసీపీ గెలవాలన్న సీఎం జగన్.. జిల్లా నాయకులకు దిశానిర్ధేశం..
Cm Jagan
Follow us
S Haseena

| Edited By: Srikar T

Updated on: Apr 06, 2024 | 5:23 PM

పోయిన చోట పట్టు బిగించాలని వైయస్ జగన్ భావిస్తున్నారు. పార్టీ వీడిన వారి విషయంలో 2019 ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్ని ఈ సార్వత్రిక ఎన్నికల్లో సైతం అనుసరించాలని వైఎస్ జగన్ గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెన్నంటే ఉంటూ పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారిపై ఫోకస్ పెట్టారు అధినేత. ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ అనూహ్యంగా వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడంపై సీరియస్‎గా ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నెల్లూరు జిల్లాలో మరోసారి వైసీపీ పట్టు నిలపాలని చూస్తున్నారు. అందులో భాగంగానే పోయిన చోట వెతుక్కోవడం కోసం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేస్తున్న సీఎం జగన్.. నెల్లూరు జిల్లా ముఖ్య నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

ఇటీవల నెల్లూరు జిల్లాలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, వరుసగా పార్టీలో రాజీనామాలు, సొంత పార్టీ జిల్లా నేతల్లో నెలకొన్న సంక్షోభం దృష్ట్యా నెల్లూరు జిల్లా రాజకీయంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. బస్సు యాత్రలో విరామం సమయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను పిలిచి వైఎస్ జగన్ మాట్లాడారు. నెల్లూరు జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు.. మారుతున్న రాజకీయ సమీకరణాలు.. పార్టీ వీడిన తర్వాత నెలకొన్న స్థితిగతులపై ప్రత్యేకంగా చర్చించారు. ఇప్పటికే నెల్లూరు జిల్లాను ప్రతిష్టాత్మకంగా భావించిన జగన్.. పార్టీ సీనియర్ నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి కుడి భుజంగా ఉన్న విజయసాయిరెడ్డి‎ని ఎంపీగా బరిలో నిలిపారు. ఈ నేపథ్యంలో ఎలాగైనా నెల్లూరు జిల్లాలో మరోసారి హ్యాట్రిక్ సాధించి పార్టీకి పునర్వైభవాన్ని తీసుకురావాలంటూ నేతలకు దిశా నిర్దేశం చేశారు సీఎం జగన్.

నెల్లూరు జిల్లాపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడానికి ప్రధాన కారణం పార్టీని వీడిన సీనియర్ నేతలను ఓడించడమే అని అంటున్నారు. అందులో భాగంగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్‎గా పేరొందిన విజయ్ సాయి రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా నెల్లూరు నుంచి బరిలోకి దింపారు. ఇప్పటికే పార్టీని వీడిన రెబల్ నేతలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల విషయంలో గట్టిగానే ఫోకస్ పెట్టారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆ ముడు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ పరిధిలో ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా పార్టీ నేతలకు అల్టిమేటం జారీ చేశారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు వీరికి ఏరి కోరి అవకాశం కల్పిస్తే పార్టీకి తీరని అన్యాయం చేశారని భావిస్తున్నారు వైఎస్ జగన్. అందులో భాగంగానే ఆ నలుగురిని ఓడించాలని ప్రయత్నిస్తున్నారు జగన్. అందులో భాగంగానే నెల్లూరు జిల్లాలో ఒక రోజు ప్రత్యేకంగా బస చేసి మరి జిల్లా పార్టీ నేతలతో ప్రత్యేకంగా భేటి అయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…