GVL Narasimha Rao: విశాఖలో పొలిటికల్ తుఫాన్.. కలకలం సృష్టిస్తున్న జీవీఎల్ అనుకూల పోస్టర్లు..!

పోరాడితే పోయేదేం లేదు. ఈ ఫార్ములాను బాగా ఫాలో అవుతున్నారు పొలిటీషియన్స్. గట్టిగా ఫైట్‌ చేస్తే.. రాదనుకున్న టికెట్‌ రానూవచ్చు..! బహుశా అందుకేనేమో.. టికెట్‌ రాదని కూల్‌ అయిన జీవీఎల్‌ కూడా మళ్లీ ప్రయత్నం మొదలుపెట్టారట. కుటుంబం కోసం త్యాగం చేయాల్సి వచ్చిందని చెప్పిన తరువాత కూడా.. ఢిల్లీ లెవెల్‌లో ట్రై చేస్తున్నారట.

GVL Narasimha Rao: విశాఖలో పొలిటికల్ తుఫాన్.. కలకలం సృష్టిస్తున్న జీవీఎల్ అనుకూల పోస్టర్లు..!
Gvl Narasimha Rao
Follow us
Eswar Chennupalli

| Edited By: Balaraju Goud

Updated on: Apr 06, 2024 | 12:39 PM

పోరాడితే పోయేదేం లేదు. ఈ ఫార్ములాను బాగా ఫాలో అవుతున్నారు పొలిటీషియన్స్. గట్టిగా ఫైట్‌ చేస్తే.. రాదనుకున్న టికెట్‌ రానూవచ్చు..! బహుశా అందుకేనేమో.. టికెట్‌ రాదని కూల్‌ అయిన జీవీఎల్‌ కూడా మళ్లీ ప్రయత్నం మొదలుపెట్టారట. కుటుంబం కోసం త్యాగం చేయాల్సి వచ్చిందని చెప్పిన తరువాత కూడా.. ఢిల్లీ లెవెల్‌లో ట్రై చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే జీవిఎల్‌కు మద్దతుగా విశాఖలో వెలసిన ఫ్లెక్సీలు తీవ్ర కలకలం సృష్టి్స్తున్నాయి.

విశాఖ ఎంపీ టికెట్‌పై జీవీఎల్‌ కూల్ అయినట్టే కనిపించారు. టికెట్‌ ఇక తనకు రాదు అని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు కాకపోయినా ఇంకెప్పుడైనా తానే విశాఖలో పోటీలో ఉంటానన్నారు. ఆల్‌ ఆఫ్‌ సడెన్.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే స్టాండ్‌ తీసుకున్నట్టున్నారు. ఈ క్రమంలోనే జీవీఎల్ కు విశాఖ ఎంపీ సీటు కేటాయించాలాంటూ వారం రోజులుగా పలు రకాల కార్యక్రమాలు జరుపుతున్నారు ఆయన మద్దతుదారులు. విశాఖ లాంటి బీజేపీకి బలం ఉన్న, గతంలో విజయం సాధించిన చోట టికెట్ కేటాయించకపోవడం అన్యాయం అంటూ ప్రెస్ మీట్ లు, ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలను కలవడం లాంటి యాక్షన్ ప్లాన్ కొనసాగుతూ ఉంది.

తాజాగా విశాఖ పార్లమెంట్ 7 నియోజకవర్గాల్లో ఫ్లెక్సీలు కట్టి నిరసన తెలిపింది జన జాగరణ సమితి అనే ఓ సంస్థ. మన విశాఖ అభివృద్ధి కోసం నిబద్ధతతో పని చేస్తూ పదే పదే పార్లమెంట్ లో విశాఖ గళం వినిపించిన బీజేపీ సీనియర్ నాయకులు జీవీఎల్ నరసింహారావుకు విశాఖ ఎంపీ సీటు కేటాయించకపోవడం అన్యాయం అన్నది వాళ్ళ అవేదన. ఆ తరహా ఫ్లెక్సీలను పీఎం పాలెం క్రికెట్ స్టేడియం, మద్దిలపాలెం జంక్షన్ లో ఏయూ ఇంజనీరింగ్ గేటు, సిరిపురం జంక్షన్ లో, జగదాంబ జంక్షన్ లో, ద్వారకా నగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా, గురుద్వారా జంక్షన్ లో, ఎన్ఏడి జంక్షన్ లో, గాజువాక జంక్షన్ లో కట్టడం జరిగింది.

ఈ సందర్భంగా జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు మాట్లాడుతూ ఒరిజినల్ బీజేపీ సీనియర్ నాయకుడిగా జీవీఎల్ నరసింహారావుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా కేంద్ర మంత్రులు అందరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందువల్ల విశాఖ అభివృద్ధికి నిధులు కేటాయించడంతోపాటు ఇక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో సమస్యలను పరిష్కరించాలని అనేక మార్లు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారన్నారు. కొన్ని సమస్యలను పరిష్కరించిన విషయం కూడా విశాఖ వాసులందరికీ బాగా తెలుసనీ, మనదేశంలో కేంద్ర మంత్రులు అత్యధికంగా పర్యటనలు చేసిన పార్లమెంట్ నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది కేవలం విశాఖపట్నం మాత్రమే అన్నారు. జీవీఎల్ విశాఖ అభివృద్ధి పట్ల నిబద్ధతతో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కేంద్ర మంత్రులను విశాఖ పర్యటనకు ఆహ్వానించడం జరిగిందన్నారు.

విశాఖపట్నంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు అత్యధికంగా ఉండడం వల్ల అందులో పని చేస్తున్న నార్త్ ఇండియన్ ఉద్యోగులు, వ్యాపారులు బీజేపీకి అనుకూలంగా ఉంటారని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఏపీలో బీజేపీకి కొంత బలంగా ఉన్నది విశాఖపట్నంలో మాత్రమే. అలాంటప్పుడు బీజేపీకి విశాఖపట్నం పార్లమెంటు సీటును కనీసం కోరుకోలేదంటే, ఇతరుల రాజకీయాలకు జీవీఎల్ బలి అయ్యారని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

మరో ప్రతిపాదన కూడా చేస్తోంది జీవీఎల్ అనుచరవర్గం. సరే.. పోటీలో టీడీపీనే ఉండనివ్వండి, కాకపోతే ఫ్లెండ్లీ కాంటెస్ట్‌కు అనుమతి ఇవ్వండి అని కోరుతోంది. స్నేహపూర్వక పోటీ చేసేందుకు పర్మిషన్‌ అడుగుతున్నారు. దీనర్థం ఏంటి? ఇప్పటికే ప్రకటించిన ఎన్డీయే అభ్యర్థిని ఓడించడమా? లేక బీజేపీ అభ్యర్ధే గెలుస్తారని చెప్పడమా? టీడీపీ-జనసేన సపోర్ట్‌ లేకుండా విశాఖలో బీజేపీ అభ్యర్ధిగా గెలవడం సాధ్యమేనా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. 2014లో విశాఖ ఎంపీగా గెలిచారు హరిబాబు. అప్పుడు టీడీపీ-జనసేన మద్దతు ఉంది. ఇప్పుడు స్నేహపూర్వక పోటీ అని చెప్పి బీజేపీ ఒంటరిగా వెళ్తే జీవీఎల్ గెలుస్తారా? టీడీపీ-జనసేన శ్రేణులు సపోర్ట్ చేస్తాయా? ఏదేమైనా టికెట్‌ కోసం జీవీఎల్ ప్రయత్నించడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…