AP News: మహిళా ప్రయాణికురాలిపై టీసీ దురుసు ప్రవర్తన.. రన్నింగ్ ట్రైన్‌లో నుంచి అమాంతంగా..
రాయలసీమ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళా ప్రయానీకురాలితో టీటీఈ దురుసుగా ప్రవర్తించాడు. కదులుతున్న రైలు నుంచి కిందకు తోసేయడంతో ఆమెకు గాయాలు అయ్యాయి. ఆ మహిళ రాజంపేట లోని రెండవ ఫ్లాట్ ఫాంకు- కదులుతున్న రైలుకు మధ్యలో పడి నడుము విరిగి తీవ్ర గాయాలకు గురైనట్లు బాధితురాలి బంధువులు..
కడప, సెప్టెంబర్ 1: రాయలసీమ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళా ప్రయానీకురాలితో టీటీఈ దురుసుగా ప్రవర్తించాడు. కదులుతున్న రైలు నుంచి కిందకు తోసేయడంతో ఆమెకు గాయాలు అయ్యాయి. ఆ మహిళ రాజంపేట లోని రెండవ ఫ్లాట్ ఫాంకు- కదులుతున్న రైలుకు మధ్యలో పడి నడుము విరిగి తీవ్ర గాయాలకు గురైనట్లు బాధితురాలి బంధువులు తెలిపారు
మానవత్వం మంటగలిసి టీటీఈ మహిళను రైలులో నుంచి తోసేసాడు. ఓ ప్రయాణికురాలు తిరుపతి నుంచి కడపకు వెళ్లేందుకు జనరల్ బోగీలో ఎక్కాల్సి ఉంది. అయితే తిరుపతిలో రైలు కదలడంతో ఆమె అందుబాటులో ఉన్న రిజర్వేషన్ బోగీలో ఎక్కింది. అయితే టీటీఈ రాజంపేటలో ఆమె రిజర్వేషన్ బోగీలో ఎక్కి ఉండటాన్ని ఒప్పుకోకుండా కిందికి తోసేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ప్రయానికురాలు ఫ్లాట్ ఫాంకు – రైలుకు మధ్యలో పడి గాయలపాలైంది. విషయం డ్రైవర్ కు తెలియడంతో రైలు ను నిలిపి వేసినట్లు తెలిసింది. అనంతరం సదరు ప్రయానికురాలిని తోటి బంధువులు హాస్పిటల్ కు తరలించినట్లు సమాచారం.
గాయపడ్డ మహిళా ప్రయాణికురాలు నడుము విరిగినట్లు బంధువులు తెలిపారు. కడపకు వెళుతూ రైలు రావడంతో జనరల్ భోగి వద్దకు వెళ్లే సమయం లేక రిజర్వేషన్ బోగీలో సదరు మహిళా ప్రయాణికురాలు ఎక్కిందని వారు తెలిపారు టిడిఈ ని ఎంత వేడుకున్న కనికరించకపోగా ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించారని తోటి ప్రయాణికులు పేర్కొన్నారు. ప్రయాణికులంతా కేకలు వేయడంతో టీటీఈ పై ప్రయాణికులు దాడి చేస్తారేమోనని రాయలసీమ ఎక్స్ప్రెస్ ను సిగ్నల్ ఇచ్చి తొందరగా పంపించేసారని ప్రయాణికులు వాపోయారు. ఈ సంఘటనపై రైల్వే ఉన్నతాధికారులు విచారణ జరిపించాలని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావతం కాకుండా చూడాలని రైల్వే స్టేషన్ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.