Success Story: ఒకరు మనసును చదివితే.. మరొకరు దూసుకుపోతున్నారు.. అమెరికాలో సంచలనం సృష్టించిన తెలుగు అక్కాచెల్లెలు
Arikepudi Sisters: కృష్ణాజిల్లా పోరంకి కి చెందిన ఇషిత కన్నతల్లిదండ్రులు భరత్ కుమార్ , మంజుల.. ఈ దంపతులు వృత్తిరీత్యా అమెరికాలో సెటిల్ అయ్యారు. అయితే ఇషిత చిన్ననాటి నుండి ఆస్ట్రోనాట్స్ వైఫై వెళ్లాలని ఆసక్తి చూపేది. ఓ రోజు ఉపాధ్యాయులు , ఫ్రెండ్స్ కలిసి నాసా విజ్ఞాన యాత్రకు వెళ్లడంతో ఆమె డ్రీమ్ నెరవేరడానికి బీజం పడింది. అంతరిక్ష యాత్రికులతో పాల్గొని తాను కూడా మార్స్ వైపు ప్రయాణించాలని నిర్ణయం తీసుకుంది.
విజయవాడ, సెప్టెంబర్ 01: ఇద్దరు అక్కాచెల్లెళ్లు.. కృష్ణాజిల్లాకు చెందిన తెలుగు యువతులే.. ఇప్పుడు అమెరికాలో వారిద్దరూ ప్రతిభను చాటున్నారు. ఆకాశమే హద్దుగా ఒకరు ఎగురుతుంటే.. మానసిక సమస్యలు పరిష్కరించటంలో మరొకరు నైపుణ్యం చాటుతున్నారు.. వారి రంగాలు వేరైనా ఇద్దరు అక్కచెల్లెలు అతి చిన్న వయసులోనే అరికెపూడి సిస్టర్లుగా ఓ బ్రాండ్ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు.
సాధారణంగా పిల్లలు ఆడుకునే వయసులో ఏదైనా వాహనం నేర్చుకుంటూ ఉంటే కన్నాతల్లిదండ్రులకు ఎంతో టెక్షన్ ఉంటుంది. డ్రైవింగ్ సరిగ్గా చేస్తారో.. లేదో అనే ఆందోళననకు గురికావడం సహజం.. కానీ అలాంటిది ఇషిత అనే యువతీ 16ఏళ్ల వయసులోనే విమానం తీసుకుని ఆకాశంలో దూసుకెళుతుంది. వాటికి కావలసిన లైసెన్స్‌ను అతి చిన్న వయసులోనే సాధించిన ఘనత ఆ యువతికి దక్కింది. ఇప్పుడు నాసాలోని ఆస్ట్రోనాట్ గా మార్స్ వైపు తన ప్రయాణం కొనసాగించాలని ఎంతో కృషి చేస్తుంది.
కృష్ణాజిల్లా పోరంకి కి చెందిన ఇషిత కన్నతల్లిదండ్రులు భరత్ కుమార్ , మంజుల.. ఈ దంపతులు వృత్తిరీత్యా అమెరికాలో సెటిల్ అయ్యారు. అయితే ఇషిత చిన్ననాటి నుండి ఆస్ట్రోనాట్స్ వైఫై వెళ్లాలని ఆసక్తి చూపేది. ఓ రోజు ఉపాధ్యాయులు , ఫ్రెండ్స్ కలిసి నాసా విజ్ఞాన యాత్రకు వెళ్లడంతో ఆమె డ్రీమ్ నెరవేరడానికి బీజం పడింది. అంతరిక్ష యాత్రికులతో పాల్గొని తాను కూడా మార్స్ వైపు ప్రయాణించాలని నిర్ణయం తీసుకుంది.
అయితే అంతరిక్షంలో ప్రయాణించాలంటే నేను కూడా పైలెట్ కావాలని నిర్ణయించుకుంది.. ఎంతో కష్టపడి దానికి కావాల్సిన శిక్షణను పొందింది.. విజయానికి తొలిమెట్టులో భాగంగా అతి చిన్నవయసులో విమానం నడిపి అందరిని ఔరా అనిపించింది. ఇషితా చెల్లెలు అరెకపూడి తాన్వి ఆమెకు 13 ఏళ్ళు వయసు.. తాన్వికి ప్రతిభ అపారం.. తన తోటి పిల్లలో ఉన్న మానసిక ఒత్తిళ్లు , ఆందోళనపై అధ్యాయం చేసి వాటి పరిష్కరానికి ఓ పుస్తకం కూడా రాసింది..
ఒత్తిళ్లకు కారణం తమలోని బాధను దాచిపెట్టుకొని ఇతరులకు పంచుకోకపోవడమై ప్రదన కారణంగా పేర్కొంది.. ఐర్లాండ్ నుంచి కుటుంబం అమెరికాకు మారినప్పుడు కొత్త వాతావరణం ,, కొత్త పరిచయాలు, కొత్త ఫ్రెండ్స్ వంటి సంఘటనల కారణంకా తాను పడిన మానసిక సమస్యలు మరెవ్వరికీ రాకూడని పెద్దరికంగా ఆలోచనాకేసి వినూత్న కార్యక్రమాన్ని నాంది పలికింది..
తాన్వి అప్ లిస్ తీన్స్ టూడే అనే పేరుతో పుస్తకం రాసి తాన్వి అమెరికాలో సంచలనమే సృష్టించింది.. వివిధ స్కూల్స్కు తాన్వి చేసిన సూచనలు ఆదర్శంగా నిలిచాయి.. చిన్నపిల్లలు మానసిక సమస్యలు పరిష్కరించేందుకు మూడు సంస్థలు తాన్వి తో ఎంఓయూ కుదుర్చుకున్నాయి.. ఓ వైపు తన చదువును కొనసాగిస్తూనే డబ్బు సంపాదిస్తూ తాన్వి యూత్ అంబాసిడర్ గా పేరును సొంతం చేసుకుంది..
విదేశాలలో ప్రతిభను కనబరిచిన తమ మనవరాళ్లను చూసి స్వగ్రామం పోరంకిలో ఉండే తాతయ్య , నానమ్మ ఎంతో ఆనడం వ్యక్తం చేస్తున్నారు.. మన దేశానికి ,కుటుంబానికి మంచి పేరు తెచ్చేలా తమ మనవరాళ్లు కృషిచేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.. అగ్రదేశంలో తెలుగు వారి సత్త చాటుతున్న తెలుగు చిన్నారుల భవిష్యత్తు మరింత బంగారం కావాలని మనమందారం ఆశిద్దాం..
విదేశాలలో ప్రతిభను కనబరిచిన తమ మనవరాళ్లను చూసి స్వగ్రామం పోరంకిలో ఉండే తాతయ్య , నానమ్మ ఎంతో ఆనడం వ్యక్తం చేస్తున్నారు.. మన దేశానికి ,కుటుంబానికి మంచి పేరు తెచ్చేలా తమ మనవరాళ్లు కృషిచేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.. అగ్రదేశంలో తెలుగు వారి సత్త చాటుతున్న తెలుగు చిన్నారుల భవిష్యత్తు మరింత బంగారం కావాలని మనమందారం ఆశిద్దాం..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం