AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూల్ న్యూస్.. ఐదు రోజులపాటు భారీ వర్షాలు.. లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

Telangana Rains: తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతున్నాయి. జూలై నెలలో భారీగా కురిసిన వర్షాలు.. ఆగస్టు నెలలో పూర్తిగా తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. వర్షాలు లేకపోవడం, మరోవైపు రోజురోజుకు పెరుగుతున్న ఎండలతో జనం అల్లాడుతున్నారు. అంతేకాకుండా ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ప్రారంభమవ్వడంతో రైతులు వర్షాల కోసం ఆకాశం వైపు ధీనంగా ఎదురుచూస్తున్నారు.

Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూల్ న్యూస్.. ఐదు రోజులపాటు భారీ వర్షాలు.. లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తప్పేలా కనిపించడం లేదు. ఎందుకంటే.! బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల అవకాశాలు ఉన్నాయి. మరో 24 గంటల్లోనే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది.
S Navya Chaitanya
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Sep 01, 2023 | 2:56 PM

Share

Telangana Rains: తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతున్నాయి. జూలై నెలలో భారీగా కురిసిన వర్షాలు.. ఆగస్టు నెలలో పూర్తిగా తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. వర్షాలు లేకపోవడం, మరోవైపు రోజురోజుకు పెరుగుతున్న ఎండలతో జనం అల్లాడుతున్నారు. అంతేకాకుండా ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ప్రారంభమవ్వడంతో రైతులు వర్షాల కోసం ఆకాశం వైపు ధీనంగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. గత నెల రోజులుగా పూర్తిగా తగ్గిపోయిన వర్షాలు మళ్ళీ మొదలయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈరోజు నుంచి రెండు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సెప్టెంబర్ 3,4,5 తేదీల్లో తెలంగాణలోని తూర్పు, ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 5, 6 తేదీల్లో వాయువ్య, మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో తెలికపాటి నుంచి.. ఓ మోస్తరు.. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

అంతేకాకుండా.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అదిలాబాద్, కొమరం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఇప్పటికే ఆగస్టు నెల మొత్తం వర్షాలు లేనందున దాదాపు 66% లోటు వర్షపాతం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ లో కాస్త మెరుగుపడి అప్పుడప్పుడు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ సూచించింది. ఈ వారం రోజులపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తేలిక పార్టీ నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ క్రమంలో ఐదు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటన జారీ చేసింది.

ఇవి కూడా చదవండి

కాగా.. వర్షాలు లేకపోవడంతో పలు ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయని రైతులు పేర్కొంటున్నారు. ఇదిలాఉంటే.. రుతుపవనాల ప్రభావంతో ఏపీలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. సెప్టెంబరు మొదటి వారంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది.

మరిన్ని తెలంగాణ రాష్ట్ర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే