AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Politics: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్ట్.. విశాఖ నుంచి కృష్ణా జిల్లాకు తరలింపు.. కారణం అదేనా..

Chintakayala Ayyanna Patrudu Arrest: అయ్యన్న ను విశాఖ ఎయిర్ పోర్ట్ లాంజ్ లోనే అరెస్ట్ చేసిన అనంతరం పోలీసులు చాలా గోప్యంగా అయ్యన్నను అక్కడ నుంచి తరలించారు. అరెస్ట్ విషయం బయటకు తెలిస్తే టీడీపీ శ్రేణులు రోడ్ల పైకి వచ్చే అవకాశం ఉంటుందని భావించి చివరకు ఎయిర్ పోర్ట్ పోలీసులకు కూడా సమాచారం ఇవ్వలేదు. విశాఖ నుంచి జాతీయ రహదారిపై అనకాపల్లి మీదుగా తరలిస్తున్నారు. ఇక్కడకు తీసుకెళ్తారన్న సమాచారం ఇంకా లేదు.

AP Politics: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్ట్.. విశాఖ నుంచి కృష్ణా జిల్లాకు తరలింపు.. కారణం అదేనా..
Chintakayala Ayyanna Patrudu
Eswar Chennupalli
| Edited By: Sanjay Kasula|

Updated on: Sep 01, 2023 | 12:43 PM

Share

విశాఖపట్నం, సెప్టెంబర్ 01: మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుని విశాఖ ఎయిర్పోర్టులో కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. యువగళం పాదయాత్ర సందర్భంగా గన్నవరం లో యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి తో పాటు మంత్రులపై అయ్యన్న చేసిన వ్యాఖ్యలపై కృష్ణ జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అయ్యన్న అరెస్ట్ మరోసారి సంచలనానికి దారి తీసింది.

ఈ ఉదయం ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో హైదరాబాద్ నుంచి అయ్యన్న విశాఖ వచ్చిన సందర్భం లో అప్పటికే అక్కడ వేచి చూస్తున్న కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.

గోప్యంగా తరలింపు

అయ్యన్న ను విశాఖ ఎయిర్ పోర్ట్ లాంజ్ లోనే అరెస్ట్ చేసిన అనంతరం పోలీసులు చాలా గోప్యంగా అయ్యన్నను అక్కడ నుంచి తరలించారు. అరెస్ట్ విషయం బయటకు తెలిస్తే టీడీపీ శ్రేణులు రోడ్ల పైకి వచ్చే అవకాశం ఉంటుందని భావించి చివరకు ఎయిర్ పోర్ట్ పోలీసులకు కూడా సమాచారం ఇవ్వలేదు. విశాఖ నుంచి జాతీయ రహదారిపై అనకాపల్లి మీదుగా తరలిస్తున్నారు. ఇక్కడకు తీసుకెళ్తారన్న సమాచారం ఇంకా లేదు.

ఆత్కూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు

గన్నవరం సభలో ప్రసంగాలకు సంబందించి అయ్యన్న పై కేసు నమోదైంది. మాజీ మంత్రి పేర్ని నాని ఫిర్యాదుతో అయ్యన్నపై కేసు నమోదు చేశారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అయ్యన్నపై 153 A, 354 A1(4), 504, 505(2), 509 ఐపీఎస్ సెక్షన్ల కింద ఆత్కూరు స్టేషన్ లో కేసు నమోదైంది

అయ్యన్న అరెస్ట్ పై లోకేష్

అరెస్టులతో మా గొంతు నొక్కలేవు జగన్ అంటూ అయ్యన్న అరెస్ట్ పై స్పందించారు టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్. నీ అణిచివేతే మా తిరుగుబాటనీ, అయ్యన్నపాత్రుడు గారి అరెస్ట్ సైకో పాలనకి పరాకాష్ట. అయ్యన్న గారి వ్యాఖ్యలే రెచ్చగొట్టే వ్యాఖ్యలు అయితే సిఎం గా ఉండి జగన్, వైసిపి నేతల వ్యాఖ్యలను ఏమి అనాలి? అన్నారు. వైసిపి నాయకులు, మంత్రుల బూతులు పోలీసులకు ప్రవచనాల్లా వినిపిస్తున్నాయా? ఆన్న లోకేష్ రాజారెడ్డి రాజ్యాంగం లో అధికార పార్టీ నాయకులకు ప్రత్యేక హక్కులు కల్పించారా? అని ప్రశ్నించారు. ప్రజల గళాన్ని వినిపిస్తున్న అయ్యన్న గారి అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు లోకేష్.