YSR Health University: మెడికల్ పీజీ అడ్మిషన్లు రద్దు చేసిన హెల్త్ యూనివర్సిటీ.. సీట్ల విషయంలో ఫేక్ అనుమతులతో..
Medical PG counselling: మూడు దశల్లో కౌన్సిలింగ్ నిర్వహించేలా మొదట్లో నిర్ణయించారు.దీంట్లో భాగంగా మొదటి విడత పూర్తయింది.సెప్టెంబర్ రెండో తేదీలోగా ప్రవేశాలు పొందిన విద్యార్థులు కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంది ఈలోగా అడ్మిషన్ల ను రద్దు చేస్తూ హెల్త్ యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో 50 రాష్ట్ర కోటా తో పాటు యాజమాన్య కోటా సీట్లను వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం భర్తీ చేస్తుంది...
ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ఇప్పటికే పూర్తయిన అడ్మిషన్ల ను రద్దు చేస్తూ విజయవాడలోని డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకుంది.మొత్తం అడ్మిషన్ల ప్రక్రియను మళ్లీ మొదటి నుంచి జరుపుతామని యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికా రెడ్డి ప్రకటించారు ఇప్పటికే కన్వీనర్ కోటా, ఇన్ సర్వీస్ కోటా తో పాటు మేనేజ్మెంట్ కోటా అడ్మిషన్ల ప్రక్రియ మొదటి విడత ముగిసింది.
మొత్తం మూడు దశల్లో కౌన్సిలింగ్ నిర్వహించేలా మొదట్లో నిర్ణయించారు.దీంట్లో భాగంగా మొదటి విడత పూర్తయింది.సెప్టెంబర్ రెండో తేదీలోగా ప్రవేశాలు పొందిన విద్యార్థులు కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంది ఈలోగా అడ్మిషన్ల ను రద్దు చేస్తూ హెల్త్ యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో 50 రాష్ట్ర కోటా తో పాటు యాజమాన్య కోటా సీట్లను వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం భర్తీ చేస్తుంది.
మిగిలిన సీట్లను మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ జాతీయ స్థాయి కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తుంది.రాష్ట్రంలో పలు కాలేజీల్లో నకిలీ అనుమతులు తీసుకున్నట్లు NMC నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా కౌన్సెలింగ్ ను రద్దు చేశారు అధికారులు.
మళ్లీ మొదటికొచ్చిన కౌన్సెలింగ్..
పీజీ మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లకు దేశవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది.దీంతో కాలేజీలు,కోర్సుల అనుమతుల విషయంలో నేషనల్ మెడికల్ కమిషన్ పగడ్బందీగా ముందుకెళ్తుంది.రాష్ట్రంలోని పలు మెడికల్ కళాశాలల్లో సీట్లు,అనుమతుల విషయంలో ఫోర్జరీ పత్రాలు సృష్టించినట్లు NMC గుర్తించింది ఇదే సమాచారం డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ కి అందించడంతో అడ్మిషన్ల ప్రక్రియను రద్దు చేశారు అధికారులు.
పీజీ సీట్ల అనుమతులు పై..
తిరిగి మళ్లీ వెబ్ ఆప్షన్ ల నమోదుకు కొత్తగా పేజ్-1 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు.నంద్యాల లోని శాంతిరామ్ మెడికల్ కళాశాల లో పీజీ సీట్ల పెంపుపై నేషనల్ మెడికల్ కమిషన్ ఇచ్చినట్లు ఫేక్ పర్మిషన్లు వెలుగుచూశాయి. దీంతో మొత్తం అన్ని కాలేజీల్లో పీజీ సీట్ల అనుమతులు పై అధికారులు తనికీలు చేస్తున్నారు ఆయా కాలేజీలకు NMC నుంచి ఎన్ని సీట్లు మంజూరు అయ్యాయి అనే దానిపై స్పెషలైజేషన్ ల ఆధారంగా తనికీలు చేస్తున్నారు.
శాంతిరామ్ కాలేజీ తో పాటు జీఎస్ఎల్,మహారాజా మెడికల్ కాలేజీల్లో అనుమతించిన సీట్లకు,ఎన్ఎంసి వెబ్ సైట్ లో ఉన్న లెక్కకు తేడా ఉన్నట్లు గుర్తించిన అధికారులు… స్పష్టత కోసం NMC కు లేఖ రాశారు.పూర్తి స్పష్టత వచ్చిన తర్వాత కొత్తగా సీట్ మాట్రిక్స్ ను రూపొందించి తిరిగి నోటిఫికేషన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం