AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: బెడ్‌రూమ్‌లో ఏసీ ఆన్ చేయగానే.. వినిపించిన వింత శబ్దాలు.. ఏంటని చూడగా.!

మీకు ఏసీ ఉందా..? చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చెట్లు పొదలు కూడా ఉన్నాయా..? అయితే.. బీ కేర్ ఫుల్..! సర్పాలు అక్కడ ఇక్కడ అని కాదు. ఎక్కడైనా తన అనువుగా ఉందనుకున్న ప్రాంతాల్లో సంచరిస్తాయి. ఇప్పుడు ఏకంగా ఏసీలోకి చొరబడింది ఓ పాము. వాతావరణం వేడెక్కడంతో చల్లదనం కోసం ఏమోగానీ..

AP News: బెడ్‌రూమ్‌లో ఏసీ ఆన్ చేయగానే.. వినిపించిన వింత శబ్దాలు.. ఏంటని చూడగా.!
Wall Air Conditioner
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Sep 01, 2023 | 11:17 AM

Share

ఈ మధ్యకాలంలో సరీసృపాలు తమ ఆవాసాలను వదిలేసి.. జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయ్. అలా వచ్చేసి జనాల్లో భయభ్రాంతులను పుట్టిస్తున్నాయి. ఇక ఇలాంటి ఘటనలు మనం తరచూ చూస్తూనే ఉంటున్నాం. ఆ ఘటనలకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.

మీకు ఏసీ ఉందా..? చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చెట్లు పొదలు కూడా ఉన్నాయా..? అయితే.. బీ కేర్ ఫుల్..! సర్పాలు అక్కడ ఇక్కడ అని కాదు. ఎక్కడైనా తన అనువుగా ఉందనుకున్న ప్రాంతాల్లో సంచరిస్తాయి. ఇప్పుడు ఏకంగా ఏసీలోకి చొరబడింది ఓ పాము. వాతావరణం వేడెక్కడంతో చల్లదనం కోసం ఏమోగానీ.. ఇండోర్ యూనిట్లో తిష్టవేసుకుని కూర్చుంది. బెడ్ రూమ్‌లో ఏసీ వేసుకొని సేద తీరేందుకు వెళ్లిన కుటుంబానికి.. ఏసీ ఇండోర్ యూనిట్ నుంచి తొంగి చూస్తున్నట్టుగా పాము కనిపించడంతో దెబ్బకు పరుగులు పెట్టారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో చోటు చేసుకుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా.?

వివరాల్లోకి వెళ్తే.. విశాఖ స్టీల్ ప్లాంట్ టౌన్‌షిప్‌లోనే ఓ ఇంట్లో జెర్రిగొడ్డు పాము కలకలం రేపింది. ఏసీ యూనిట్లో ఈ పాము దూరి ఇంచక్కా సేద తీరుతోంది. బెడ్ రూమ్ ఏసీలోంచి తొంగి చూస్తున్న పామును చూసి వణికిపోయి పరుగులు పెట్టారు ఆ కుటుంబం. ఏసీ ఇండోర్ యూనిట్ నుంచి ఏడు అడుగుల జెర్రిగొడ్డును బయటకు తీశాడు స్నేక్ క్యాచర్ కిరణ్.

ఆ పాము వచ్చింది అందుకోసమేనా..!

సెక్టర్ 11లోని ఉక్కు ఉద్యోగి రామస్వామి ఇంట్లోని ఏసీలోకి చొరబడింది ఆ పాము. పామును చాకచక్యంగా బయటకు తీయడంతో ఊపిరి పీల్చుకుంది ఆ కుటుంబం. ఏసీ అవుట్ డోర్ యూనిట్ నుంచి.. పైపు గుండా.. ఇండోర్ యూనిట్లోకి వచ్చి ఉంటుందని అంటున్నారు స్నేక్ క్యాచర్ కిరణ్. ఒకవైపు వేడితో బయటంతా భగభగలాడుతుంటే.. చల్లదనం కోసం ఏసీలోకి దూరడంతో పాటు.. అక్కడ ఉన్న కొన్ని రకాల పురుగులను ఆహారంగా తినేందుకు వచ్చి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా.. ఏకంగా బెడ్ రూమ్ ఏసీలోనే పాము కనిపించడంతో ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా కలకలం రేపుతుంది. ఉక్కు టౌన్‌షిప్‌లో ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకిన వెంటనే.. ఏసీ వేసుకోవాలంటే చాలు కాస్త ఆలోచిస్తున్నారు కొంతమంది. ఎందుకంటే ఏసీలోకి దూరిన ఆ పాము.. అంతలా స్థానిక ప్రజల్లోకి భయాన్ని పెంచింది.

Snake In Vizag

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..