అనంతలో మారని కాకీల తీరు.. తెల్లకాగితాలపై సంతకాలు..రైతు కుటుంబంపై అరాచకం..

అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి పోలీసులు మరోసారి వివాదస్పదమయ్యారు. ఇటీవల ఇంటి పునాదికి మట్టిని తరలించే విషయంలో ఇరుకుటుంబాల మధ్య తలెత్తిన ఘర్షణలో టీడీపీ సానూభూతిపరుడి వెంకటరాముడిపై..

అనంతలో మారని కాకీల తీరు.. తెల్లకాగితాలపై సంతకాలు..రైతు కుటుంబంపై అరాచకం..
Police Custody
Follow us

|

Updated on: Mar 17, 2022 | 10:00 AM

అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి పోలీసులు మరోసారి వివాదస్పదమయ్యారు. ఇటీవల ఇంటి పునాదికి మట్టిని తరలించే విషయంలో ఇరుకుటుంబాల మధ్య తలెత్తిన ఘర్షణలో టీడీపీ సానూభూతిపరుడి వెంకటరాముడిపై ఎన్ఐ కొట్టారని ఆరోపణలు వచ్చాయి. స్థానికంగా ఉన్న వైసీపీ కార్యకర్త నరసింహులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంకటరాముడిని ఎస్ఎ విచక్షణారహితంగా కొట్టారని.. దెబ్బలకు తాళలేక కాళ్లు పట్టుకుంటా వదిలేయండి అని వేడుకున్నా ఎస్ఐ వినలేదని అప్పట్లో బాధితుడు కన్నీరుమున్నీరయ్యాడు. ఆ సమయంలో బాధితున్ని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం అక్కడి నుంచి పంపేయడం.. తర్వాత బాధితున్ని మాజీ మంత్రి పరిటాల సునీత చొరవతో ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించడం జరిగాయి. ఈ ఘటనపై మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా మానవ హక్కుల కమిషన్ స్పందించి సుమోటోగా తీసుకుంది.

అడిషనల్ ఎస్పీతో విచారణ చేయించి ఏప్రిల్ 6వ తేదీన నివేదిక సమర్పించాలని ఎస్పీని కమిషన్ చైర్మన్ సీతారామమూర్తి, జ్యుడీషియల్ సభ్యుడు దండే సుబ్రమణ్యం ఆదేశించారు. చెన్నేకొత్తపల్లి మండలం గంగినేపల్లె నరసింహులుతో పాటు సంబంధిత పోలీసు స్టేషన్ ఎస్ఐ, స్టేషన్ ఆఫీసర్, ధర్మవరం డీఎస్పీ, జిల్లా ఎస్పీలకు కమిషన్ నోటీసులు ఇచ్చింది.

ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు ఇవాళ వెంకట్రాముడితో పాటు అతని కుమారులను స్టేషన్ కు పిలించి. ఖాలీ పేపర్లపై సంతకాలు చేయించుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే అమాయకులైనా వెంకట్రాముడితో పాటు అతని కుమారులతో సంతకాలు ఎందుకు చేయించుకున్నారని ప్రశ్నించగా.. మేమేమి మీ ఆస్తులు రాయించుకోలేదంటూ అక్కడున్న కానిస్టేబుళ్లు సమాధానం ఇచ్చిన వీడియో వైరల్ గా మారడంతో ఉన్నతాధికారులు విచారమ చేస్తున్నట్టు సమాచారం.

ఇవి కూడా చదవండి: Congress: తారాస్థాయికి చేరిన కుమ్ములాట.. ఇవాళ గులాం నబీ ఆజాద్‌తో భేటీ కానున్న సోనియా

Covid Alert: ముంచుకొస్తున్న కరోనా ఫోర్త్‌ వేవ్‌ ముప్పు.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం..

Latest Articles